S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/20/2019 - 22:16

ఒక గొప్ప ధనవంతుడు చివరి రోజుల్లో చాలా నిరాశతో ఉండేవాడు.అనేక విజయాలు సాధించినతరువాత సహజంగా నిరాశే మిగులుతుంది. ఎందుకంటే, విజయం ఓడినంతగా ఏదీ ఓడిపోదు. మీరు ఓడినపుడే విజయానికి ప్రాముఖ్యత లభిస్తుంది. అయితే విజయం సాధించిన తరువాత ఈ ప్రపంచం, సమాజం, మనుషువల్ల మీరుఎలా మోసపోయారో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అందుకే దానికోసం ఆరాటపడడం ప్రారంభించాడు.

03/20/2019 - 22:15

కృష్ణపత్నులు:
ఐననొక్క సందియమ్ము మనమున మిగిలేను
ఎవ్వరు విశ్వామిత్రుడు? ఎవరు వశిష్ఠుండు?

వారి మాట దశరథుండు మీరకుండుటేమి?
అతని మాట నాతయుడు ఆచరించుటేమి?

శ్రీకృష్ణుడు:
విశ్వానికె మిత్రుడోయి విశ్వామిత్రుండు
రాశిపోసి రిక్కలనే చేయును జన్నమ్ము

శిష్టులలో శిష్టుండు వశిష్ఠుండు సుమీ
ఆతని మించిన ఘనుండీతడు ఎరుగండి

03/19/2019 - 22:41

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*

03/19/2019 - 22:39

ఇటుల విశ్వరహస్యాల వినగ లేదు మేము
ఇటుల నెవరు వివరమ్ముగ విప్పి చెప్పలేదు

ఐనతోడ కైక ఎవరు? మంథరమ్మ ఎవరు?
కక్షతోడ శ్రీరాముని కానల కంపేరు?

శ్రీకృష్ణుడు:
రాత్రింబవలుల కథయే రామాయణమోరుూ!
రాత్రులు చెరలోన సీత! పగలు రాజభోగం!

పొడుపు కథలు వినియుందురు- విడుపులు వినియుందురు
అట్టి పొడుపు విడుపులతో కూడినదే రామకథ!

03/18/2019 - 19:16

దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవ నారసింహ క్షేత్రాలలో నొకటిగా, ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రైమూర్త్య స్థిత మహిమాన్విత నిలయంగా, సర్వదేవతామయమై, వివిధ దేవాలయాల సముదాయంతో విరాజిల్లుతున్న ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదీ తీరాన ఆదిశక్తి, జగన్మాత, త్రిగుణాత్మక స్వరూపిణియైన శ్రీమహాలక్ష్మీ దేవి ఆలయం వెలసి ఉంది.

03/18/2019 - 19:13

కృష్ణపత్నులు:
సీత భూమియైనవేళ రావణుండు ఎవడు?
సీత నెత్తుకొని పోవగ ఎందులుకేతెంచెను?

శ్రీకృష్ణుడు:
కాలమేఘ మటుల నరచువాడే రావణుడు
రాత్రులందు బాహువులను బంధించును ధాత్రిని

ఆతని తమ్ముండెవరో అర్థమైనదనుకొందును
వెలిగెడు చంద్రునిబోలుచు వెలుగు విభీషణుడు

వెలుగీతడు చీకటతడు నిరతము పోరాటం!
అందుకొరకె వారి మధ్యనంతటి వైరమ్ము!

03/17/2019 - 22:34

శ్రీచక్రము, మానవ శరీరం
*
డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
9849560014
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*

03/17/2019 - 22:21

శ్రీకృష్ణుడు:
రాముడనగ ఎవ్వరంచు రామలు మీరెంచితిరో?
సూర్యవంశజుండాతడు సూర్యుండాతండు

‘రామ’యనగ సీతన ‘రాముండ’న రాఘవుండు
అర్థవ్మౌ అర్థనారి ఈశ్వర తత్త్వమ్ము

ప్రజలను తన బిడ్డలట్లు కాచి బ్రోచినాడు
విడిచెను తన సతిని కాని వీడబోడు ధర్మం

కృష్ణప్రత్నులు:
అదియేమిటి రాముండన సూర్యుండని అందురు?
అతడు సూర్యుడైన వేళ అతని తండ్రి ఎవరు?

03/17/2019 - 22:35

ఇంతలోనె వినిపించెను వింతగ మురళీరవమ్ము
ఇంతుల చేమంతి ముఖములంత లేసినాయెను

కొమ్మలలో రెమ్మవోలె రెమ్మమాటు కోకిలవలె
కోకిలవలె పోకిరివలె కొంటె కృష్ణుడగుపించెను.

కృష్ణపత్నులు:
ఏమిటోయి ఈ ఆటలు? ఏమిటి ఈ పాటలు?
మా తోడనె ఆటలా? ఆటలె సయ్యాటలా?

రేతిరంత కలలలోన ఎటనెటనో తిరిగితిమి
అందమైన లోకమ్ముల ఆనందమునందితిమి

03/13/2019 - 19:43

వివాహ ముహూర్త సమయంలో పేటిక తెరచి, భయంకర సర్పమును గాంచి, జరిగిన మోసమును గ్రహించి, వచన బద్దురాలై, రాకుమారి పామునే తన భర్తగా స్వీకరించెను. ఆ సర్పమును కంఠమున ఉత్తరీయము వలె ధరించి, భగవదనుగ్రహమునకై తీర్థయాత్రల కేగి, పుణ్య క్షేత్రములను తిరుగుతూ, దండకారణ్యమందలి పుణ్యభూమి యగు ధర్మపురికి ఏతెంచారు.

Pages