S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/16/2019 - 22:01

తకిలీలను, చరఖాలను తయారు చేయడం వల్ల గ్రామీణ వడ్రంగం పనివారికి కమ్మరం పనివారికి ఉపాధి లభించింది. ప్రజలకు జీవనాన్నిచ్చేదిగా మహిళల గౌరవాన్ని కాపాడేదిగా ఆకలి కడుపులను నింపేదిగా చరఖా తిరిగి మారింది.

11/14/2019 - 22:30

నేల లోంచి బ్రద్దలై కమ్ముకునే సృష్టి శక్తిని నేను
అనువాదం కాని బ్రతుకును అందుకునే ‘వ్యక్తి’ని...
ఆంతర రసాహుత్యాకృతిని
బెట్టుచేసినప్పటి తొలి వేకువలో
నేను మృత్తికామరంద శిశుబీజాన్ని
ఆత్మపదార్థ నైచకీ దోహనశీలమైన మట్టి
నాకిచ్చిన వేకువలో నేను
జాగృతమైన పరిమళ రసోజాన్ని
చిత్రం... నేనెక్కడున్నానని వెతుకుతుందీ లోకం...

11/14/2019 - 22:09

‘‘నీవొక న్యాయవాదివైతే, నీ వృత్తిని మానేసి చేతి మగ్గం చేపట్టు. నీవొక డాక్టరైతే, నీ వృత్తిని వదిలేసి ఒక చేతి మగ్గం చేపట్టు’’ అని ఆయన సూచించేవాడు. ఆయన నేతగాళ్లతో ప్రత్యక్ష పరిచయం ఏర్పరచుకొని చేతి మగ్గాల గురించి సమాచారం సేకరించేవాడు. భారతదేశంలో చేతి మగ్గాలకు కేంద్రం అహ్మదాబాదు కాబట్టి ఆయన తన మొదటి ఆశ్రమాన్ని అక్కడే స్థాపించాడు. ఆశ్రమవాసులంతా స్వదేశీ దీక్షను పాటించేవారు.

11/14/2019 - 22:03

మృడ ! సదాశివ! భగవంత మేరుచాప
గిరిశ! చారువిక్రమ! శుభంకర సురేశ!
దేవ! దక్షాధ్వర ధ్వంస! దీనబంధు!
కొన్ని నిముషాలు దివ్వెన్నై కొలుతునిన్ను!

నిన్ను కొల్చిన క్షణమదే నిఖిల జయము
నిన్ను పిల్చిన నోటిదే నిజపథమ్ము
నిన్ను తల్చిన మనసుదే నిత్యశాంతి
కార్తీకమున దీపము జూడ కనుల పంట

11/14/2019 - 22:01

మణికంఠుడు, పందళరాజకుమారుడు, స్వామీ, హరిహరపుత్రన్, అయ్యన్,అనుపలు నామాల తో పూజించే స్వామీయే అయ్య ప్ప. దీక్షతీసుకొన్న అయ్యప్ప భక్తులు నిరంతరమూ ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటుంటారు. దీక్షధారణలో ఏన్నో నియమాలను స్వాములు పట్టుదలతో పాటిస్తుం టారు. ఆ నియమాలలో కొన్నిం టిని చూద్దాం. గురుస్వాముల వారి ఆశీస్సులతో మాలధారణ చేస్తారు. 41దినముల కఠిన కఠోర దీక్షను చేపట్టిన వారు, నల్లని వస్త్రాలు ధరిస్తారు.

11/14/2019 - 22:00

సీ. బాలలపై ప్రేమఁ బలుతెఱంగులఁ జూపి
వారల హృదయాలఁ జేరువాడు
శాంతి2కపోతాలు సతతమ్ము స్వేచ్ఛగ
నెగురుట ధ్యేయమై నిలచువాడు
పాండితీశోభతో భాసిల్లు నిరతమ్ము
బాలల మోముల వనె్నవాడు
కోటు బోత్తాములోఁ గొలువుదీరిన 3గులా
బీ2ప్రేమ చిహ్నమై వెలుగువాడు

11/12/2019 - 18:46

6
సంధిజాల మాయావరణంలో
కొత్త రుచులుదయిస్తూ- ఆగిన
అర్థోక్తికి ప్రకృతి సకర్మక సమాధానం అయింది
రగిలి ఉద్రిక్త క్షణంలా వచ్చిన ఓ పాట వెలుగులో
జీవన కఠోర సత్యం తెలుసుకున్నాను...
నీడ ఒకటి మెదిలింది నిలువెత్తు రూపం కట్టి
కనిపించని చైతన్యం కళ్ళెత్తినట్లు
కాలం నా మ్రోల కంకేళిని కలిసినట్లు
నీడ ఒకటి మెదిలింది నిలువెత్తు రూపం కట్టి...

11/12/2019 - 18:45

నిరక్షరాస్యత నిర్మూలనే ఏకైక ధ్యేయంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పథకాలెన్నో అమలుచేస్తున్నా, భారతీయ బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతున్నది. అందరికీ విద్య ధేయంగా, సార్వత్రిక విద్యా వ్యాప్తియే లక్ష్యంగా, ప్రభుత్వాలు చిత్తశుద్దితోకృషి చేస్తున్నా వివిధ కారణాలవల్ల అధిక శాతం పిల్లలు విద్యాగంధం సోకక బాలకార్మికులుగానే ఉండి పోతున్నారు.

11/11/2019 - 18:44

5
బాధను నింపుకున్న
గుండెనై ప్రవహిస్తాను
కడలి గర్భానికి చేరి ఆవిరినై
ఆకాశపు పొదుగును
ఆవిష్కరిస్తాను
నా శరీర భూరిజం ఆకాశధారకై
అఱ్ఱులు జాస్తోంది...
జలతారుగా మిసమిసలాడే
వానచినుకు
నా ఊహల పొడి మన్నులోకి
జారినపుడు
నే నింతా ఓ గింజనే
ఆత్మ విప్పుకున్న అడవినై
పూవునై పండునై
మనిషి గుండెలోకి
ప్రవేశిస్తాను

11/10/2019 - 22:21

ఆయన మార్కులు వేసే పద్ధతి అసాధారణంగా ఉండేది. ఒక విద్యార్థి రాసిన సమాధానాన్ని తరగతిలో ఉత్తమ విద్యార్థి రాసిన సమాధానంతో పోల్చేవాడు కాదు. ఆ విద్యార్థి గతంలో రాసిన సమాధానంతో పోల్చినపుడు అభివృద్ధి కనబడితే దానికే ఎక్కువ మార్కులిచ్చేవాడు. ఆయన విద్యార్థులను పూర్తిగా విశ్వసించేవాడు. పరీక్షల సమయంలో వారికి ఎలాంటి కాపలా పెట్టేవాడు కాదు. బాల బాలికల స్వేచ్ఛ ఆశ్రమ విద్యకు మార్గదర్శకంగా ఉండేది.

Pages