S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/19/2020 - 23:33

కళ్ళతో కవిత్వం వ్రాస్తున్న వాడ్ని..
అంతరాత్మ ఆకాశంలో తొలి శబ్దం సంగీత ప్పెట్టె
ఇపుడు
ఒళ్ళంతా ప్రవహిస్తున్న స్వరకల్లోలిని
కృష్ణవేణీ లహరుల గీతరవము...
తపింపజేస్తున్న వేదనా జ్వాలాంకురాలలో
దగ్ధ వస్తువును నేనే - దృష్టిని దృశ్యాన్ని నేనే...
అంతర్గతానుభూతుల ప్రద్యోతంలో
ఆకారం ధరించిన అక్షరమూ నేనే...
అక్షరం
ఆకారం దాల్చి ఒళ్ళు విరుచుకుంటే

01/18/2020 - 22:16

నిత్య జీవితంలో మనిషి ఎనె్నన్నో కలలు కంటూ వాటిని నిజం చేసుకునేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుంటాడు. కొందరు కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ కళాభిమానులుగా కళాకారులుగా రాణిస్తుంటారు. కలలు నిజమవడమైనా కళల్లో రాణించడమైనా భగవదనుగ్రహం తప్ప మరొకటి కాదంటారు. కళలే కాదు ఏ రంగంలో రాణించాలన్నా భగవదనుగ్రహం తప్పక ఉండి తీరాల్సిందే.

01/16/2020 - 22:40

మూఢనమ్మకమే అనండి, పుట్టుక నుంచి నరనరాల్లో జీర్ణించుకుపోయిన అలవాటు అనండి లేక మనస్ఫూర్తిగా మనని పాలించి, దశాదిశా గమ్యం సూచించే ఓ దివ్యశక్తి ఉందని నమ్మి తలుచుకోవడమే కానీయండి, దేవుడు అంటూ ఉన్నాడు అని నమ్మే వాళ్ల కోసమే ఈ భావ విభావరి.
భక్తి నానా రకాలు

01/16/2020 - 22:37

పులకిత హృదంతరమున నుప్పొంగిపోవు
నిండు ప్రాయంపు తలపులన్నిటిని కోసి
దండలుగ గ్రుచ్చి నీ మెడ నిండ వైచి
అన్య సుఖములకై యడియాస పడక
నీ కృపాదృష్టిమి నాకు నిఖిల మనుచు
మైమరచినాను లోకము మాటె మరచి
***
‘‘మినుకు మినుకని తారలు మెఱయుచున్న
శాంత రమ్య తమస్వినీ సమయమందు
కృష్ణవేణీ లహరుల గీతరవము
కర్ణముల మంద మందమ్ముగా నందించె’’

01/14/2020 - 23:14

సౌరమానం అనుసరించి తెలుగువారు జరుపుకునే పండుగ సంక్రాంతి. దసరా, దీపావళి సరదాలకు పరాకాష్ట. ఆనంద సంరంభంతోపాటు, ఆధ్యాత్మికత, సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరిసే పండుగ. భారతీయులందరూ జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఖగోళ శాస్తర్రీత్యా సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశిలోనికి ప్రవేశించడం సంక్రమణం అంటారు. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోనికి ప్రవేశించడం మకర సంక్రమణం. దీనినే 3మకర సంక్రాంతిగా వ్యవహరిస్తారు.

01/14/2020 - 23:09

సంక్రాంతి రోజున వామన చరిత్ర, రాముని చరిత్ర స్మరించడం వల్ల దానాది గుణాలు, ధర్మం పట్ల దీక్షా పట్టు దలలు కలుగుతాయని పెద్దలంతా ఈ రెండింటిని వినడానికి ఆసక్తి చూపుతారు.

01/14/2020 - 23:08

సీ. ముగంగిళ్ల ముత్యాల ముగ్గుల పందిళ్లు
ముదితల హాసాలు మురువు సూప
చామంతి బంతు సరస సల్లాపాలు
డబుడక్క మ్రోతలు డాబుఁ జూప
భుగభుగ మండేటి భోగిమంటలలోనఁ
జీడపీడలు కాలి బూడిదనగ
చిడతలఁ జేఁ బట్టి చిందులాడెడి హరి
దాసులాగమనంబు దాదిఁ జూప
హేమంతమందున శ్రీమంతురాలైన
పౌష్యలక్ష్మియు రాక పండుగనగ

01/13/2020 - 23:16

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణమే సంబురాల సంక్రాంతి. ఈ ఫండుగ ఆ బాల గోపాలాన్ని అలరిస్తుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించినపుడు వచ్చేదే మకర సంక్రాంతి. దీనికి ముందురోజు భోగి, మధ్యన సంక్రాంతి, ఈ పండుగకు వెనుక రోజు కనుమ, ఆ తరువాతిరోజు ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు.

01/13/2020 - 23:15

కేరళలోని శబరిమల క్షేత్రం అయ్యప్ప క్షేత్రంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ‘శబరిమల’ అయ్యప్ప దీక్షకు ప్రధాన స్థానం అయితే, శబరిమల అయ్యప్ప క్షేత్రంతో కలిసి పంచ అయ్యప్ప క్షేత్రాలు ఉన్నాయి. వాటిని తెలుసుకొందాం.
1. కుళిత్తుపుళా క్షేత్రం

01/13/2020 - 05:01

తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన .. తెలుగు పండుగల్లో విశిష్టమైన పండుగ సంక్రాంతి. జనజీవనంలోనూ ప్రకృతిలోనూ , వ్యవసాయ కార్యకలపాలతోను ముడిపడి ఉన్న పండుగే సంక్రాంతి!! ప్రతినెలా సూర్య భగవానుడు ఒక రాశిలోనుంచి మరొక రాశిలోని మారుతూ ఉంటాడు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే జోరు సంక్రాంతి.

Pages