S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/16/2018 - 21:12

218. సీత కడకేగి జనకజా యింక నన్ను
జెట్ట బట్టి యఖండ భోగముల దేలు
మింకనా నరు రాజ్యవిహీను దీను
నేల గోరెడు యోగ్యుడ నేనె నీకు

219. అనగ జానకి యొక తృణమున్ గ్రహించి
రావణున కడ్డుగా నుంచి రాక్షస విను
ధర్మపరుడు నా భర్త సత్యస్వరూపు
డంబుజయుత సరోవర రాజహంస
కీటకంబువు నా దృష్టి కసుర నీవు

03/15/2018 - 21:19

203 సీత దూషణలకు నతిక్రోధమునను
యెవడ ననుకొంటివో సీత రుూ త్రిలోక
ములను యెవ్వరి పేర్విన భూతకోటి
కంప మొందునో యాదశ కంధరుడను

204 భీతిగొల్పెడు దశ శిరంబులు నిరువది
కన్నులలో విస్పు లింగముల్ రాలుచుండ
పర్వతాకారుడై రామపత్ని నెత్తి
రథమున నిడుకొని గగన వీధినేగె

03/15/2018 - 21:10

కుమారస్వామి, కార్తికేయుడు, స్కంద, మురుగ, షణ్ముఖ, మహాసేన, బాలస్వామి, వేలన్, దండపాణి, వల్లీ నాయక, దేవసేనాపతి, సేనాని, గుహ, గురుగుహ, శివగురు, దేశిక తదితర నామధేయాలతో శివకుమారుని పూజిస్తారు. శివ కుమారోదయం కోసం పార్వతీ పరమేశ్వరులు కల్యాణం జరగాలని సర్వదేవతలు నిశ్చయం చారు. వారి కల్యాణం అంగరంగవైభోగంగా జరిగింది. ఇక స్వామి కుమారుడిని ప్రసాదిస్తాడని అందరూ భావించారు.

03/14/2018 - 20:53

188.విల్లు చేబూని వెను వెంట వచ్చుచున్న
రామచంద్రుని మాయ మృగమ్ము చాల
దవ్వు గొంపోవ నలిగి శ్రీరఘువరుండు
నిశిత శరమును సంధించి లేడినేసె

189.సాయకమ్మున లేడి రూపమమ్ము వీడి
యసురు డీల్చుచు ‘‘హా సీత లక్ష్మ’’ణ యని
రాము నెలుగున నార్తనాదమ్ముజేసె
నా స్వరము విని సీత యారాటపడుచు

03/13/2018 - 20:41

171. దశరథుని పెద్ద కొడుకు తాపసులకు
రాక్షసుల జంపి నిష్కంటకంబు వనము
జేసెదనని వరంబిచ్చి చేసె నట్లె
అతని తమ్ముడు నన్ను విరూపిజేసె

172. రాము నిల్లాలి సౌందర్య మేమి జెప్ప
నామె నర్థాంగిగా పొందు వాడి జన్మ
ధన్య మపహరింపుము సీతను దశకంఠ
నరులపై ప్రతిక్రియకును బూనుకొనుము

03/12/2018 - 22:32

156.

నీలమేఘవర్ణు నిరుపమ సుందరు
కమలపత్ర నేత్రు కంబు కంఠు
సలలిత ముఖపద్ము సౌదర్య జితకాము
రాము జూసి కామపరవశమున

157. ఎవ్వడవు నీవు రాక్షస నిలయమైన
యాజన స్థానమున నేలయున్నవాడ
వసురరాజగు రావణుం డన్న నాకు
నిన్ను భర్తగ జేకొందు నందగాడ

03/11/2018 - 22:14

కాలం వేగంతో దూసుకుపోయే జీవన ప్రవాహంలో వేసిన ప్రతి అడుగు ఒక విజయ రహస్యానికి సంకేతంగా నిలుస్తుంది. అంటే నిజమైన ప్రస్థానం ఇక్కడినుంచే మొదలవుతోంది. ఈ ప్రయాణంలో మనమంతా నిమిత్తమాత్రులమే. ఇందులో కర్త, కర్మ, క్రియ సర్వమూ భగవంతుని ప్రసాదితమే. చేతలు మాత్రమే మనవి. చేయించేవాడు ఆ పైవాడుగా భావించాలి. ఇది లోకవిదితమైన విషయం.

03/11/2018 - 21:19

144. అంతట నగస్త్యు డత్యాదరమ్ము తోడ
శిష్య గణముతో నెదురేగి శ్రీసమేత
యెన్ని దినముల కింత భాగ్యమ్ముగల్గె
ననుచు రాఘవు కౌగిట జేర్చుకొనియె

145. అంజలి ఘటించి నిలిచిన వారి ముపుర
నర్ఘ్య పాద్యాది విధుల నర్చించి వౌని
ధర్మమూర్తివి నిన్ను పూజించు భాగ్య
మునకు వేరొండు భాగ్యోదయమ్ము గలదె

03/09/2018 - 21:09

జనుల హృదయమాలిన్యాన్ని పోగొట్టే మహాలక్ష్మి మంగళప్రదయై సౌభాగ్యలక్ష్మిగా, ధైర్య, స్థైర్య,స్థిరబుద్ధులను మానవాళికి ప్రసాదిస్తుంది. ఈ తల్లేఆదిలక్ష్మి సంతాన లక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములుగా అష్టమూర్తులలో విరాజిల్లుతోంది.

03/09/2018 - 21:04

133. మంద హాసముతో రామచంద్రమూర్తి
జనకజా నీవు ధర్మ సమ్మతములైన
వచనములు బల్కితివి విదేహావనీశు
పుత్రివలె గాని రాజునై నట్టినేను

134. నిస్సహాయుల గాచుట యుచిత మనుచు
దలతు నిక్ష్వాకు కులధర్మ మిదియోగాన
నిన్ను లక్ష్మణు నైనను విడువ జంక
ధర్మ మార్గమున నెపుడును దప్ప నేను

Pages