S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/31/2018 - 21:19

మన పురాణాలలో సూర్యకిరణాలను వర్ణించిన విధానంపై సిద్ధాంతానికి చాలా దగ్గరగా సంపూర్ణంగా సరిపోతోంది. మన పురాణ కథలన్నీ సంకేతార్థాలతో వుంటాయి యధాతథ వాక్యార్థాన్ని తీసుకోకూడదు. సూర్యరథం సప్తాశ్వాలతో లాగబడుతోందని చెప్పారు. అంటే సూర్య కిరణంలో ఏడు రంగులు (ఇంద్రధనుస్సు) వున్నాయి. ఆ గుఱ్ఱాలను పాముల పగ్గాలతో పట్టుకున్నాడని చెప్తారు. పాముల గమనం అలల గమనంవలె వుంటుంది.

05/31/2018 - 21:17

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దాదాపుగా ఇదే భావాన్ని కఠోపనిషత్తు ‘తమ క్రతుః పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదా న్మహిమాన మాత్మనః’- ‘పరమేశ్వరుని కృపవలన నిష్కామ కర్మ సిద్ధి, తద్వరా సంసార సంబంధమైన శోకరాహిత్యం మరియు రాగద్వేషాలకు అతీతమైన చిత్తశుద్ధి కలిగిన మహాత్ములు మాత్రమే ఆత్మదర్శనం చేసుకోగలరు’’ అని వివరించింది.

05/29/2018 - 21:14

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

05/29/2018 - 21:13

నకులుడు! న-కులుడు=కులం లేనివాడు! జలం అంటే నీరు! నీటికి కులం లేదు. స్వాధిష్ఠానం అంటే నీరు- విస్తృతం. నీరు పల్లెమెరుగు! ప్రవహించడమే నీటి లక్షణం. అలా నీటిలాగా కులాతీతమైంది ఆత్మజ్ఞానం.

05/28/2018 - 21:14

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
అనగా ఎములగూడుగా కనబడే ఈ సృష్టిలోని సమస్త వస్తుజాలానికి ఎముకలే లేని ఈ అప్రాకృత పదార్థానికి ఏది కారణమై యున్నది? ఈ ప్రాణాలు, రక్తం భూమి నుండి అంటే ప్రకృతి సిద్ధంగా పుట్టినవే. ఆత్మ అన్నది ఎక్కడుంది? ఈ విషయాలను తెలుసుకొనేందుకు సర్వజ్ఞుడైన విద్వాంసుడిని ఎవడు ఆశ్రయిస్తున్నాడు?

05/28/2018 - 21:13

మానవ శరీరం పంచభూత సమ్మేళనం అంటే పంచతత్త్వాలు కలిగినది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం- పంచభూతాలు. శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంధాలు. అంటే పంచతన్మాత్రలు. పంభూత స్థితినే ‘ప్రపంచం’ అని చెప్పుకోవచ్చు.

05/27/2018 - 21:16

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

05/27/2018 - 21:05

సాహితీ లోకంలో అపూర్వ వ్యక్తిత్వమున్న వ్యక్తి. మనిషికి ఊపిరి ఎంత అవసరమో, జ్ఞానం మనిషికి అంతకన్నా అవసరం. సాంప్రదాయ ఆలోచనల నిధి, అంతరంగం సాహితి సన్నిధి. మనిషే సంఘజీవి. సంఘ పురోగాభివృద్ధిని ఆకాంక్షించే సాహితీవేత్త- సమాజ శాస్తవ్రేత్త - ‘రేపటి తరానికి ఒక సెర్చిలైటు’.
‘విభిన్న కోణాల్లో, అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసే, ప్రచురణ చేసే ప్రజల మస్తకంలో మనిషి’’-

05/24/2018 - 21:23

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
వేదోపదేశం మానవులకు అతిక్రమించరానిది. ఎందుకంటే మానవ సమాజ హితం వేదధర్మాచరణ యందే వుంది. అందుకే వేదర్షి ‘మంత్రశ్రుత్యం చరామసి’- ‘‘వేదమంత్ర ధర్మోపదేశానుసారంగా నడచుకొంటాం’ అని మరో ప్రతిజ్ఞ చేయించాడు. ఈ రీతిగా అపౌరుషేయమైన వేదం ద్వారా మానవ సమాజ శ్రేయస్సు కొరకు ఋషుల ద్వారా వేదోపదేశం చేసాడు భగవానుడు.

05/22/2018 - 21:32

సృష్టి మొత్తం అనంతమైన చైతన్యంతో నిండి వుంది. చైతన్య శక్తికి సజీవ ఉదాహరణ ‘మనిషి’. మనిషి శరీరాన్ని మన ‘్భమాత’తో పోల్చవచ్చు. భూమి ఒక ప్లానెట్. ప్రతి మనిషినీ ఒక ప్లానెట్‌గా భావిస్తే మనిషి శరీర నిర్మాణాన్ని ‘‘విధాత’’ ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో అర్థం అవుతుంది. సృష్టికర్తకు ఇలా మనిషిని తీర్చిదిద్దడానికి ఎన్ని వేల సంవత్సరాలైనా పట్టి వుండవచ్చుననిపిస్తుంది.

Pages