S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/06/2019 - 19:27

పృథ్వి నెల్ల మీ చేతులనుంచెద గ్రహించుడి!
నా రాముండొక పిల్లడు వాని నొగ్గివేయుడి!

పరశురాముడను కొంటిరొ? పసికూనయె వీడు!
ఎటుల ఘోర రక్కసులను ఎదిరించగలడు?

ఒక చెక్కిలి మీట పాలు- ఒక చెక్కిట నీరు
నిన్న మొన్న పాలు మరచి నట్టి బుడత వీడు.

లేక లేక కలిగె వీడు- నా కన్నుల తార!
వానినంపి నేనుందునె! విడుతును ప్రాణాల!’’

06/06/2019 - 19:24

కాలము అనంతము.. కర్మ అనాది. ఈ రెండు సమాంతరంగా నడుస్తుంటాయి. ఈ కాలము నాణెమునకు వలె రెండు పార్శ్వములుంటాయి. ఒకవైపు కాలమునకు భూత, భవిష్యద్వర్తమానములుంటాయి (సమూర్తము). ఇంకొకవైపు కాలమునకు ఈ మూడు కాని కాలములో వుంటుంది (అమూర్తము). ఋగ్వేద కాల సూక్తములో ఈ విషయము తెలిపారు. అది మనసుకు, బుద్ధికి గ్రాహ్యము కాదు. మరి ఈ కాలాన్ని మింగినవాడు కాలాంతకుడు. కాల, కర్మలు అవిభక్తంగానే వుంటూ విభక్తంగా గోచరిస్తాయి.

06/05/2019 - 19:54

వౌనమ్మే నియమమాయె- క్షమయే ఆభరణమాయె
అందువలన ఆ దుష్టుల- ఆగడములు మించిపోయె.

పట్టలేను ఆయుధమ్ము- ఇవ్వలేను శాపమ్మును
నా నియమమె వారికిపుడు- ఆయుధమ్ముగా మారెను.

తిరుగుచుంటి నేనిట్టుల- కత్తిచ కత్తి కొరకు
అర్థించితి నిన్నిట్టుల- రక్షచ రక్ష కొరకు’’.

అనగా ముని కొయ్యబారి దశరథుండు కూలెను
క్రుంగె భూమి ఆకసమ్ము కూలెననగ తలను.

06/05/2019 - 19:50

పార్వతీపరమేశ్వరులు ఆది దంపతులు. తల్లిదండ్రులు. అమ్మా అని పిలిచినా, తండ్రీ అని పిలిచినా వెనువెంటనే వారిద్దరూ వచ్చి భక్తుని కడగండ్లను రూపుమాపుతారు. కరుణామూర్తులైన పార్వతీపరమేశ్వరులు చైన్నై నగరానికి నైరుతిదిశలో ఉన్న మాంగాడు క్షేత్రంలో కొలువైయనారు. ఇక్కడి అమ్మ వారిని కామాక్షిగా కీర్తిస్తారు.

06/04/2019 - 19:37

ఒకానొక కాలంలో శిలాదమహర్షి అనే ముని పుంగవుడు ఉండేవాడు. అతడు తనకు సంతానం లేదని ఎంతో బాధపడుతుండేవాడు. సృష్టిస్థితిలయలకు కారణభూతుడు, ఆధారభూతుడైన కరుణాంబోధి అపార కృపావత్సలుడైన ఆ పరమేశ్వరుడు తప్ప తనను బాధనుంచి విముక్తిచేసేవారు ఎవరూ లేరని నిశ్చయించుకొన్నాడు శిలాద మహర్షి. అందుకే ఆ పరమ శివుని కోసం తపస్సు ఆరంభించాడు. ఎన్నోవేల సంవత్సరాలు సంతానార్థియై పరమేశ్వరుని పట్టు వదలక ధ్యానించాడు.

06/04/2019 - 19:35

రాముని తోకన బోలుచు లక్ష్మణుండు వచ్చెను
భరతుని తోకన బోలుచు శత్రుఘు్నండేతెంచెను.

వినయమ్ముల ప్రోవులనగ వారలటకు వచ్చిరి
వచ్చిరొ, లేదో భక్తిని మునిపదమ్ములంటిరి.

రాముని పైకెత్తు నెపము నంటె నతని పదముల
అతని పాదరజమంటగ తేలెను పులకింతల.

ఆ వింతల పులకరింత- అతడెరుగును ఆతండును
కాంతులలో కాంతిచ- కాంచె దివ్యప్రభలను.

06/03/2019 - 19:49

పాదపూజలను వౌనికి పాలతోడ సేయు వేళ
మణిమయవౌ మకుటమ్మే పడిపోయెను పాదాలను.

రత్నఖచితపీఠమ్మే రాలినట్లు పదములందు
భౌగోళమె భక్తికొలది పూజాసుమమైన యట్లు.

రాజరాజు శిరమట్టుల- రాజిల్లెను మునిపదములు
మునులే కద ఏలువారు నేలు వారినైనను.

ఆతని మకుటమ్ముదీసి ఆతనికె యిచ్చె వౌని
కొనినట్టుల రాజ్యమె చేకొనెనంతట రాజు.

06/03/2019 - 19:47

ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయాలంటారు. నియమనిష్ఠలతో ఆ పని మీదే ధ్యాస పెట్టి చేసే పనులే అనుకొన్న ఫలితాన్నిస్తాయి. మనోవాక్కాయములలో పవిత్రత, ఐక్యత కలిగినపుడు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయ. ఈసురోమని పనులు చేస్తే అవిఅవి కూడా నీరసమైన ఫలితాలనే ఇస్తాయ. నలువైపుల నుంచి మంచి భావనలు నాకు చేరాలి అని ప్రార్థించమని వేదం చెబుతుంది. మంచినే పలకాలి. మంచినే చేయాలి.

06/03/2019 - 19:40

నిప్పునె వణికించునతడు- నిప్పునె దహియించును
సర్గమ్మే తలక్రిందుల సేయనోపు నతడు.

సృష్టికి ప్రతి సృష్టిసేయ గలిగినట్టి తపోధనుడు
బొందితోడ స్వర్గమ్మున కంపగలుగు ఘటికుడు.

అయిననేమి? అహంకార మతనినెంతొ కాల్చెను
అది తెలియుట కొరకాతని కాయె జన్మపర్యంతము.

అయిన పట్టువిడువనట్టి గట్టివాడు వౌని
దీర్ఘమైన తపము సేసి- దివ్యర్షిగ నాయెను.

06/03/2019 - 19:37

తే.గీ. చిన్న దానిని పెద్దగఁ జేయనేల
పెద్దదానిని చిన్నగ విడువనేల?
కాస్త యోచింపరేమి లోకాన జనులు?
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!

భావం: చిన్న విషయాన్ని పెద్దగా చేయడం దేనికి? పెద్ద విషయాన్ని తృణప్రాయంగాభావించి విడిచిపెట్టడం దేనికి? ఇలోకంలో జనులు కాస్త ఆలోచించరెందుకు? కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య!

Pages