S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/29/2019 - 22:37

వేదమంత్రమన్నట్టుల- వేదసార మన్నట్టుల
ఏర్పడె ‘సీతాయనమ్ము’- విశ్వతత్త్వ మన్నట్టుల

‘సీతాయన’కావ్యమ్మే- ‘రామాయణ’మాయెను
మొక్కవోలె పెరిగి పెరిగి మహావృక్షమాయెను

ఎందరొ రాములు బుట్టిరి- ఒకటే రామాయణం
ఎందరొ కలములబట్టిరి కవియన వాల్మీకియే

నిలుచుదాక విశ్వమ్మే- నిలుచును రామాయణం
ముగియునేమొ విశ్వమైన- ముగియదు రామాయణం
**
అయోధ్య

04/29/2019 - 18:45

త్రేతాయుగంలో సీతారాములు అన్యోన్య అనురాగాలున్న దంపతులుగా కీర్తించబడ్డారు. శివుని విల్లు విరిచి దశరథుని అనుమతితో శ్రీరాముడు జనక మహారాజు ముద్దుల కుమార్తెగా పెరిగిన అయోనిజ సీతమ్మను పెండ్లాడాడు. కాని కాలవశాన రాముడు వనవాసాలకు వెళ్లవలసి వచ్చింది. రాముని వెంట సీతమ్మ వనాలకు బయలుదేరింది. సీతారాముల వెంట లక్ష్మణుడూ బయలుదేరాడు. ఆట్లా ముగ్గురూ వనవాసం చేయడానికి వెళ్లారు.

04/29/2019 - 22:36

కాయము తొలగిన వేళల ఏలను తన కోపం?
ముక్తి ప్రసాదించు వాని పైన నేల శాపం?

రాముండే యముండౌచు రావణున్ని చంపెనో?
మడిసిన తన పతిని జూచి మండోదరి ఏడ్చెనో?

తన కనులకు రామాయణ కథయే కన్పడెనో?
తన రాముని తన నోటనె తానే శపియించెనో?

ఐన బోయ తప్పేమిటి? బోయ వృత్తి బోయది
బోయవాని ధర్మమ్మది- తప్పన్నను తప్పు తనదె.

04/26/2019 - 19:49

నాలుగు వేదాలె నాల్గుపాదాలై పోయినట్లు
సుశ్లోకవ్మౌ శారద సుశ్లోకమ్మైనయట్లు

అది శోకమొ! అది శ్లోకమొ! అది కోపమొ! తాపమొ!
అదరెడు పెదవుల వెంబడి పదములటుల దొరలెను

మనసే మంత్రమ్మాయెనొ! మాటయె మనసాయెనో?
కనుల వెంట అశ్రువులే పొరలి పొరలి దొరలెను

చేరెనాశ్రయమ్ము కాని కానలోనె మనసు
కూర్చుండెను వేదికపై- కూర్చుండునె మనసు?

04/25/2019 - 22:43

శ్రీచక్రము, మానవ శరీరం

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
9849560014

04/25/2019 - 22:42

రెప్ప వేయడాయె వౌని తన చర్యల నెల్లమాని
పక్షులలో పక్షివోలె- సంచరించెనతని యాత్మ

‘సరసర’మని బిరబిరమన శరమొక్కటి వచ్చెను
బాణము తగిలినదొ లేదొ ప్రాణము
విడె మగ క్రౌంచము

ఆడుపక్షి ఆర్తితోడ అరచిన అరపులు వినబడె
పక్షి భాష దేవుడెరుకు రక్షించగనెవడు?

చచ్చిపడిన పక్షిపైన- చచ్చినటుల పడినది
శవముపైన బడి యేడ్చుచు- శవమైపోయినది.

04/24/2019 - 22:49

పక్షి కదల పక్షిలోని పరమాత్ముని దర్శించును
దర్శించెడి కనులదాగు దర్శకుణ్ణి స్పర్శించును

వేదమ్మే నాదమ్మై- అతని చెవిని మ్రోగెను
నైరూప్యమై రూపమ్మై ఆతని నలరించెను.

ఏమి సృష్టి! ఏమి సృష్టి సృష్టి సేయ పరమాత్ముడె!
ఏమి రచన! ఏమి రచన! రచయితయన పరమాప్తుడె!

కరముతోడ కదలించెనొ? చరణమ్మున తాకెనొ?
కనుల తోడ పరికించెనొ? కావ్యమాయె సృష్టి!

04/24/2019 - 22:44

ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ మహాక్షేత్రం కొలువై వున్నది. ఉగాది పర్వదినం గడిచాక వచ్చే మొదటి చైత్ర పౌర్ణమిరోజుకు ముందు రెండు రోజులు, తర్వాతి రెండు రోజులు మొత్తం ఐదురోజులపాటు జరిగే ఈ మహోత్సవం ఎంతో కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి కారణంగా అటవీ శాఖ అధికారులు మరియు అడవులలో నివాసముండే చెంచుల సహకారంతో ఏర్పాట్లను చేస్తారు.

04/23/2019 - 19:27

రామా అని పలికితే చాలు ఎన్నో జన్మల నుంచి సంచితంగా వచ్చే పాపమంతా ఒక్క లిప్తకాలంలో దహించి వేయ బడుతుంది. రామ అని పలుక రాని బోయ వాడు మరా అని పలుమార్లు అన్నా పదోసారి రామ అనే శక్తిని అందించింది. లోకంలో ఆదికవిగా నిలబెట్టి ఆచంద్రతా ర్కారము పేరు ఉండేట్టు చేసింది. రామ అన్న శబ్ద మహిమ అది. రామఅన్నా మరా అన్న అంతే శక్తిని కలిగిఉన్న నామం రామనామం.

04/23/2019 - 19:23

నీరమ్ములు పారినట్లు- నీరదములు కదలినట్లు
గాలి సంచరించినట్లు- కదలె నతని మూర్తి

తృణములపై తృణములట్లు- చరణమ్ములు పడెను
అణువులపై అణువులట్లు- అతని తనువు కదలెను

చీమ మడియు దోమ మడియు సంచుకృంద సాగెను
పదిలమ్ముగ పొదమ్ముల కదలించుచు సాగెను

కనులలోని కనుపాపలు చరణమ్ముల జేరినట్లు
ఒడలెల్లను కనులు మొలచి నయనమ్ములె నడచినట్లు

Pages