S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/11/2018 - 21:19

144. అంతట నగస్త్యు డత్యాదరమ్ము తోడ
శిష్య గణముతో నెదురేగి శ్రీసమేత
యెన్ని దినముల కింత భాగ్యమ్ముగల్గె
ననుచు రాఘవు కౌగిట జేర్చుకొనియె

145. అంజలి ఘటించి నిలిచిన వారి ముపుర
నర్ఘ్య పాద్యాది విధుల నర్చించి వౌని
ధర్మమూర్తివి నిన్ను పూజించు భాగ్య
మునకు వేరొండు భాగ్యోదయమ్ము గలదె

03/09/2018 - 21:09

జనుల హృదయమాలిన్యాన్ని పోగొట్టే మహాలక్ష్మి మంగళప్రదయై సౌభాగ్యలక్ష్మిగా, ధైర్య, స్థైర్య,స్థిరబుద్ధులను మానవాళికి ప్రసాదిస్తుంది. ఈ తల్లేఆదిలక్ష్మి సంతాన లక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములుగా అష్టమూర్తులలో విరాజిల్లుతోంది.

03/09/2018 - 21:04

133. మంద హాసముతో రామచంద్రమూర్తి
జనకజా నీవు ధర్మ సమ్మతములైన
వచనములు బల్కితివి విదేహావనీశు
పుత్రివలె గాని రాజునై నట్టినేను

134. నిస్సహాయుల గాచుట యుచిత మనుచు
దలతు నిక్ష్వాకు కులధర్మ మిదియోగాన
నిన్ను లక్ష్మణు నైనను విడువ జంక
ధర్మ మార్గమున నెపుడును దప్ప నేను

03/09/2018 - 21:00

రాముడు, జాన్ ఇద్దరూ మంచి స్నేహితులు. వారి కులాలు వేరు. మతాలువేరు కాని వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరుండేవారుకాదు. కాని ఇరువురి పెద్దల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. ఒక్కోసారి వీరి పెద్దల మధ్య తగవులాటలు కూడా వచ్చేవి. అట్లాంటపుడు వీరిని అవతల వారితో మాట్లాడవద్దని వారి పెద్దలు చెప్పేవారు.

03/08/2018 - 21:05

మంత్రం
‘‘ఆయం గౌః పృశ్నిరక్ర మేత్
అసదన్మాతరం పురః పితరంచ ప్రయన్త్వః
ఇతి ఋగ్వేదే సామ వేదే 630- మంత్రం 1376 మంత్రం అధర్వణ వేదే 6వ కాండ, 31 సూక్తం 1వ మంత్రం.

03/08/2018 - 20:59

* సత్పురుషులతో, సంత్సంగాలలో ఎక్కువ సమయం గడిపితే సదాచారాలు అలవడుతాయ.
* ఆపత్కాలాలలో ధనంతో పాటు మనిషి సాయం కూడా కావాల్సి ఉంటుంది.
* ఉత్సాహవంతులకు ఊపిరి ఒక్కటున్నా చాలు.
* కులంకన్నా గుణమే ప్రధానం.
* పండితులకు విద్య అలంకారమైనట్లుగా మనిషికి శీలం అలంకారం.
* సత్పురుషులకు ఆవగింజంత ఉపకారం కూడా మేరుపర్వతం అంత కనిపిస్తుంది.
* కన్నతల్లిని ఉన్నఊరును మరవకూడదు.

03/07/2018 - 21:29

సత్సాంగత్యమెంత ఫలప్రదమో, దుర్జన సాంగత్యం అంతహానికరం. కనుక అది పరిహరించదగినది. అది మనిషిని కామ, క్రోధ, మోహాది అరిషడ్వర్గాల బందిఖానాలో బంధిస్తుంది. చిత్తాన్ని భ్రమింపజేస్తుంది. మనిషి అథఃపాతాళానికి తీసుకొని వెళ్లేటట్టు చేస్తుంది. మనిషిని సర్వనాశనం అయ్యేంతవరకు భ్రమలోనే ఉంచుతుంది. కనుక ‘దుష్టులకు దూరంగా వుండాలి’ అనడం!

03/07/2018 - 21:26

109. పతిని మించిన ప్రియబాంధవుండుగాని
భర్త సేవకు మించిన తపము గాని
లేవు మరువకు మమ్మ ఈ ధర్మ పథము
ననుచు బోధించె ననసూయ నిలజ కపుడు

110. వృద్ధ దంపతులకు భక్తి పూర్వకముగ
వందనములిడి మువ్వురనుజ్ఞ వేడి
దండకారణ్యమున పయనింప నచటి
బ్రహ్మవేత్తలుప్పొంగుచు రాముగనిరి

03/07/2018 - 00:11

97. అట్లు శపథము జేసి రామానుజుండు
పాదుకల భక్తితో తలపై ధరించి
అన్న అనుమతి వడసి శతృఘు్న తోడ
అరద మెక్కెను తిరిగి కోసలను జేర

98. రామచంద్రుడు గురుజనంబులకు మంత్రి
వరులకును వందనమ్ము లొనర్చి పరిజ
నముల వీడ్కొల్పి గద్గద గాత్రుడౌచు
తల్లులకు మ్రొక్కి యాశ్రమ మందు జొచ్చె

03/07/2018 - 00:09

ఎన్ని సంపదలు, పదవులు, విద్యా సంపద, ధనం, హోదాలు ఎలా ఏవి ఉన్నా అహంకారం ఎప్పుడూ పనిచేయదు. తామే గొప్ప అనుకోవడం ఇతరులని తక్కువగా అంచనా వేయడం చిన్నచూపు చూడడం తగదు. అది అహంకారులకే ముప్పు. అందుకు నిదర్శనంగా మనకు అత్యంత భక్తుపరుడు, సంగీత విద్వాంసుడు, తాండవకృష్ణమాచార్యులు కథ తేటతెల్లం చేస్తుంది.

Pages