S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/05/2018 - 01:45

72. భరతు కౌసల్య నిర్దోషిగ గ్రహించి
అక్కునం జేర్చుకొని పుత్ర! నిన్ను నేను
శోకమోహితనై యనకూడనట్టి
మాటలంటిని వూరడిల్లుము కుమార

73. గురు వశిష్టుడు శోక సంతప్తుడైన
భరత నోదార్చి మహరాజు కాయమునకు
అగ్ని సంస్కారములను జేయించి నీవు
రాజ్య పాలన జేపట్ట వలయు ననగ

03/02/2018 - 21:04

ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను దర్శించమని తత్వమసి సిద్ధాంతాన్ని తెలియజెప్పారు. శిరిడీ సాయ, స్వామి అయ్యప్ప వీరు ఇద్దరూ బ్రహ్మచారులు. ఇద్దరూ కలియుగ వరదులు, ఆపద్బాంధవులు, ఆశ్రీత రక్షకులు అవడంవలన ‘ఓం సాయి శ్రీసాయి షిర్డీసాయి’, ‘ఓం స్వామియే శరణమయ్యప్ప’ అని భక్తులు కీర్తిస్తున్నారు.

03/02/2018 - 20:56

59. గంగ దాటగ వచ్చిన కౌసలేయు
దైవమని యెంచి గుహుడు పాదములు గడిగి
భక్తి పరవశుడై మ్రొక్కి పడవలోన
భ్రాత సీతల తోడ దాటించె నదిని

60. వసుధ పుత్రిక గంగాభవాని కెంతొ
భక్తితో మ్రొక్కి తల్లి మావిపిన వాస
మును జయప్రదముగ నెరవేర్చి వచ్చు
నట్లు మమ్ముల దీవించు మమ్మ! విరజ

03/01/2018 - 22:50

సంస్కారమనేది వ్యక్తి పుట్టుక, పెరిగిన వాతావరణం మీద ఎక్కువగా ఆధార పడిఉంటుంది. కాని వ్యక్తి పెరుగుతున్నపుడు జ్ఞానాన్ని ఆర్జిస్తున్నపుడు తనకు తాను తెలుసుకొన్న విషయాల వల్ల తనను సంస్కరించుకుంటున్నపుడు కూడా వ్యక్తి సంస్కారంలో మార్పులు వస్తాయ.

03/01/2018 - 22:40

ఈ పరిస్థితులలో డార్విన్ సిద్ధాంతానికి సరియైన ఆధారాలు దొరకడం కష్టం! ఆ సిద్ధాంతంమీద ఆధారపడి ఆలోచించే విధానాన్ని బట్టి వానరుడి నుంచి అల్పమానవుడు, వాడినుండి ఉత్తమ మానవుడు క్రమ వికాసం చెందారనే భావన శోభనివ్వదు.

03/01/2018 - 22:36

కొంత కాలము గడిచె నయోధ్య జనులు
46. రామ సందర్శన నానంద హృదయ లౌచు
గడుపుచుండిరి రామభద్రునకు యిరువ
దైదు వత్సరములు రాగ దశరథుండు
తనదు వృద్ధాప్యము గ్రహస్థితిని దలచి

47. గురు వశిష్టునితో నొక్కనాడు రాజు
రామపట్ట్భా షేకము జరుప నిశ్చ
యించినాడ మీయనుమతి తోడ ననగ
సంతసమ్మున సభ దీర్చజెప్పె గురుడు

03/01/2018 - 01:25

భగవంతునికి రూపం లేదు. నామంలేదు. కాని ఎవరి ఇచ్ఛ వచ్చినట్లు వారికి భగవంతుడు కనిపిస్తాడు. వారికి కోరుకున్న రూపంలోను వారు కోరుకున్న నామంలో దర్శనమిచ్చి వారికి ఆనందాన్ని ఇస్తాడు. అందుకే ఒక్క ఫాల్గుణ పున్నమిరోజు హోలిని పురస్కరించుకుని-

03/01/2018 - 01:19

36.రాఘవేంద్రుడు సీతను బెండ్లియాడె
భరత లక్ష్మణ శతృఘు్నలకు నొసంగె
తమ్ముని తనయల ముపుర ముదముతోడ
నాత్మ దారలుగ జనక చక్రవర్తి

37.నల్వుర కళ్యాణ మతివైభవముగ జరిగె
ధర్మపత్నులతో దాశరధులు మ్రొక్క
కీర్తిగాంచుడి ధర్మరక్షంము జేసి
యనుచు దీవించి కౌశికుండరిగె గిరికి

02/27/2018 - 21:02

తిరుచానూరులోని పద్మ సరోవరంలో పద్మావతి అమ్మవారి ఆవిర్భావం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో వున్న ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారంపై ఐదంతస్తుల శిల్పకళా శోభితమైన గోపురం నిర్మింపబడి వుంది. రంగమండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయాలు వున్న ప్రధాన ఆలయ రంగమండపంలోని స్తంభాలు అద్భుతమైన శిల్పకళా సంపదతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

02/27/2018 - 20:58

24.సుందరులతి తేజస్వులు సుగుణవంతు
లన్నదమ్ములు తనవెంట రాగ వౌని
సరయు తీరము జేరి వాత్సల్య పూర్ణు
డౌచు రాకొమరులజూచి రాచ తపసి

25.శ్రమమున్ క్షుత్పిపాసల నాశకములు
బల అతిబల విద్యలు శుభప్రదము లంచు
రామునకుపదేశించె ముని ప్రభుండు
రాముజేరి రాణించు నావిద్యలనుచు

Pages