S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/26/2018 - 21:40

నారాయణ కవచమ్ అత్యంత మహిమాన్వితమైనది. విశ్వరూపుడు అనే మునీశ్వరుడు దీనిని దేవేంద్రునికి ఉపదేశించగా దాని ప్రభావం వలన శత్రువులైన రాక్షసులను జయించాడు. శ్రీమన్నారాయణ స్వరూపమైన ఈ కవచాన్ని నిత్యం పఠించటం వలన విష్ణు భగవానుని అనేక అవతారాలు, అనేక నామాలు, వాహనాలు, దివ్యాయుధాలు అన్నీ సర్వకాల సర్వావస్థలలోను రక్షిస్తూ ఉంటాయి.

02/26/2018 - 21:36

జ్ఞానం వల్లనే సర్వ అనర్థాలు కలుగుతాయి. అజ్ఞానం నశిస్తే జ్ఞానం ఉదయిస్తుంది. అపుడు ఇబ్బందులేవీ ఉండవు.దేనినైనా పూర్తిగా తెలుసుకొంటే దానిగురించిన అవగాహన వస్తుంది. పూర్తిగా తెలిసినదే కనుక ఏమీ అనుమానం ఉండదు. కాని ఏ వస్తువు గురించి యైనా పూర్తిగా తెలియకుండానే తెలుసు అనే భ్రమ కలిగితే అపుడు అజ్ఞానం ఆవరిస్తుంది. చీకటిలో పొడవుగా ఉన్న దానిని చూసి దానే్న పాము అనుకొంటే అది అజ్ఞానమవుతుంది.

02/26/2018 - 21:28

12.అంత కైకేయి సుతునకు భరతడనెడు
నామ మమరగ జేసి సుమిత్ర సుతుల
కవలులకు లక్ష్మణుడు శతృఘు్నలనెడు
పేర్ల నిర్ణయించెను గురుశ్రేష్ఠుడపుడు

13.దశరధేశున కత్యంత ప్రీతికరుడు
రామభద్రుడు సుగుణాలరాశి యతడు
తల్లులకు తమ్ములకు జనావళికి నెల్ల
సంతతానందదాయి కౌసల్యసుతుడు

02/25/2018 - 20:03

దానగుణానికి మించిన ఉత్తమ గుణం వేరొకటి లేదు. మనం చేసే దానం ఇతరులకు శ్రేయస్సునిస్తుందంటే దానం చేయడం మంచిది అని స్వామి వివేకానంద అంటారు. మరణించిన తరువాత మన శరీర అవవయాలను ఇతరుల ప్రయోజనార్థం దానం చేసేవారు మరణంలోనూ జీవిస్తారు. తమ జీవితాలు ఆరిపోయినా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేవారు నిజంగా ధన్యులు. తను జీవించి ఉండగానే దేహాన్ని త్యాగం చేసిన త్యాగపురుషుడు దధీచి మహర్షి.

02/25/2018 - 22:21

ధవళ వస్త్రంబు దరహాస దంతి ముఖము
ఏక దంతంబుతో వెలుగొందునట్టి
సకల విద్యల కెల్లదానొజ్ఞయైన
కొండ మనుమని కెపుడు దండంబ లిడుదు

1. శ్రీ సమృద్ధవౌ కోసల దేశమందు
సూర్య వంశజు డిక్ష్వాకు చక్రవర్తి
మనువు నిర్మితవౌ అయోధ్యానగరము
రాజధానిగ రాజ్యము జేయుచుండె

02/23/2018 - 22:39

అవన్తికాయాం విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వనే్ద మహాకాలమహం సురేశమ్
భావం: సజ్జనులకు మోక్షమునిచ్చుటకై ఉజ్జయినీ పట్టణమునందు అవతరించి దేవనాయకుడగు మహాకాలుని అకాల మృత్యువునుండి రక్షించుటకై నమస్కరించుచున్నాను. శివశంకరుడు భక్తవశంకరుడు భక్తులపై అపార కృపావర్షాన్ని కురిపించు భవుడు.

02/23/2018 - 22:41

జనార్దన
21.జలజలోచన నీదాస జనుల కెలమి
యర్ధ కామములిచ్చు జనార్దనుడవు
నిన్ను నిరసించు మూఢ దానవుల బటిట
దండితులజేయు చక్రహస్తుండ వీశ

ఉపేంద్ర
22.ఇంద్రునకు సోదరుండవు యింద్రియముల
కర్మ మార్గమునందు సక్రమము తోడ
నడుపు నేతవు నిన్ను పేద్రుండటంచు
బుధ జనంబుల సేవింత్రు భక్తితోడ

02/22/2018 - 23:15

ఆధ్యాత్మికంగా ఎదగడానికి సాధకుడు ముందుగా ఏకాగ్రత కోసం ప్రాణాయామాన్ని ప్రారంభిస్తాడు. మెల్లగా మనసు, బుద్ధిని స్థిరపరుచుకుంటాడు. ప్రతిరోజునియమ ప్రకారం ప్రాణాయామం, తపస్సు లాంటివి చేస్తున్నా ఒక్కొక్కరు మాకు ఇంకాభగవంతుని సాక్షాత్కారం గాని కనీసం భగవనుభూతి కాని కలుగ లేదని చెప్తుంటారు. భగవనుభూతి అనేది ప్రతివారికి అనుభవైకవేద్యమే. కాని దాన్ని గుర్తించిన వారు తక్కువగా ఉంటారు.

02/22/2018 - 22:39

శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే
శేషాద్రి శృంగేఁపి సదా వసంతమ్
తమర్జునం మల్లిక పూర్వమేనం
నమామి సంసార సముద్ర సేతుమ్
భావం: శివా అన్నంతనే పలుకు వాడు అపారమైన కృపావర్షం కురిపించువాడు అయన పరమశివుడు అనేక కథలకు ఆధారమైన శ్రీశైలమునందు, శేషాద్రి శిఖరమునందు నివసించేందుకు వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. సముద్రమును దాటించు వంతన వంటివాడు అగు ఆ శివరూపమైన మల్లికార్జునుని నమస్కరించుచున్నాను.

02/22/2018 - 22:34

అనిరుద్ధ
16.దేవకీ సుతు పౌత్రుడు దివ్యతేజు
డమిత సుందరు డనిరుద్ధు డసుర కన్య
బాణు పుత్రికకై నాగపాశ బద్దు
డైన మనుమని విడిపించి బాణునొంచి
పెండ్లిజేసెను కంసారి ప్రేమికులకు

పురుషోత్తమ
17.చేతనములుందు నీలోన చతనముల
యందు జీవాత్మవై వెల్గుచుందు వీశ
పుణ్యపురుషులు పురుషోత్తమా యటంచు
నన్యమెరుగక ధ్యానింత్రు నినె్న వరద

Pages