S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/04/2019 - 19:33

చిగురాకుల చెక్కిలి మీద
చిరుగాలి పెట్టెను ముద్దు

వగలొలికే పువ్వుల సొగసులు
చెలరేగెను తుమ్మెద తలపులు

కుసుమంపై వాలెను భ్రమరం
మధుజలమున చూసెను తన రూపం

సొగసరి పువ్వుల రేకులు
గడసరి తుమ్మెద రెక్కలు
చెట్టాపట్టాలేసినవి
వలపుల తలుపులు తీసినవి

04/04/2019 - 19:32

పొందికైన కొమ్మలన్ని
కళ్లనిండ పూసింది
మధురమైన పరిమళాలు
కొత్త ఊసులాడింది
మల్లెపొదల దోసిట్లో
తుమ్మెదలు వాలింది
లేతలేత కోయిల గొంతు
మంద్రపు మత్తు చిలికింది
హృద్యమైన కలములన్ని
రమ్య గీతాలు పాడింది
ప్రకృతిలోని ప్రతి అణువూ
పరవశించి విరిసింది
పచ్చని గుమ్మాల పుడమి
స్వాగతాలు పలికింది
ఊరించే మావిళ్లతో

04/03/2019 - 19:42

అనుచు హనుమ సీతకొరకు వెక్కివెక్కి ఏడ్చెను
హనుమ కాడు-అవుడాతడు తల్లి బాయు పిల్లడు

శ్రీకృష్ణుడు:
నీ వెరగవె? నీ తల్లిని? నాసాయము కోరుదే?
తల్లి పిల్ల నెడబాపెడి- వాని నేను కానోరుూ!

వెదకికొమ్ము నీ తల్లిని నీవే వెదకి పట్టుకొమ్ము
అమ్మలలో ఏయమ్మో? నీకునీవె కనుంగొనుము.

హనుమ:
లంకలోనె కనుగొంటిని నా సీతామాతను
లంకేశ్వరు నెదిరించితి రక్కసులను గూల్చితి

04/03/2019 - 19:40

ఉ. ఆమని రాకతోఁ దరుల తాంగులు నాట్యము సేయగా ప్రజా
సేమము నెంచి నేతలిక శీఘ్రముగాఁ గృత కృత్యులై మహా
రామము రామ రాజ్యములు రాజిల గావలెనంచు దీక్షతో
సోమునిఁ బోలు వారలయి సూక్తులు గుండెల నింపుకోవలెన్

ఆ.వె. ఆరు రుచుల సారవౌపోసనము వట్టి
కష్టసుఖములందుఁ గలసి వచ్చి
సాటివారి పట్ల సహృదయతను నిల్పు
మికనటంచు ఁ బల్కె రుూ వికారి!

04/03/2019 - 19:40

నా ఇంటి గుమ్మం ముందు
చూపులు వేలాడేసుకుని
ఒక రావి చెట్టూ పలకరిస్తూ
ఋతువుల్ని తనలో మెరిపిస్తుంది.
నల్గురు మాట్లాడే రచ్చబండ నుంచీ
కాస్త దూరం జరిగాక
ఒంటరి నగర జీవనం
ఒక శిశిరంలానే కనిపిస్తుంది.
అంత పెద్ద చెట్టూ ఆకు రాలి మోడువారినా
వసంతాన్ని మరచిపోనట్లు
రేపటి చిగుర్ల కోసం శ్వాస తీస్తుంది.
కాలాన్ని అంకెలతో ముడివేస్తూ

04/02/2019 - 18:33

ఆకసమ్మునేలు వాడు అవని నేల దిగెనంట
భాస్కరుడే అతని చేత భాసిల్లెడు చక్రమంట

అతని గొలువ సీతమ్మయు మరల అవతరించెనంట
ప్రజలెల్లరు ద్వారక నా ప్రభువు భక్తి గొలుతురంట

ఏదీ మాయమ్మ సీత? ఎటనున్నది స్వామీ!
నీరు లేని చేపలాయె నా కన్నులు స్వామీ!

అత జోడ్చుచు తన చేతుల
హనుమ వేడుకొనియె

04/02/2019 - 18:32

కం. స్వాగతము ‘వికారి’కి సు
స్వగతముల్ సర్వ భోగ సౌఖ్యముమ్మలిడన్
మాగతము మర్వజేసి సు
యోగము కల్పింపు కొత్త ఊపరి సలుపన్

కం. జనతకు సుఖ సౌఖ్యమ్ములు
ఘన సంపాదనము గల్గి కామ్య సఫలమై
మనసుల్లాసము నొందగ
మనగల సౌభాగ్య మమరి మాన్యంబగుతన్

04/02/2019 - 18:31

1. ఆవలిస్తూ అనంతకాల సుషుప్తిలోకి అంతర్లీనమవవబోతూ ‘‘విళంబి’’
ఆరు ఋతువుల ఏకచక్ర రథంలో పరుగు పరుగున వస్తోంది ‘‘వికారి’’
ఆవురావురుమంచు ఆరవతేది ఆకాశము నుండి అవతరించనుంది ‘‘ప్రభవాది’’ మధ్యమున
ఆశలతో అర్రులు చాస్తూ ఆహ్వానిద్దాం ఆనందమైన విచిత్రమైన ‘‘వికారి’’ని

04/01/2019 - 19:48

వచనం- పరీక్షగా చూశాడు హనుమ. చుట్టూ మగువలు! మధ్యన ఓ మన్మథాకారుడు! దేవతల చేత పరివేష్టితుడైన మహావిష్ణువులా వెలుగుల చిరునవ్వుల్ని చిందిస్తున్నాడు! ఆపై అతని వంక ఆరాధనాభావంతో చూస్తూ ఇలా అన్నాడు హనుమ.

హనుమ:
ఏమయ్యా! రామయ్యా! ఏమిటి ఈ తీరు?
నా రాముడు ఈ రామల నడుమ నుండుటేమి?

ఓంకారమ్మును బోలెడు నీ చేతను ధనువేదీ?
హ్రీంకారమ్మును చేసెడి కిరణమంటి శరమ్మేది?

04/01/2019 - 19:46

సీ. సర్వ సమానత్వ సాధనే లక్ష్యమై
మేల్కొల్పువాడవై మెఱయవలయు
అవినీతి మృగ్యమే యవని నీకర్తవ్య
మని యెంచి కడదాక మనగవలయు
ప్రేమామృతపు ధార ఁబృధ్విపై నిరతమ్ము
గురిపింప లోకులు మురియవలయు
తలలోని నాల్కవై మెలగుచు పదిమంది
కాదర్శమూర్తివై కదల వలయు

Pages