S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/06/2018 - 22:11

అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఎవరితోనూ ఎవరూ మాట్లాడుకొనుటలేదు.
అట్లా వున్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ వృష్ణివంశజుడూ, ధర్మపక్షపాతి అయిన శ్రీకృష్ణవాసుదేవుడు అన్న బలరాముతో కలిసి పాండవులను చూడటానికై పాండవులున్న కుమ్మరి ఇంటిలోనికి ప్రవేశించాడు.

02/06/2018 - 21:59

పువ్వు పుట్టగానే పరమళించినట్టు 1906లో ఏప్రిల్ 15 వెంకట్రామయ్యర్, లక్ష్మి అమ్మాళ్ గార్లకు పుత్రోత్సాహాన్ని సాయి పాదానంద రాధాకృష్ణగా పుత్రోత్సాహాన్ని కలిగించాడు. ఆ రాధాకృష్ణ బాల్యంలోనే వారి తల్లిదండ్రల భక్తివారసత్వాన్ని అందుకున్నారు. ఇతని తాతగారికి కొన్ని సిద్ధులుండేవని వీరు చెప్పేవారు.

02/06/2018 - 21:56

ఒకానొక కాలంలో ఓ గొర్రెలు మేపే వానికి వైరాగ్యం వచ్చింది. ఎంతకాలం చూసినా ఈ గొర్రెలను మేపడం, యజమాని ఇచ్చిన డబ్బుతీసుకోవడం, దానితో దిన వెచ్చాలుకొనుక్కొవడం, అవి తినడం అంతేనా బతుకు అంటే నేను పుట్టాను. పెరిగాను. రేపొద్దున చనిపోతాను. కాని నేను పుట్టినందుకు ఏం చేస్తున్నాను. నేను పోయేక ఎవరైనా నన్నుగుర్తుపెట్టుకుంటారా అనుకొన్నాడు.

02/06/2018 - 21:53

విభూతి ధారణ వల్ల ముక్తి లభ్యం. ఇది అందరకూ తెలిసిన విషయమే. పునర్జన్మ కలుగదు. విభూతి అనే మాట కు సంపద అనే అర్థం ఉంది.సంపదలు రెండు రకాలు. లౌకికము, అధ్యాత్మికము అని వీటిని చెప్పుకోవచ్చు. భగవంతుని అనుగ్రహం కూడా సంపదే. శైవ సంప్రదాయంలో విభూతికి చాలా ప్రాధాన్యం ఉంది. షట్కాల శివపూజ అంటే శివుణ్ణి ఆరుసార్లు పూజించడం అనిఅర్థం. అష్టావర్ణములు అనగా భస్మ, రుద్రాక్ష, పాదోదకం, వంటి ఎనిమిది ముఖ్య శివాచారములు.

02/05/2018 - 20:53

మనం నిత్యం పాటించే సంప్రదాయాల్లో ‘నమస్కారం’ ప్రధానమైంది. మనలోని వినయాన్ని చాటుకోవాలంటే ‘నమస్కారా’న్ని అవతలి వారి హృదయాన్ని తాకేలా నమ్రతతో కూడుకొని ఉండాలి. సంప్రదాయంలో ‘నమస్కారం’ అనే మాటకు యోగఫలసిద్ధికి చేసే ప్రణామమనే అర్ధం ఉంది. ప్రణామమంటే ‘నమస్కారమ్’ ప్రణిపాతం అని భగవద్గీత దీనే్న ప్రస్తావించింది. నమస్కారంలో మనిషి నిజాయితీ వ్యక్తవౌతుంది. ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి’ అన్నారు.

02/04/2018 - 21:05

అణిమా, మహిమా,చ ఇవ, గరిమా,లఘిమా, తద్మా
ప్రాప్తిః, ప్రాకామ్యం, ఈశత్వ, వశత్వంచ, అష్ట్భూతయః

02/04/2018 - 21:02

కాబట్టి ద్రుపదుని బలాన్ని అణచివేద్దామని తలపోశారు.
ఈ బ్రాహ్మణునితో మనకేమి పని. అతడు చేసిన తప్పేమిటి? రాజులందరినీ మోసం చేసిన ద్రుపదుని వదలగూడదు అని ద్రుపదునిపైకి దండెత్తి రాగా ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల చాటున చేరాడు.
అది చూచిన అర్జునుడు- ‘‘నా అస్త్రంచే ద్రుపదుడిపై దండెత్తిన శత్రువులను అణచివేస్తాను. మీరు ప్రక్కకు తొలగి చూస్తుండండి’’ అని అన్నాడు.

02/04/2018 - 21:00

ఆహారం తిన్నందే ఏ జీవి కూడా ప్రాణాలతో ఎక్కువ సేపు ఉండలేదు. ఆరోగ్యం కోసం ఉపవాసాలు చేస్తారు. కాని ఆ ఉపవాసాలు ఎక్కువైతే ఆహారం తక్కువై మనిషి నీరసించి పోతాడు. అందుకే మనకు ముఖ్య ఆహారం అన్నం కనుక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు.

02/04/2018 - 20:58

దేవదానవులు కలసి అమృతాన్ని సాధించడం కోసం సముద్రాన్ని మధించారు. ఆ సముద్ర మథన సమయంలో వెలువడిన (గరళం) హలాహలాన్ని మ్రింగిన శివుడు, ఆ విషవాయువుల ప్రభావంతో కుంచించుకున్నాడా అన్నట్లు సగమై చిక్కితే, ఎపుడూ భర్తనంటి ఉండే ఆది యిల్లాలు ఆ శైలపుత్రి, భర్త ఒంటిలోని వేడికి తానూ సగమైనదట. ఆ యిరువురి సగాలు కల్సి ఒక శరీరంగా మారినాయట. అదియే అర్థనారీశ్వర రూపం.

02/04/2018 - 20:56

ఓ భగవంతుడా! నీవు మాప్రాణాలు తీసుకో అంతేకాని ఈ చిన్ని కృష్ణుని ప్రాణాలకు ఆపద రానివ్వకు. ఈ కాళీయుని విషజ్వాలలకు మా ప్రాణాన్ని బలిపెట్టకు. కృష్ణుడు లేకపోతే మేము లేము. ఓ కృష్ణా! ఎన్నో సార్లు మేము పలుకగానే నీవు ఓ అని పలికేవాడివి గదా. మరి ఇపుడు ఏమైంది నీవు అట్లా సోయ లేకుండా పడుకుని ఉన్నావే. ఒక్కసారి నీవు కనులు తెరిచి మా వైపు చూడు’’అంటూ పరిపరివిధాల భగవంతుడిని కోరుకుంటున్నారు.

Pages