S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/19/2018 - 21:36

ప్రపంచంలో ఉన్న మతములన్నింటిలోను హిందూ మతం చాలా పురాతనమైనది. ఈ మతమునే ఎక్కువమంది ప్రజలు అనుసరిస్తారు. వీరినే హిందువులని వ్యవహరిస్తారు. హిందువు అనే పదము ఎప్పుడు, ఏ విధంగా ఉద్భవించింది? అనుకొంటే ఈ పదము వేదాలలోగాని, ఉపనిషత్తులలోగాని, పురాణములలోగాని, మత గ్రంథములలో కాని కనిపించదు. త్రేతాయుగము నాటి రామాయణంలో గాని, సుమారు 5250 సం.ల నాటి ద్వాపర యుగంలోని భాగవతం, మహాభారతం, భగవద్గీతలోకాని కనిపించదు.

04/17/2018 - 21:41

636. అతుల బలవంతుడనిలసుతుండు నొక్క
కొండ బెకలించి వారల పైకి విసరె
రూపములు బాసి యంతక పురికి జనిరి
వార్త హతశేషు లెరిగింప రావణుండు

637. యోధవరులైన సేనాధిపతుల నంపె
వార లేవురు హనుమచే నిహతులైన
తొట్రుపాటును గప్పు కొంచుసర భర్త
యెదుట నున్నట్టి అక్షకుమారుజూచె

04/13/2018 - 20:52

‘ప్రేమ’ అన్న మాట ఈ రోజున ఎక్కడ చూసినా వింటూనే ఉన్నాం. ఐతే, ఆ ప్రేమ స్వచ్ఛమైనదా? నిర్మలమైనదా? కేవలం ఆకర్షణా - అంటూ దాన్ని విశే్లషించుకోవటంతోనే సరిపోతోంది. ప్రేమ అనేది లేదూ అంటూ చెప్పేవాళ్లూ ఉన్నారు. ప్రేమే జీవితం అన్న వాళ్లూ ఉన్నారు. కానీ- ప్రేమ శాశ్వతమైనదా? ఇలా వచ్చి అలా వెళ్లిపోయేదా? ప్రేమ చల్లారి పగల సెగల ఎగసిపడుతున్న ఈ రోజుల్లో ఎటూ చూసినా ఎక్కడ చూసినా.. ఇంటా బయటా..

04/11/2018 - 20:55

విశ్వాంతరాళము యొక్క దిక్కులు మానవులకు అగోచరములు. స్వర్గలోక, భూలోక, పాతాళ లోకములకు దక్షిణ దిక్కుగా నరకలోకము నిలిచియున్నదని పరీక్షిత్తునకు శుకయోగీంద్రులు శ్రీమద్భాగవతములో వివరించెను. పాపపుణ్య ఫలములు ప్రారబ్దమును బట్టి ఈ జన్మలోనే భూలోకముందు అనుభవింపక తప్పదు.

04/08/2018 - 21:10

ఒక చిన్న ముల్లు గుచ్చుకొంటేనే బాధపడే మనం అన్యాయంగా ప్రాణి వధకు పూనుకోవటం ధర్మం కాదు. మన బిడ్డలకు హాని కలిగిస్తే చూస్తూ ఊరుకుంటామా?

04/05/2018 - 21:31

శకునం గురించి నలుగురూ నాలుగువిధాలుగా చెప్తుంటారు. మంచి శకునం ఎదురువస్తే మంచి జరుగుతుందని, ఒకవేళ అనుకొన్న శుభ శకునం రాకపోతే చెడు జరుగుతుందేమోనని భయపడుతుంటారు. కాని శకునం అనేది మనం చేయబోయే పనిని బట్టి ఉంటుంది. మనం స్వార్థంగా కాక నలుగురికీ మంచి జరుగాలని, అందరూ బాగుండాలనీ అనుకొంటే ఆ పని శకునంతో పట్టింపు లేకుండానే అనుకొన్నపని అనుకొన్నట్టుగా అయిపోతుంది.

04/04/2018 - 02:27

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునునికి కర్మయోగ మహిమను ఆచరించవలిన విధానమును, దానివలన కలిగే ఫలితమును వివరించిన తీరు అర్జునునికే గాక అన్ని యుగాలకూ అద్భుత సందేశం. అన్నివేళలా అందరూ ఆచరింపదగినది. ఈ విషయాన్ని శ్లోకాలలో విపలీకరిస్తూ, అర్జునా! కర్మలనాచరించు వేళల్లో, ఆ కర్మనెట్లు చేయవలెనో, దానిని గూర్చిన వివేకమవసరము. ఆ వివేకమునే బుద్ధి అంటారు.

04/01/2018 - 21:56

ఇక్ష్వాకుల కులదైవమైన శ్రీరంగనాథుడు అర్చాస్వరూపముగా వెలసి వున్న దివ్య దేశం శ్రీరంగక్షేత్రం. తమిళనాడులోని చోళమండలంలో వున్న తిరుచునాపల్లి అనే పట్టణం అనేక భవ్య దేవాలయములకు నెలవై వున్నది. ఆ దేవాలయములలో అత్యంత విశిష్టమైనది శ్రీరంగక్షేత్రము.

04/04/2018 - 02:17

452. అనుచు లంఖిణి శూరుని హనుమ నంపె
శత్రు శిరముపైపాదము బెట్టునట్లు
ఎడమ కాలును లంకలో బెట్ట జనక
తనయకు శుభశకునమయ్యె హర్షమొదవె

453.రాజవీధిని జనుచున్న హనుమ వీధు
లందు జల్లిన పరిమళ జలము పుష్ప
సౌరభంబును నాసికా నేత్రములకు
విందు గూర్పగ ధరజను వెదక సాగె

03/22/2018 - 21:06

292. భానునందను డవనిజ పతిని జూచి
‘‘రాఘవా! మే మొక దినము పర్వతాగ్ర
మందు నుండగ గగన మార్గమ్మునందు
రావణాపహృతయగు స్ర్తి మమ్ముజూచి

293. భూషణంబుల కొంగున మూటగట్టి
మా దరికి విసరగ నవి మేము దెచ్చి
భద్రపరచితి’’ మని గుహన్ పదిల పరచి
నట్టి నగలను రాఘవునెదట నుంచ

Pages