S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/07/2019 - 19:06

తప్పనిసరిగా మరుచివ్వలో మార్పు
పసి ప్రభాత క్షతజాన్ని
పచ్చివెచ్చగా స్రావం చేసుకుంటోంది
సర్వతోముఖంలో సగమైన
వరారోహ భవిత
తూగుతున్న వాహనంలో జోగుతోంది
పిల్లనగ్రోవిలాంటి వాక్యం ఫెళ్ళున విరిగింది
శయ్యతో పెట్టుకున్న తర్కంతో
కోల్పోయిన కలలకు దేహ తారుణ్యాన్ని బలిపెట్టినట్లు
పిల్లనగ్రోవి లాంటి వాక్యం ఫెళ్ళున విరిగింది

,
10/06/2019 - 21:51

శిరిడిలో అలనాడు సాయిబాబా చుట్టూ ఎంతో మంది ఉండేవారు. వారంతా ఆయన భక్తులు. కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా కూడా ఉండేవాళ్లు. వాళ్లు ఆయన్ను చూస్తూ బాబా చేసేపనులను పరీక్షిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వాడవాడలా శిరిడీ నాథుని గుళ్లు కోకొల్లలుగా ఉన్నాయి. చాలామంది సాయినాథుని భక్తులుగా ఉంటున్నారు. వారంతా ప్రతి గురువారం సాయి బాబా గుడికి వెళ్తుంటారు.

10/06/2019 - 21:48

సీ. తలచిన వారలుఁ బిచి నంతట ఁ బల్కు
కలిమి బలముల బంగారు దుర్గ
దారిద్య్ర నాశినీ దయగల మాతల్లి
యమృత వర్షిణి వి నేవమ్మా దుర్గ

నమ్మిన వారికి నవవిధులొసగంగఁ
దలుపుఁ దట్టెద వీవు తల్లి దుర్గ
చింతలెన్ని యునున్నఁ జిడికెలో ఁ జలార్పఁ
గదలి వచ్చెడి తల్లి కనక దుర్గ

10/06/2019 - 21:45

గ్రహ, శత్రు, అపమృతు దోష నివారణ కోసం చేసేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది.

10/06/2019 - 21:42

ఋక్షాక్షర శిల్ప ప్రబంధవౌతోంది
మసక వెలుతురు దీపజాలంలో పడి
మయి మంపుగొని
చీకటి మాటల్ని చుట్టుకుంటోంది
బుద్ధిబంధితాలైన జల్పదృశ్యాలు
ఆనంద కారకాలై
నిభృతావేశ నైసర్గికాలవుతున్నాయి
ఆరుబైలు
అర్ధనగ్నంగా చేస్తున్న అభినయానికి
ఇళ్ళు కళ్ళు మూసుకుంటున్నాయి
అంతరంగ వాంఛకు
వ్యామోహపు వౌనం లొంగి
ఆశావేశంగా అగ్నిప్రదక్షిణం చేస్తోంది

10/04/2019 - 19:55

అమ్మా! అయ్యా!శివ, శివా మీరు దైత్వమా
అద్వైతరూపములోన శివాశివశకె్తైక రూపిణివా
ఆదిశక్తి అనేకకోటి బ్రహ్మాండ జననీ
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా శ్రీమాత రూపిణీ!

త్రికోణిరూపిణి శక్తిఃబిందురూప శివహ
త్రిపురా త్రిగద్వంద్యా త్రిమూర్తి సిద్ధేశ్వరీ
త్రివర్గ రాత్ర సుభగా త్రయంబికా త్రిగుణాత్మకా
త్రికోణాంతర దీపికా తేజోవతీ భగవతి భగమాలినీ

10/03/2019 - 18:54

కల్పాంతరాలకు పూర్వం కదలిక పొందిన
పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందినవాడేనా-
ఏడీ ఆ మానవుడు?
ఉదయాన్ని జారవిడుచుకున్న తూర్పు
పశ్చిమాకాశానికై ప్రాకులాడుతోంది...
***
తర్కానికి విశ్వాసానికి ఏర్పడ్డ తగాదాలో
విశ్వాసం వీగిపోయింది
పొద్దుగడవని పగలు- పొద్దుపొడవని రాత్రి
ఒడికారపు శే్లష భంగిమలో నుడికారపు కడలొత్తుకుంటున్నాయి

10/01/2019 - 18:59

జైకిసాన్, జైజవాన్ అన్న నినాదంతో భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఉత్తేజ పరచి దేశభక్త ప్రపూరితులుగా చేసిన మహనీయుమూర్తి శ్రీ లాల్‌బహదూర్‌శాస్ర్తీగారు. ఆజన్మాంతము ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసి నిస్వార్థసేవా పరాయణత్వంతో నిరాడంబర జీవనంతోను, అకళంక దేశభక్తితోను మానవతామూర్తిగా ప్రజాసేవలో అసువులర్పించిన శాంతి దూత లాల్ బహదూర్ శాస్ర్తీగారు.

10/01/2019 - 18:58

సౌత్ ఆఫ్రికా నుండి వెనక్కి వచ్చాక (1915) గాంధీ తాత్కాలికంగా కొంత కాలం రవీంద్రుని ‘‘శాంతి నికేతన్’’లో ఉన్నారు. గాంధీజీ శాంతినికేతన్ చేరుకునేప్పటికి రవీంద్రులు అక్కడ లేరు. అంతలో రవీంద్రులు కూడా శాంతి నికేతన్ తిరిగి వచ్చారు.

09/30/2019 - 18:44

తృతీయాశ్వాసం
మృత్యువును శ్వాసిస్తూ జీవితం బ్రతుకుతుంది
జీవితాన్ని శాసిస్తూ మృత్యువూ బ్రతుకుతుంది
నా
సందర్భంలో అప్రస్తుతమైన అందాన్ని చూస్తే
కలిగే ఆనందం
ఎంత అర్థరహితమో
వర్తమానమే నిస్తుల సాక్ష్యం...
ప్ర.ల ప్రపంచపు ఆశలు మాడి మసిఅయిపోతుంటే
రేపటి వాగ్దానాలు
ఎంత ఆరోచక నిగమాలో ఆలోచనకందవు..
నా

Pages