S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/03/2019 - 19:45

‘వినాయక చవితి’, దసరా, దీపావళి, కార్తీక ద్వాదశి, ముక్కోటి ఏకాదశి ఇలా సంవత్సరం పొడువునా ఎన్నో పండుగలు, పర్వాలు వస్తూనే ఉంటాయ. చిన్న పె ద్దా తేడాల్లేకుండా ఎంతో సంబరంతో కొత్త వస్త్రాలు కట్టుకుని ఎన్నో కొత్త కొత్త పిండివంటలు చేసుకొని తింటూ ఉంటారు. మరెన్నో సంబరాలు చేసుకొంటూ ఉంటారు.

09/01/2019 - 22:25

ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహీ
తన్నోదంతి ప్రచోదయాత్
శ్లో వక్రతుండ మహాకాయ - కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా

09/01/2019 - 22:15

పంచభూతాలలో మట్టి విశిష్టమైనది. ఏ వస్తువైనా, మట్టినుంచే పొందాలి. మట్టిపైనే నివసించాలి. మట్టిపై నుంచి వచ్చే నీటినే తాగాలి, గాలినే పీల్చాలి. కాని శ్రమించి మట్టినుండే దేవతల అనుగ్రహము పొందాలి. వినాయకుడిని తమ ఇలవేల్పుగా భావించే ఓ అన్నదమ్ములు వారి కష్టాలు తీరి వారి పంట పొలం నీటి ఎద్దడి లేకుండా బాగా పండాలనే ఉద్దేశంతో వారి పొలంలో ఉండే బావికి పూడిక తీద్దామనుకొన్నారు.

09/01/2019 - 22:13

ఐహికం, ఆధ్యాత్మికం అయిన జగద్విజ్ఞానమంతా గణేశుని ఆధీనమే. రుగ్వేదం గణపతిని గణాధిపతి, సర్వమంత్రాధిపతి, బ్రహ్మాది దేవతలలో శ్రేష్ఠుడు అని పేర్కొంది. గణ శబ్దంలో ‘గ’అంటే విజ్ఞానమని, ‘ణ’ అంటే మోక్షమని బ్రహ్మ వైవర్తన పురాణం చెబుతోంది. దేశకాలాతీతమై, త్రిగుణాతీతమై అస్థిత్వం- అనస్థిత్వం లేనిదై, అద్వైతమై, అవస్థాత్రయానికి సాక్షియై, నిర్గుణ బ్రహ్మ స్వరూపమైన గణేశుడు సమస్త విశ్వానికీ నాయకుడు.

09/01/2019 - 22:10

ఏ సంప్రదాయకులైనా బ్రహ్మ, విష్ణు, రుద్రులకు పరబ్రహ్మగా సాక్షాత్కరించే గణపతికి ప్రథమ ఆరాధన నిర్వహిస్తారు. వేదాలలో పేర్కొన్న పరమ తేజం. వినాయకుడే. గణపతిని మంత్ర, తంత్ర, విధి విధానాలతో కూడా పూజిస్తారు. అందులో పత్ర పూజ మరింత విశిష్టమైంది. గణపతిని పూజించే ప్రతిలోని పత్రాలన్నీ కూడా శాస్తర్రీత్యా ఔషధీగుణాలు కలిగున్నాయ.

08/30/2019 - 20:17

ఈ భాద్రపద శుక్ల తదియ వరాహ జయంతి. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాలలో మూడవది వరాహావతారం. ఈ అవతారం ఆవిర్భవించినది భాద్రపద శుద్ధ తదియను వరాహ జయంతిగా సంభావిస్తున్నారు.

08/30/2019 - 20:13

పద్యలహరుల మీద
ఛందస్సనే తెరచాపకట్టిన ప్రాబంధికప్పడవ
ఊహాతీత సౌందర్యమై ఊగుతోంది
నాకళ్ళమీద సీతాకోకచిలకలు వాలుతున్నాయి
సంధ్యలో తడిసిన నా పాటకు
మునిమాపు గొంతునిచ్చినప్పుడు
రెక్కల్లో స్వరాల్ని అదుముకొంటూ పక్షులు
పాదపాన్ని చేరుకుంటున్నాయి
ఆకాశం ‘పంచదశీప్రమిద’ను మోసుకొస్తోంది
నక్షత్రాలను చిత్రిస్తున్న చెట్టు కొమ్మకు
నా చేయి తగిలింది

08/29/2019 - 19:29

కర్మమున బుట్టు జంతువు
కర్మమున వృద్ధి పొందు గర్మమున జెడుం
గర్మమె జనులకు దేవత
కర్మమె సుఖదుఃఖములకు కారణమనఘా
ఈ పద్యంమహాభారతంలో కనబడుతుంది. ప్రారబ్ద కర్మ అనుభవించక తప్పదు. బ్రహ్మాదులైనా సరే ప్రారబ్దకర్మ అనుభవించి తీరవలసిందే. ఇంద్రుడు బ్రహ్మహత్యాదోషమునకు భయపడి తామర కొలనులో దాగినను ఆయనకు ఆ కర్మ అనుభవించక తప్పలేదు.

08/29/2019 - 19:27

నభోమండలాన్ని చూపుతో తడిమినప్పుడు
కదలని సూర్యుణ్ణి కదిలించిఉదయాస్తమాయాల
ఏకత్వాన్ని రెండుగా విడగొట్టిన భూమి కనిపించింది
విశ్వ శూన్యంలో తిరిగే బ్రహ్మాండమైన చక్రం..
మరకతాల్ని పులుముకొన్న అడవుల మీంచి
అలలు అలలుగా దొర్లుకుంటూ
సలిల కల్పాలవటం వల్ల కాబోలు చల్లగా వున్నాయి
జీవన వ్యవసాయంగా సాగే మనుకంద మరుత్తులు..
సౌందర్యాన్ని విచ్చుకుంటున్న పొద సుమధన్వి

08/28/2019 - 19:03

పరిత్రాణాయ సాధూనాం
వినాశయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే

Pages