S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/13/2019 - 18:52

గ్రహించు...
నాగేటిచాళ్ళు పైరు పచ్చల్ని నవ్వుతున్నపుడు
కఱ్ఱు తగిలి నేల గాయపడిందనుకున్నవాడి
గా తిని కడిగేందుకు
గంధ ఖనిజాక్షరాలనే ఎంచుకుంటాను- వాడి
వక్షశ్శాద్వల సీమ మీద నా కవోష్ణకిరణాల
హిరణ్యం చల్లుతాను...
మా ఊరు నుంచి వసంతం వెళ్లిపోయినప్పుడు
చెట్లు
అనార్ద్రమైన ఎండ కన్నుకు బలియైపోయాయి
దిగులు బరువుపూస్తున్న కొమ్మలమీద

08/12/2019 - 18:45

ఇవాళ
నేనిక్కడ ఎత్తిన గొంతు
ఆకాశాలు ఒరిసే అడవుల నిశ్శబ్దంలోంచి
పల్లవశ్రేణులై ప్రతిధ్వనిస్తుంది..
ఇవాళ నా పాట
నిదురించే గ్రామరధ్యల్లో
కర్తవ్య రుధిర ప్రవాహమై
మానవాభ్యుదయ రోచిర్నివహాన్ని అభిషేకిస్తుంది..

08/12/2019 - 18:41

సర్వ పురాణ శిరోమణి అయిన శ్రీమద్భాగవత సందేశాన్ని శ్రీ శుకదేవుడు పరీక్షిన్మమహారాజుకు అందిస్తూ , రాజుకు ఉత్తమగతులను కల్గించుటకు రాధాసహితుడైన శ్రీకృష్ణుని రాసక్రీడను వర్ణించి సర్వదేశశిరోమణియైన శ్రీకృష్ణుని దర్శింపచేశాడు. ఈ రాసక్రీడలో ప్రధాన నాయిక రాధాదేవి.

08/11/2019 - 19:25

అన్ని వేడ్కలు తీరె మిగిలెనొక వేడ్క
అప్పగింతలు మిగిలె మిగిలె కన్నీళ్ళు.

నింగిలో నిముషాన మురిసె మేఘాలు
నవ్వుముఖముల పులుముకొనెను దుఃఖాలు.

కుండనిండినయట్లు గుండెల్లు నిండె
కుండ పగిలినయట్లు పొంగె దుఃఖాలు.

గుండె కరుగగ తల్లిదండ్రులేడ్చేరు
తమ పట్టి చేపట్టి అప్పగించేరు.

ఆకసమ్మే ఏడ్చె, భూదేవి ఏడ్చె
దిక్కులన్నియు నేడ్చె ఏడ్వదొక సీత.

08/11/2019 - 19:24

గుణాలన్నిటిలోకి త్యాగగుణం గొప్పది. మహిమాన్విత మైంది. త్యాగం చేయటానికి ఎంతో ధైర్యసాహసాలు, సేవాభావం, నిస్వార్థ మనస్తత్వం ఉండాలి. సర్వస్వం త్యాగంచేసిన మహనీయులు మనపురాణాల్లో ఎంతోమంది ఉన్నారు. మనకు తెలిసి ఈ కలియుగంలో కూడా ఎంతో మంది త్యాగధనులు ఉన్నారు. మన త్యాగజీవితాలను చూసిన విదేశీ వనితలు ప్రేరేపితులై వారు కూడా త్యాగభావనను అలవర్చుకుని మనభారతదేశానికి వచ్చిన వారున్నారు.

08/09/2019 - 19:28

అతివ రాముని తలను ముత్యాలు పోసె
కడలిలో ముత్యాలు కలిపెనో యనగ.

రాముండు సీతను నీలాల ముంచె
కడలిరాయడె నీట ముంచెత్త ననగ.

సీత కన్నులలోన రాముండు దాగె
రాము నవ్వులలోన దొరలె సీతమ్మ.

ఆమె కన్నులతోడ నవ్వగా సాగె
అతడు వౌనముగానె మాటాడసాగె.

అందరకును పెండిలిని అగ్నియే సాక్షి
అగ్నివంటి సీతకెవరోయి సాక్షి?

08/08/2019 - 19:57

‘అమ్మా! వరలక్ష్మీదేవి! మాకు పుత్ర పౌత్రాభివృద్ధినీ, ఆరోగ్యంతో కూడిన ఆయుష్షును ప్రసాదించవలసింది’ అంటూ స్ర్తిలందరూ కోరుకునే తల్లి వరలక్ష్మీదేవి. ఈ తల్లినే స్వయంగా చారుమతికి శ్రావణపూర్ణిమకు ముందు వచ్చేశుక్రవారం నాడు తనను పూజించమని చెప్పిందనే వ్రతకథను ఆధారం చేసుకొని స్ర్తీలందరూ శుక్రవారం లక్ష్మినే వరలక్ష్మిగా పూజిస్తారు.

08/08/2019 - 19:56

ఆకసమ్మే వంగి భూమి మెడలోన
కట్టినట్టుల తాళికట్టె రాముడు

ముత్యాలు సీతమ్మ చేత పగడాలు
పగడాలు రామయ్య చేత నీలాలు.

ఒకరి చేతుల నొకరు పోసికొన్నారు
తలయె జలదవ్మౌచు కురిసెనో యనగ.

బాసలను సేసలను కలబోసినారు
తలంబ్రాలుగా వారు పోసికొన్నారు.

రంగురంగుల కలలు రంగైన కలలు
కలలందు కలవోలె కరిగె సీతమ్మ.

08/07/2019 - 19:49

కడలిరాయడె కదలివచ్చెనో యనగ
గగనమ్మె భూమిపై కాలిడెనొ యనగ.

నీలాలె అచ్చోట పొరాడె ననగ
రాముండు విచ్చేసె నీలాలకొండ.

ఉత్తరీయము వ్రేలె మేఘమ్మువోలె
జన్నిదమ్మే కదలె జలధరవోలె.

అతడు కట్టిన పీత వస్తమ్మ్రుకదలె
పసిడి సంద్రమ్మొకటి కదలెనో యనగ.

కంఠాన మెరిసేను ధవళహారమ్ము
రిక్కలనె గుదిగూర్చి కట్టిరో యనగ.

08/07/2019 - 19:47

ప్రకృతినుండి మహత్తత్త్వం అహంకారం, బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు పంచభూతాలు అనే చతుర్వింశతి తత్త్వాలు ఆవిర్భవించాయి. ఉపాధులన్నింటిలో మనుష్యుని ఉపాధి ఉత్తమోత్తమమైనది. మనిషికి వివేక విచక్షణాలు ఉంటాయ. తాను ఎవరు అనే అనే్వషణ ఇత్యాదు లన్నింటినీ జవాబులను కనుకొనగలిగే సామర్థ్యం ఏర్పడి ఉంటుంది. మిగిలిన జంతువులకు మల్లె క్షుత్సిపాలనతో తృప్తి చెందపు.

Pages