S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/06/2019 - 20:48

ఇంటింట తోరణాలను కట్టినారు
ఊరంత దీపాలు వెలిగించినారు.

ఇనునికీ ధరణికీ పెళ్ళియన్నటుల
ఊరంత వెలుగుల్ల వెల్లువైపోయె.

రాసుల్లతో పూలు రాసుల్లు పండ్లు
కళ్ళు పూలై పూచె పండె బ్రతుకుల్లు.

బానల్లతో పాలు! బానల్లు పెరుగు!
క్షీరదధి సంద్రాలు దొర్లెనో యనగ!

గోరింటవలె నున్న సీత చేతులను
గోరంత గోరింట పంట పండేను.

08/06/2019 - 20:47

శ్రీకృష్ణుని బాల్యచేష్టలను స్మరించుకుని తరించడం కృష్ణ్భక్తులకు దినచర్యగా ఉంటుంది. కృష్ణ నామస్మరణలోనే వాళ్లు పులకించి పోతుంటారు. కృష్ణుని కేవలం బాల్య చేష్టలే కాదు ఏ విషయంలోకృష్ణుని చర్యలను తల్చుకున్నా ఎంతో విజ్ఞానం వస్తుంది. మనసు ఆహ్లాదమవుతుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. మానసిక వికాసం జరుగుతుంది. అట్లాంటి వాటిల్లో మన్ను తినే కృష్ణయ్య ఒకరు.

08/05/2019 - 18:13

‘‘నాతమ్ముడు లక్ష్మణుండు నాకు బహిఃప్రాణము
వాని విడిచి నాకెట్టుల పెండిలియగు?’’ననెను.

‘‘నా రెండవ కూతురైన ఊర్మిళనే నిచ్చెదను
నీ తక్కిన తమ్ముళ్ళకు నా తమ్ముని కూతుళ్ళను’’

అని రాముని తోడ నుడివె జనకుండా వేళను
అపుడు వంగె రాఘవుండు ఆమెకందునటులను.

వంగ వలెను ఆకసమ్ము తనకు తానుగాను
దానివంచుటకు ఎవ్వరి తరవౌ నిలలోను?

08/05/2019 - 17:42

పూర్వకాలంనుంచి గ్రహపూజలు, చెట్లకు మొక్కడాలు, పర్వతాలను పూజించడాలు, గిరి ప్రదక్షిణలు చెయ్యడాలు, నదులకు హారతులివ్వడాలు ఇవన్నీ మనకు ఆచారాలుగా వస్తున్నాయ. ప్రకృతికి పులకించి ఎంతోమంది కవులు వర్ణనలు చేశారు. వసంతగానం చేశారు. విశ్వమానవ కల్యాణం గురించి ప్రార్థించారు. సర్పదోష పరిహార్థమై రాహు కేతు పూజలు చేశారు. కాలపురుషుణ్ణి కొలిచారు. సూర్య నమస్కారాలు చేశారు. అష్టదిక్పాలకుల్ని గౌరవించారు.

08/04/2019 - 22:17

‘ఫిళఫిళ’’మను మ్రోతలాయె- మిన్ను విరిగెనో యనంగ
విరిగె నంతటను ధనువు- అతని రొట్టె విరిగెననగ.

హరివిల్లే విరిగెననగ హరి విల్లును విరిచెను
విరిజల్లులు కురిసెనంత రాజు మురిసెనంత.

విల్లు విరిగినంతలోనే సీత గుండెలదిరినవి
అల్లె త్రాటివోలె నామె నాడులు కంపించినది.

ఆ సభలో ఆనందపు కెరటమ్ములు పొంగినవి
సభికుల కరతాళ ధ్వనులు గగనమ్మును ముట్టినవి.

08/04/2019 - 22:14

గత జన్మలో నేను చేసిన పాపం వల్లనే చేయని నేరానికి ఈ విధమైన కష్టాలను అనుభవిస్తున్నాను. అయినవారి చేతనే నా భర్త రాజ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు భర్తృవియోగాన్ని పొంది నానాబాధలకు లోనయ్యాను. ఇవన్నీ నా పాప ఫలమే!’’అని దమయంతి పరిపరివిధాల తలంచి విలపించింది. అలా విలపిస్తూ కొంత దూరం నడిచింది.

08/04/2019 - 22:07

శ్రావణ శుక్ల పక్ష పంచమికి ‘‘నాగ పంచమి’’తోపాటు ‘‘గరుడ పంచమి’’ అని కూడా పేరు. ఈ దినం నాడు గరుడ పూజ ఆచారంగా ఉంది. గరుత్మంతుడు మహా విష్ణువుకు వాహనంగా ప్రసిద్ధుడు. మహాబలశాలి. విష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా గురుడవాహనుడై వెళ్ళి, ఆపన్నుల రక్షణ గావిస్తారు.

08/02/2019 - 19:55

ఒక ధనువును అతడు గెలువ- ఒక ధనువాతని గెలుచును
ఎవరి నెవరు గెలువనేమి? శక్తిశక్తిగలియును.

చూపులు చూపులు కలిసెను- హృదయమ్ములు పులకించెను
‘‘నీవేనా? నీవేనా?’’ యునుచు కనులు భాషించెను.

జన్మ ధన్మమంచు సీత- యెంచె నతడు భర్తయైన
శుభకరమ్ము జీవితమని- యెంచె రాముడామె వలన.

అతడు నడిచె ధనువు కడకు- అంత కలిగె కంపనమ్ము
అది భూమిదొ? భూమిజదో? తెలుపుట కష్టమ్ము.

08/01/2019 - 19:08

పోర్చుగీసు వారు మనదేశంలో తూర్పు సముద్ర తీరంలో వ్యాపారం చేస్తున్న రోజుల్లో ఒకసారి విశాఖపట్నంలోని పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళి, వల వేయగా అందులో ఈ అమ్మవారి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి రోజు పూజించడం ఆరంభిం చారు. అట్లా కొన్ని రోజులు అమ్మవారిని వారు పూజించగా వారికి అమ్మవారు కలలో కనిపించింది.

08/01/2019 - 19:06

అనియెనపుడు గాధేయుడు- మురిసెనెంతొ జనకుడు
‘‘్ధనువునటకు కొనితెమ్మ’’ని- ఆనతిచ్చెనృపుడు.

ఒక చక్రమ్ముల పేటిక నుంచి దాని తెచ్చిరి
కైలాసము తోడ శివుని తెచ్చినటుల తెచ్చిరి.

చక్రమ్ముల తోడ నొక్క చక్రమ్మే కదలెననగ
కదలివచ్చె సీతమ్మయు కదలెనొ విశ్వమ్మనంగ.

పూలతోట నడచి నటుల సీత నడచి వచ్చెను
పూవొక్కటి పూలదండ తెచ్చెననగ తెచ్చెను.

Pages