S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/31/2019 - 18:49

ధనుష్ఖండనం
జన్నమ్మును గావించుచు జనకుడు కొలువును దీరెను
తారలలో పెనుతారగ తాను మెరసిపోయెను.

వౌనికి ఇరుప్రక్కలందు రామలక్ష్మణులు నిల్చిరి
దివ్యప్రభల వెదజల్లెడు దివిటీలను బోలిరి.

‘‘దశరథ నందనులు వీరు- నాకనుంగు శిష్యులు
రాముండీ అందగాడు! లక్ష్మణుడీ మన్మథుండు!

రాక్షస సంహారమ్మును గావించిరి వీరలు
నా యజ్ఞం రక్షించిన శూరులు ఈ వీరులు.

07/31/2019 - 18:47

సనాతన హిందూ ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న పనె్నండు మాసాల్లో ఐదవది మరియు ఎంతో పవిత్రత కల్గినటువంటి మాసం శ్రావణమాసం. వర్షఋతువులో మొదటి మాసం శ్రావణం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడంవలన ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. స్ర్తిలకు అత్యంత పవిత్రమైంది. సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖ సంతోషాలకోసం స్ర్తిలు ఆచరించే వ్రతాల మాసం ఇదే.

07/30/2019 - 19:30

మాటరాని బొమ్మయాయె పూలకొమ్మయాయెను
పెదవి విప్పలేని శిలగ రాముండై పోయెను.

పూలసెజ్జ నచటె వదిలి జానకి పరుగులు దీసెను
ఆమె వెంట ఊర్మిళయును వారి వెంట చెలులును.

పూలను విడి పరుగుదీసినారు పరిమళాలవోలె
పూలు మిగిలె, తోట మిగిలె, శూన్యమ్మే మిగిలె.

పువులు రాలునేమొగాని పరిమళమ్ము రాలదు
జాణలు వీడిరి కాని జాణతనము వీడదు.

07/30/2019 - 19:28

ఆదిమ మానవుని దగ్గర నుంచి నాగరికత పెరిగి రాకెట్ యుగంలోకి వెళ్లుతున్న నేటి వరకు మనిషి ఏదో ఓ రూపంలో భగవంతుడిని ప్రార్థిస్తుంటాడు. కొందరు తమ కోసం తాము బాగుండాలని, తనకు అన్ని విధాల సంతోషాలు చేకూరాలని ప్రార్థిస్తే ఇంకొందరు తమ చుట్టూ ఉన్నవారు బాగుండాలని వారు సుఖసంతోషాలతో జీవించేలా చేయమని ప్రార్థిస్తుంటారు. మరికొందరు సర్వేజనా సుఖినోభవన్తు అందరూ బాగుండాలి అని కూడా ప్రార్థిస్తుంటారు.

07/29/2019 - 18:34

అనుచు నిటుల భ్రమయందున మునిగి తేలినారు
తమ తప్పుల తెలిసికొంచు మిగుల వగచినారు.

పరపురుషుని జూచుటన్న పాపమ్మని తలచెనేమొ
సీత తొట్రుపడుచు సోలి, రామునిపై బడెను.

పూజకొరకు, పుప్పచయముకొరకు తానునేతెంచెను
పూజాసుమమై రాముని పాదమ్ములబడెను.

ఆమె పడెను ఆమెతోడ పుష్పమ్ములు జారిపడెను
పూవుపడెను పూజేతులనున్న పూలు రాలెననగ.

07/29/2019 - 18:32

కోపం రాని వారు అంటూ ఎవరూ ఉండరు. సత్వగుణులకైనా ధర్మాగ్రహం వచ్చితీరుతుంది. కాని కోపం రావడం సహజం. ఆ వచ్చిన కోపాన్ని నిగ్రహించుకొని ఎవరు మీద ఎంత వరకు కోపాన్ని ప్రదర్శించాలో అంతవరకు ప్రదర్శించి త్వరగా ఉపశమింపచేసుకొనేవారు గొప్పవారుగా కీర్తించబడుతారు. రాముడు సాత్వికుడు.

07/28/2019 - 21:11

బొమ్మలవలె, కొమ్మలవలె నిల్చుట ఎందులకో?
అచ్చెరువున మునిగినట్టి అచ్చర భామినులొకో?’’

అని దిగ్గున లేచినారు అంత రామలక్ష్మణులు
తోకల కదిలించగానె పాములు పడగెత్తినటులు.

కనులు కనులు కలిసికొనెను చూపులు ఘర్షించెను
ఏదో తెలియని మోహం వారల ముంచెత్తెను

సీత చేతి స్పర్శచేత రాముడు పులకించెను
రాముని కనుచూపు సోకి సీత కరిగిపోయెను.

07/28/2019 - 21:07

కృతయుగంలో తేనె, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపరంలో పాలు, కలియుగంలో పానకం నైవేద్యంగా తీసుకునే స్వామీ మంగళగిరి స్వామి. ఈ స్వామిని వేడుకున్నవారికి వేడుకున్నట్టు కోరికలు తీరుస్తారని ప్రతీతి.కోరికలున్నవారు తమ కోరిక నెరవేర్చమని పానకాన్ని స్వామికి నివేదిస్తారు. ఇక్కడ ఉన్న పూజారులు ఆ పానకాన్ని నోరు తెరుచుకుని ఉన్న నరసింహస్వామి నోట్లో పోస్తారు. ఎపుడు ఆ పూజారులు పోయడం ఆపుతారు.

07/26/2019 - 18:50

పూలసెజ్జతోడ నటకు వచ్చెను సీతమ్మ
పూల సెజ్జ నడిచెననగ నడిచెను సీతమ్మ.

ఒక శ్యామల సుమరాజమ్మన రాఘవుడొప్పెను
దానినంద జనకపుత్త్రి తన చేతిని సాచెను.

ఒక ఎర్రని మందారమ్మన లక్ష్మణుండునుండెను
దానినంద ఊర్మిళమ్మ తన కేలును సాచెను.

పూలు పూల తాకినటుల తాకిరి వారటుల!
కాని పూలు ఊడి రాక తెరిచెనంత కనుల!

07/25/2019 - 19:04

అనాడు విద్యారణ్యస్వామి స్థాపించిన హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన్ నుంచి వచ్చిన మేము బాలబాలికలను ధర్మపరాయణులు గాను, సత్యవాక్య పరిపాలకులుగాను జీవించేటట్టుచేసే మహాయజ్ఞాన్ని తలపెట్టాము. అందులో భాగంగా విద్యావిధానంలో మార్పులు తేవాలని సంకల్పించాము. ఈ యజ్ఞంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొంటారని విశ్వసిస్తున్నాము.
- శ్రీజగద్గురు ఆదిశంకరాచార్యులు

Pages