S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/25/2019 - 18:58

పారవశ్యమున దేలుచు వారు కనులు మూసినారు
తోటయెల్ల కనురెప్పల మాటుదాగె నన్నట్టుల!

అపుడు సీత ఆడుకొంచు అంచవోలె వచ్చెను
ఆమె పూల జడవోలెను ఆమె యిష్టసఖియలును.

శ్రీ చక్రమె వచ్చెననగ వచ్చెను సీతమ్మ
శ్రీకారమె చుట్టె ననగ చుట్టెను సీతమ్మ

శ్రీ చందన పరిమళమ్ము విరిసెనంత తోటను
విరులన్నియు ఆ తావిని పులుముకొంచు మురిసెను.

07/24/2019 - 19:49

‘‘సరియె కాని సలిపిరండు వాహ్యాళిని మీరొకింత
అంతదాక హాయిగాను విశ్రమింతు నేనొకింత’’.

అనవారలు ‘‘అటులె’’యంచు వనమందున తిరిగిరి
పూలవోలె పూదోటల యందు సంచరించిరి.

తోట మురిసె వారిజూచి, వారు దానమురిసిరి
మురిపెమ్ముల మురిపెమ్ములు కలగలుపుకు పోయెననగ.

‘‘రారమ్మ’’ని వారినొక్క పూవు స్వాగతించె!
ఒక వృక్షం తన ఫలమ్ము చేతికినందించె!

07/24/2019 - 19:47

జీవుల్లో ఉత్తమ జన్మ మానవజన్మ. ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి మనిషి అనే్వషణ సాగిస్తూ ఉంటాడు. వెతుకుతూ ఉంటాడు. బాగా వూహ తెలిసి పెరిగి పెద్దవాళ్లు అవుతుంటే జ్ఞానం విస్తరిస్తుంటుంది. ఆ సమయంలోనే తాను ఎవరు ఎక్కడ నుంచి వచ్చాడు ఎక్కడ వెళ్తాడు అన్న ప్రశ్నలు తనకు తాను వేసుకొంటూ నిరంతరం అనే్వషణ చేస్తుంటాడు.

07/23/2019 - 19:28

‘‘ఎంత అందమీపురమ్ము? పురమంతయు తోటలే!
ఎన్ని విధముల సుమములు? పురమే ఒక సుమహారం!’’

అని పలికెన శ్రీరాముడు
అవుననియెను లక్ష్మణుండు.

‘‘ఎవరంచును జనకుడనిన ఎంచినారు మీరు?
ఆ పాదము సోకినచో శిలలనైన పుట్టు జలలు!

ఆ కరమ్ము శుభకరమ్ము మ్రోడులైన పల్లవించు
ఆ పదమ్ము మోక్షపదం- మట్టియైన గుభాళించు

07/23/2019 - 19:26

గణపతి వేద మంత్రప్రార్థనలో ఓం గణానాంత్వాగణపతిగ్‌ం హవామహే కవిం కవీనామ్ ముపమశ్రమవస్తమమ్ అంటారు. భగవదీగతలో ‘కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాం సమనుస్మరేద్యః’అంటారు

07/23/2019 - 04:03

ఈ నల్లనివాడె శివుని ధనువునెత్త బాగుండును
ఈ నవ్వులప్రోవె సీత జేబట్టిన బాగుండును.

ఈ ఎర్రని కుర్రవాడె ఊర్మిళమ్మకెంతొ తగును
ఈ కరములు, ఆ కరములు కలిసినచో శుభకరమ్ము’’.

అనుచు జనులు అనుకొనిరి, అనుకొంచును ముదమందిరి
ఎవరి భావనలు వారివి! ఎవరి దీవెనలు వారివి!

భగవానుడె తన మాటల పంచిపెట్టి, పదుగురకును
తానొక రాయై మూలన నుండి చోద్యమరయు నేమొ!

07/23/2019 - 04:01

ఒక సూర్యుడు సూర్యప్రభ- ఒకరౌచును వేరౌచును
ఒక తేజోవలయమ్మున- ఒక బాటన నడిచినారు.

వారలగని పౌరులెల్ల అచ్చెరువున మునిగినారు
చెరువులోని తామరలన తమ కన్నుల తెరచినారు.

ముట్టిన కందెడు బుగ్గలు- బుగ్గలపై దరహాసం
మాసము లెవ్వారలంచు తలలెత్తిన మీనమ్ములు.

‘‘మునినంటిన మునిబాలురొ? లేక రాచకొమరులొ?
విల్లువెంట శరములట్లు ఎవరో ఈ కొమరులు?

07/22/2019 - 18:24

అల్లారుముద్దుగా ముగ్గురు అమ్మల ముద్దు బిడ్డడిగా పెరుగుతన్న రామలక్ష్మణులకోసం ఓ రోజు విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన కు అతిథి మర్యాదలు దశరథుడు చేశాడు. ఉచితాసనం మీద కూర్చున్న తరువాత క్షేమసమాచారాలు తెలుసుకొని తనతో కూడా యాగరక్షణకు నీ కుమారులైన రామలక్ష్మణులను పంపించమని విశ్వామిత్రుడు దశరథుడిని కోరుతాడు.

07/19/2019 - 19:36

ఒకసారి షా నాటకం ప్రదర్శిస్తూంటే వెనుకనుంచి ఎవరో నాటకం బాగోలేదని కేకలు పెట్టారట. ఆ సమయంలో హాల్లో వున్న షా మహాశయుడు కేకపెట్టిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ‘‘నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ నాటకం బాగోలేదు. కానీ ఇన్ని వేలమంది ఈ నాటకం బాగుందని ఎంతో ముచ్చటపడి చూస్తుంటే మనిద్దరం ఏం చేయగలం, ప్చ్’’ అన్నాడుట. శాస్ర్తీగారి సంపాదకీయాలు సుదీర్ఘంగా వుంటాయని కొందరంటారు. ‘అదేమిటి?

07/19/2019 - 19:35

నిర్భీతి, నిర్మొహమాటం ఆయన సంపాదకీయాల లక్షణాలు. తాను సత్యమని నమ్మింది ఏ భయాలకూ, ప్రలోభాలకూ లోనుకాకుండా చెప్పడం, కాలపరిమితులు లేని సాహిత్య చర్చలంటే ఆయనకు పరమ ఇష్టం. సునిశిత విమర్శతో హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ, ధర్మాగ్రహాన్నీ, సాహితీ వైదుష్యాన్నీ సమపాళ్లలో మేళవించే కలం ఆయనది. చదువుకున్నది తక్కువే. పుస్తక పఠనం అంటే విపరీతమైన ఆసక్తి. దొరికిన పుస్తకమల్లా చదవడమే కాదు, జీర్ణించుకున్నారు.

Pages