S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/18/2019 - 19:18

గగనమ్మే సూక్ష్మమ్మై మనుజునిగా మారెననగ
ఆ వీధుల హొయలదేలి- అందముగా నడిచెననగ.

నడిచె కాంతి ప్రవాహమ్ము- రాజసమున దేలుచు
భూమియె ఒక ఆకసమ్మువోలె వెలుగు లీనెను.

శ్రీనగమో శ్రీకారమొ, శ్రీతీర్థమొ, శ్రీవత్సమొ
శ్రీముఖమున వ్రేలునట్టి శ్రీచందన సౌరభమ్మొ?

అని నట్టుల రాఘవుండు
నడిచె రాచవీధులందు.

07/18/2019 - 19:10

వేద సారాన్నంతటినీ తనలో నిక్షిప్తం చేసుకొన్న కావ్యం శ్రీ వాల్మీకి రామాయణం. ప్రధానంగా ధర్మానికి ఆదర్శ జీవనానికి మార్గం చూపింది రామాయణ. ‘్ధరణాతీధర్మః’ అనే శాస్త్ర వచనాన్ని అనుసరించి ధర్మాన్ని ప్రవచించడమే వాల్మీకి ముఖ్య ఉద్దేశం. ధర్మాచరణమే మోక్షసాధనం. అదే రామాయణ ఉపదేశం.

07/17/2019 - 18:47

అప్పుడు ‘‘గౌతమా’’!అంటూ ఎలుగెత్తి పిలిచాడు విశ్వామిత్రుడు. గౌతముడు పరుగెత్తుకొచ్చాడు. తమ జీవితాల్లో వెలుగుల్ని నింపిన ఆ శ్రీరామలక్ష్మణులకూ, విశ్వామిత్ర మహర్షికీ పాదాభివందనం చేశాడు. ఒక పూర్ణచంద్రుడు భూమిని వాటేసుకున్నట్లుగా, అహల్యను వాటేసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. ముద్దులతో ముంచెత్తాడు. వారివద్ద సెలవు తీసుకొని, ఆమెతోపాటు హిమవత్పర్వత సీమలకి తపస్సుకై నిష్క్రమించాడు గౌతముడు.

07/17/2019 - 18:45

పుణ్యం చేయడం వల్ల సుఖాలు, పాపం చేయడం వల్ల దుఃఖాలు వస్తాయని పెద్దలు అంటారు. ఏదైనా కష్టాన్ని అనుభవించేవారు సాధారణంగా పూర్వజన్మలో ఎవరిని బాధపెట్టానో, ఏ పాపం చేశానో కానీ ఇపుడు అనేక కష్టాలు అనుభవిస్తున్నాను అంటుంటారు.

07/16/2019 - 18:45

‘‘ఇదేమిటి?’’అంటూ దానిని తన కాలితో పలకరించాడు.
దాని పొరలూడి, తెరలూడి, తమస్సు వీడి, అప్సరాంగన వలె నున్న ఒక మునిపత్ని పుట్టుకొచ్చింది, రాముని పాదాల్లోంచి పుట్టినట్లుగా! నిద్రలోంచి లేచినట్లుగా లేచి, కళ్ళు నులుముకుంది. ఒళ్ళు విరిచింది. శ్రీరాముని దివ్య స్వరూపాన్ని గాంచింది. తననుతాను చూచుకొంది. తన చుట్టూరా ఉన్న పరిసరాలను పరికించింది. అటూ, ఇటూ పరిగెత్తింది.

07/16/2019 - 18:43

గ్రామ దేవతల పూజలకు ఉద్దేశితమైనది, తెలుగు జానపదుల సాంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. తెలంగాణ సంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటి చెప్పే పండుగ. జూలై లేదా ఆగస్టు మాసాలలోవచ్చే ఆషాడం వచ్చిందంటే తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో జాతరల సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శనమిస్తాయి.

07/15/2019 - 19:34

చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళరేఖలో ఉన్నపుడు చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణ కాలం చంద్రుని స్థాన కక్ష్య్యా బిందువులపై ఆధార పడి ఉంటుంది. భూమిపై ఉండే వారికి చంద్రగ్రహణం కనపడితే, చంద్రుని పైనుండి వీక్షిస్తే సూర్య గ్రహణం కనపడుతుంది. ఇది ‘పౌర్ణమి’నాడే కలుగుతుంది. సూర్యుని కాంతి భూమిపై పడినపుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగం ‘్ఛయ’.

07/15/2019 - 19:33

విశ్వామిత్రుడు ఆనందం పట్టలేక, రామలక్ష్మణుల్ని గాఢంగా కౌగలించుకున్నాడు. మనసారా ఆశీర్వదించాడు.
‘మిథిలానరేశుడైన జనక మహారాజు ఒక క్రుతువును తలపెట్టాడు. ఆ క్రతువుకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ సందేశం వచ్చింది’ అంటూ విన్నవించుకున్నారు విశ్వామిత్రుని శిష్యులు.
విశ్వామిత్రుడు ఒక నిమిషం కళ్ళుమూసుకొని యోచించి, ‘‘సరే!’’ నంటూ ఒప్పుకున్నాడు.

07/14/2019 - 22:23

శ్లో: ‘‘కౌసల్యా సుప్రజారామా! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికమ్!’’
దిగ్గున లేచి కూర్చున్నాడు తాను. సూర్యునికన్న ముందుండే సూర్యప్రభలా, తనకన్నా ముందరే సోదరుడు లక్ష్మణుడు లేచి నుంచున్నాడు. ఇరువురూ మహర్షికి ప్రక్కప్రక్కనే నిలచి, అభివాదం చేస్తున్నారు.
***
విశ్వ సంరక్షణా యజ్ఞం

07/14/2019 - 22:22

బదులు పలుకక ఊరకుండుట చూచి సరస్వతీదేవి ముందుకు సాగి
(కామరూప దేశము ఇప్పటి అస్సాము రాష్టమ్రు. వంగ దేశమునకు (ఇప్పటి బెంగాలు రాష్ట్రము) ఈశాన్య దిక్కున ఉన్నది- ప్రాగ్జ్యోషితపురము)
కామరూపదేశాధిపతి

Pages