S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/20/2019 - 18:57

ఏ మతమైనా క్షమాగుణాన్ని కలిగి ఉండాలనే చెబుతుంది. క్షమ లేనిదే వ్యక్తి జీవితం నిరర్ధకం అనిపిస్తుంది. దుర్లభమైన మానవ జన్మను పొంది అజ్ఞానంతో తప్పులు చేసినవారిని చూసి వారిని క్షమించడం గొప్ప గుణం. ఈ క్షమ వల్ల తప్పులు చేసినవారు తిరిగి తప్పులు చేసే అవకాశం ఉండదు. వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకు తప్పు చేశామా ? వారు మనలను క్షమించారు కనుక సరిపోయింది లేకపోతే అన్న చింతన పెరుగుతుంది.

06/19/2019 - 18:20

నాటినుండి ‘అంగదేశ’మాయెను ఈ దేశము
నాటినుండి ‘కామాశ్రమ’మాయెను ఈ ఆశ్రమము.

అని తెలుపగ కౌశికుండు ఆనందమునందిరి
రామలక్ష్మణులు మునితోనట నా రాత్రము గడిపిరి.

06/19/2019 - 18:18

భగవంతుని పై చూపే ప్రేమనే భక్తి అని అనుకోవచ్చు. భగవంతుడు లేనిప్రదేశం లేదు అంటారు. భగవంతుడు సర్వభూతములలో అంతర్భూతమై ఉంటాడు కనుక సర్వప్రాణులపైన ప్రేమ భావన కల్గి ఉండడం, సర్వపాణులపై సమదృష్టి కలిగి ఉండడమూ భగవంతునిపై ప్రేమ చూపించడమే. అంటే భగవంతునిపై భక్తిని కలిగి ఉండడమే. ఇటువంటి భక్తి ప్రతిమనిషిలో అంకురించాలి అంటే దేవాలయ సందర్శనాలు మార్గాలుగా ఉంటాయ.

06/18/2019 - 18:21

తెలంగాణ ప్రాంతంలోనే అరుదైనదై, పవిత్ర గోదావరి నదీ తీరాన గుట్టపై వెలసి, సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురికి 11కిలో మీటర్ల దూరాన మంచిర్యాల జిల్లా సరిహద్దున దండేపెల్లి మండలం గూడెం వద్ద, 63వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని, భక్తుల పాలిటి వరదునిగా వాసి కెక్కిన సర్వజన బాంధవుడైన గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి, దానికి ఆనుకుని చిన్నగుట్టపై కొలువు తీరిన హరిహర సుతుడైన, కలియుగ దైవం అయ్యప్ప స్వామి ఆలయాలు

06/18/2019 - 18:18

బూది ప్రోవె లేచెననగ- లేచెనపుడు శివుడు
పార్వతికేల్గొని నర్తన మొనరించెను భవుడు.

బూదినటుల పులుముకొన్న శివుడు ప్రేమతత్త్వమరసె
దేవునటుల నలుముకొన్న కాముడు దైవత్వమరసె.

శివుని కంటి నీరమ్మే ప్రాణమ్ముల బోసెననగ
మన్మథుండు లేచెనపుడు- మనములె కనుగొనగ.

రతికంటను వెలుగుమొలిచె- కంతు కౌగలించె కాంత
వారివురి పదములందు- వీరిరువురు వాలిరంత.

06/17/2019 - 22:23

దేహ ధర్మములను, లోక ధర్మములను, శాస్తధ్రర్మములను విడనాడి, ఒకకాళీమాతనే శరణు పొందిన కారణమున రామకృష్ణునకు ఆ దేవి దర్శనమిచ్చెను. ఆకలిదప్పులను చూచుకొనలేదు. లోకులేమనుకొందరో అను భయమును పోగొట్టెను. ప్రేమ పూజయే చేసెను గాని, మడి, విధి చూడలేదు. భగవంతుని గూర్చి ఏడ్చుట తెలియనివారాయన. ఏడ్చుట చూచి ఆశ్చర్యపడి పిచ్చివాడనిరి. దేహమే బంగారముగా చూచుకొనువారందరు ఆయనను వెర్రివాడనిరి.

06/17/2019 - 22:22

పూవువింటి దొర యట్టుల బూడిదకుప్పగ మారెను
కలువపూల కలికి కలిమి బూడిదపాలై పోయెను.

ఆ కుప్పను దొరలి దొరలి, పొరలి పొరలి ఏడ్చెను
ఒక శశియే నభము వీడి పొరలెననగ పొరలెను.

అగ్గి కన్ను మూసి శివుడు చలువ కనుల తెరచె
పూల పూసినటుల కనులు పూచె చూపు వీచె.

‘‘ఇది ఏమిటి? ఏమి జరిగె? ఎవని బూది సేసినాను?
నా కడుపునె నేనిట్టుల చిచ్చు బెట్టుకొనినాడను?

06/17/2019 - 22:20

ఏళ్ళు గడిచె కాని యతడు- కన్నైనను తెరువడు
యుగమే గడిచెను కానీ పెదవి విప్పబోడు.

వారి పెళ్ళిసేసి లోకకల్యాణం నెరపు కొరకు
రతీమన్మథులు జంటగ నేతెంచిరి యటకు.

ఒక చంద్రుడు ఒక వెనె్నల ఒక జంటగ వచ్చిరనగ
వచ్చినారు వారచటకు వసంతమ్మె వచ్చెననగ.

మోడులెల్ల పులకరించి పూలనెత్తుకొని కులికెను
ఆ తావులు తావులతో హృద్యమ్మై తోచెను.

06/17/2019 - 18:49

భగవంతుడు సర్వాంతర్యామి. వస్తువులోను, అవస్తువులోను పరమాత్మ వుంటాడన్న సత్యం అపుడపుడూ బహిర్గ మవు తూనే ఉంది. కలియుగం లోను వింతలు మాయలు అంటూ ఉన్నా దైవం అవ్యక్తమైనా అక్కడక్కడా వ్యక్త వౌతునే ఉన్నాడు. మన లోని దుష్టబుద్ధిని దూరం చేసుకొని సజ్జనులుగా ఉండమని, సాత్విక బుద్ధిని ఏర్పరుచుకోమని భగవం తుడు ఎన్నో అవతా రాలు దాల్చి చెప్పాడు.

06/14/2019 - 19:51

గిరిజాశంకరుల కల్యాణం

‘‘ఒకనాడిది తపోభూమి- శివుని ఆశ్రమమ్ము
శివుడొంటరిగానె నిచట చేసె దీర్ఘతపమ్ము

కళ్ళుమూయుటే యెరుగును- కళ్ళు తెరుచుటెరుగడు
కళ్ళుమూసి, కళ్ళు తెరచు- తెర్వు తెలియునతండు.

పర్వతమే పద్మాసనమేసి తపము సేసినట్లు
గగనమ్మే జటలు గట్టి తాపసియై పోయినట్లు.

సంద్రమె ఊపిరుల బిగిచి కుంభకమున దేలినట్లు
పంచాగ్నులె మనిషి రూపునంది తదము సల్పినట్లు.

Pages