S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/20/2019 - 20:24

తే.గీ. మల్లికార్జున స్వామి సేమమ్ము నిడగ
శ్రీగిరీ భ్రమరాంబికా శీస్సులంది
పద్య సమమాలనల్లితి భక్తితోడ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శ్రీశైల మల్లికార్జున స్వామీ! నీవు క్షేమాన్ని ప్రసాదించగా ఆ భ్రమరాంబికాదేవి ఆశీస్సులందుకుని భక్తితో పద్య సుమమాలలనల్లి సమర్పించుకుంటాను.
తే.గీ. కనులు నీకప్పగించంగఁ గాంచనేను ఁ
దిన్నడినిఁ గాకపోతినే దేవదేవ

05/17/2019 - 22:41

యజ్ఞకుండాలు నక్షత్ర రాశుల్లా ప్రజ్జ్వలించాయి. ఋశ్యశృంగుని ఆధ్వర్యంలో మొదట అశ్వమేథ యాగం, ఆపై పుత్ర కామేష్టియాగం నిర్విఘ్నంగా సాగాయి.
యజ్ఞకుండంలోంచి అగ్నిదేవతలా ప్రాజాపత్య పురుషుడుదయించాడు కోటి సూర్యుల కాంతితో! ఆ వెంటనే తూర్పున సూర్యుడు, పశ్చిమాన చంద్రుడు వారి వారి ప్రభలతో ఏక కాలంలో ఉదయించారు! ‘‘ఆ సూర్యచంద్రులే తన కుమారులైతే ఎంత బాగుండేది?...’’ అనుకున్నాడు దశరథుడు.

05/17/2019 - 22:32

శ్రీచక్రము, మానవ శరీరం

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
9849560014

05/17/2019 - 22:27

ఆస్థాన గాయనీ గాయకులు మేల్కొల్పులు పాడుతున్నారు శ్రవణప్రేయంగా! దిగివచ్చిన దేవతల్లా పక్షులు! వాటి కిలకిలా రావాలు ఆశీస్సుల్లా ఉన్నాయి! ఎంతటి శుభోదయం! ఎంతటి మంగళదాయకం!
మహారాజు కుడిభుజం, కుడి కన్ను అదిరాయి శుభాన్ని సూచిస్తూ!...
మంచం దిగుతూనే, ఇటు భూమాతకు నమస్కరిస్తూ, అటు తన కులదైవం సూర్యభగవానునికి అంజలి ఘటించాడు. తన మనోవాంఛని నెరవేర్చమంటూ!...

05/17/2019 - 22:17

వైశాఖ పౌర్ణమికి పలువిధ ప్రత్యేకతలున్నాయి. ఇరవై ఏడు నక్షత్రాలలో విశాఖ పదహారోది. విశాఖ ఐదు నక్షత్రాల కూటమి. అది కుమ్మరి సారె లాగ ఉంటుంది. విశాఖకు కాంతిని వ్యాపింప చేసేది అని అర్థం. అట్టి విశాఖ నక్షత్రంతో కూడిన పున్నమకు ‘‘వైశాఖి’’ అని పేరు. ఈనాడు బుద్ధ జన్మ మహోత్సవమని నీలమత పురాణం చెపుతున్నది.

05/15/2019 - 22:28

పుత్రకామేష్టి
*
అది రాత్రివేళ. అది సాకేతపురం. అంతఃపురంలో దశరథ మహారాజు తన శయ్యపై దొర్లాడుతున్నాడు. ఎంతకూ నిద్రపట్టడం, లేదు.
శ్రవణ కుమారుని మరణం. అతని తల్లిదండ్రుల మరణం, వారు తనకిచ్చిన శాపం, అతని కళ్ళముందే కదలాడుతున్నాయి ఒక దృశ్యకావ్యంలా! తన భవిష్యత్తు తనని భయపెడుతోంది!
ఇది వరమా?... శాపమా?...

05/15/2019 - 22:24

‘‘వృషభే స్వాతి నక్షశ్రీతే చతుర్దవ్యాం శుభ దినే సంధ్యాకాలే నిశాయుక్తే స్థంభో ధ్భూతం నృకేసరి’’ వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి నరసింహ జయంతిగా పురాణాలు చెబుతున్నాయి.

05/15/2019 - 22:18

నిజమే!... ఏంచేయాలి?... ఎలా చేయాలి?... వాళ్ళకి, ఆ యజ్ఞంచేసే దశరథునికి, జనకునికి తాను సంతానాన్ని ప్రసాదిస్తే?... లేక తానూ తన వారే వారికి సంతానంగా మారితే?... వారిమధ్య భూమీద మనుష్యులుగా అవతరిస్తే?... ఎలా ఉంటుంది?... ‘‘్ధర్మోరక్షతి రక్షితః’’కదా?... దివ్యంగా ఉందీ యోచన!...

05/13/2019 - 19:54

దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడమే జగజ్జనని ‘‘కన్యక’’ అవతారం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రైమూర్త్య దేవతలకు మూల కారణమైన భువనేశ్వరీదేవిని వాసవీ కన్యకా పరమేశ్వరీ రూపమున పూజించడం సదాచార పరంపరగా కొనసాగుతున్నది.

05/13/2019 - 19:52

ఒక కర్పూర కళికలా వెలిగిపోతూ, అనంత విశ్వంలో సురభిళాల్ని వెదజల్లుతున్నాడు! పరిమళ ద్రవ్యంగా మారిపోతున్నాడు! ఒక ధవళ మహామేఘంలా కదుల్తూ, కాంతిని వర్షిస్తున్నాడు!... ఎక్కడికో ఏ అనంత దూరతీరాలకో, తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే కదిలిపోతున్నాడు. తాను నిల్చున్న పర్వతంతోసహా పర్వత శిఖరంతో సహా! ఏ మహత్తర విశ్వశక్తి తనని ఆవహించిందో తెలీదు! తనతో ఈ పనిని గావింపజేస్తోందో తెలీదు!... ఎంతటి అద్భుతం?...

Pages