S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/16/2019 - 22:37

ఋక్షుడు తెల్లబోయాడు..
‘‘ఏమిటిది?... ఇలా నల్లబడిందేం?’’...అంటూ అతని వీణియనతనికిచ్చేశాడు.
నారదుని చేతిలో అది మళ్ళీ స్వర్ణవీణగా మారిపోయింది.
ఋక్షుడు మరింత ఆశ్చర్యపోయాడు.
అప్పుడు దాని తీవెల్ని సుతారంగా మీటాడు నారదుడు.
‘‘నారాయణ! నారాయణ!’’అంటూ అది మనోజ్ఞంగా పలికింది. కళ్ళు తేలవేశాడు ఋక్షుడు.

04/14/2019 - 22:48

నీరుపోసె జానకమ్మ అడవిలోని మొక్కకైన
చేరదీసె రామయ్యయు కొండపైని కోతినైన

భీషణుడై విభీషణుడు ధర్మముకై పోరాడెను
లంకవీడి శ్రీరాముని అంకమ్మున తా జేరెను

అహరహమును విరహమందు రగిలిపోయె నూర్మిళమ్మ
తన గుండెను తన స్వామిని నిలుపుకొనియె హనుమన్న

తృణప్రాయం సామ్రాజ్యం అని యెంచుచు భక్తిమీర
పాదుకలకు పట్టమిడుచు వెలిగిపోయె భరతుండు

04/12/2019 - 19:14

ప్రతులకు
HNo.7-8-51, Plot No. . 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=====================================================
కర్దమ ప్రజాపతి కుమారుడైన సాక్షాత్తు విష్ణ్వుంశగల కపిలుడు తన తల్లియైన దేవహూతికి ధ్యానయోగాన్ని క్రింది విధంగా బోధించాడు.

04/10/2019 - 19:16

కథామృత గానం
(హనుమనోట కుశలవులపాట)
‘‘రామా’’! యన రామాయణ వౌనుగాదె బ్రతుకు
‘‘రామా’’! యన రామరాజ్య వౌను గాదె తుదకు!

మనిషిలోని మనిషి కరిగి మైనముగా మారిన కథ
కనులలోని కరుణ కరిగి కాల్వలుగా పారెడు కథ

ఆకసమ్మునుండి భువికి అవతరించు వెలుగుల కథ
చీకటి రక్కసుల తోడ పోరినట్టి భానుని కథ

04/10/2019 - 19:15

దుష్టశిక్షణ చేయడానికి రూపం లేని భగవంతుడు రూపాన్ని ధరించి నామాన్ని అలంకరించు కుని భువికి దిగివస్తాడు. ఎక్కడ అధర్మం పెరిగిపోతుందో, అన్యాయం రాజ్య మేలుతుందో అక్కడికి తన్ను తాను సృజి యంచుకుని వచ్చేస్తాడు. దుష్టులను వారి కోరికలమేరకే సంహరిస్తాడు. వారిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలుతాడు. ధర్మాన్ని పునః స్థాపితం చేస్తాడు. ఆ క్రమంలోనే ఓసారి రావణాసురుడు మృత్యువు రాకుండా వరాలను పొందాడు.

04/09/2019 - 19:35

పాటయందుప్రణవమ్మును, ఆడయందు విశ్వక్రీడ
మాటలందు మర్మమ్ముల వారలు చూపించినారు

వాల్మీకియె వారి గురువు వ్రాసెనతడు సీతకథ
రామాయణ మనుపేరను రాజిల్లెను విశ్వమ్మున

వెలుగుల వలె సంచరించి, వాయువటుల వ్యాపించి
సీతారాముల కథలను ఇంటింటికి జేర్చినారు

తలలూపుచు చిరుతలతో ఆ బుడతలు ఆడినారు
బుడతలైన చిరుతమైన చిరుతల తలపించినారు

04/09/2019 - 19:27

జయ హనుమాన జ్ఞాన గుణసాగర... హనుమాన్ చాలీసా ప్రతిరామ మందిరంలోను హనుమద్దేవాలయంలోను ప్రతిదినం వినిపిస్తుంటుంది. ఈ హనుమాన్ చాలీసా, రామచరిత్ర మాసన్ ను , తులసీ మంజరీ రచించిన తులసీ దాసు గురించి తెలుసుకుందాం.

04/08/2019 - 22:39

మన కథయే రామ కథ! మనమే రామాయణం
శ్వాసించిన వినిపించును ఎద ఎద రామాయణం!

ఆ కవితా గానమన్న నా భాగ్యమె భాగ్యం!
ఆ నాట్య కలాపమన్న ధన్యవ్మౌ జీవనం!

నేనెవ్వడ? శ్రీరాముని కథను చెప్పుకొరకు?
రాముండే రామకథను చెప్పుకొనెడివాడు!

నేనెవ్వడ శ్రీకృష్ణుని వంశిని మాత్రమ్మే!
పలికించెడి వాడాతడె పలుకుయు నాతండె!

04/08/2019 - 22:38

ఆ పాటను అతివలపుడు- అందుకొంచు పాడిరి
ఆడుచు పాడుచు అతివలు ఆనందమునందిరి

ఒక సూర్యుని చుట్టునెన్నొ గ్రహములు తిరుగాడినట్లు
ఒక చుక్కను చుక్కలెన్నొ చుట్టుముట్టె నన్నట్టుల

నీహారికలే హారతులివ్వదొడిగె నన్నట్టుల
పాలపుంతలే ముంతల పాల గ్రుమ్మరించినటుల

04/08/2019 - 18:40

సీ. తల్లిదండ్రుల యెడ దయలేని మనుగడ
మనుగడ కాదది మరణవౌను
అవ్వారి సేవయునావంత నెఱపక
బ్రతికెడి బ్రతుకది బ్రతుకుగాదు
వారి సేమము పట్ల బట్టనట్లుండిన
వారేల భూదేవి బాధనొందు
ప్రత్యక్ష దైవాలు వారల నివడచిన
జలనిధిలో జొచ్చి వారలనివిడిచిన

Pages