S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/01/2019 - 19:46

సీ. సర్వ సమానత్వ సాధనే లక్ష్యమై
మేల్కొల్పువాడవై మెఱయవలయు
అవినీతి మృగ్యమే యవని నీకర్తవ్య
మని యెంచి కడదాక మనగవలయు
ప్రేమామృతపు ధార ఁబృధ్విపై నిరతమ్ము
గురిపింప లోకులు మురియవలయు
తలలోని నాల్కవై మెలగుచు పదిమంది
కాదర్శమూర్తివై కదల వలయు

03/31/2019 - 22:30

అందుకే అలాంటి వాళ్ళు ఎప్పుడూ దుఃఖాల ఊబిలోనే ఉంటారు. ఒకవేళ మీ దుఃఖానికి మీరే కారకులైతే వెంటనే మీకు తోచినట్లు ఏదోఒకటి చేస్తారు. ఎందుకంటే, అది మీ చేతుల్లో ఉన్న పని. కానీ, ఇతరులు మీకు దుఃఖాన్ని కలిగిస్తుంటే మీరుమాత్రం ఏమిచెయ్యగలరు? అందుకే అందరూ ఆ బాధ్యతను ఒక్కొక్కప్పుడు భార్యపైకి, భర్తపైకి, పిల్లలపైకి, తల్లిదండ్రుల పైకి, అలాగే కుటుంబం, సమాజం, చరిత్ర, బాల్యం, తలరాత, దేవుళ్ళపైకి నెట్టేస్తూ ఉంటారు.

03/31/2019 - 22:28

ఒకచోటు విడిచి మఱియొకచోట త్రవ్వనారంభించుటకు బదులు తాను బడిన శ్రమలో సగబాలైనను ఓపికతో మొదటి నూతికే వినియోగించిన పక్షమున వానికి నీరు లభించియుండెడిది. ఈ మతముకాదని ఆ మతము, ఆ మతముకాదని మఱియొక మతము- ఈ విధముగా మతధర్మములను ఊరక మార్చుకొనుచుండువారి విషయముకూడ నిట్టిదే. ఏదైన ఒక మతమును నమ్ముకొని దానినే శ్రద్ధ్భాక్తులతో సాధనచేసిన యెడల తప్పక విజయము చేకూరును.

03/31/2019 - 22:20

అప్పుడాతని కంఠం శంఖంలా ధ్వనించింది. సాగర గాంభీర్యాన్ని సంతరించుకుంది.
‘‘ఎంత అదృష్టం మీది!... ఇలా పిలిచారో లేదో, అలా ప్రత్యక్షమయ్యాడు హనుమ!’’... అన్నాడు మళ్ళీ.
ఆ యింతుల ఆనందానికి అంతులేదు. ఆశ్చర్యంతో తమతమ కలువ రేకుల కళ్ళని విప్పార్చి చూశారు!
ఒక తుఫాను వీచినట్లు! ఒక అంబుధి పొంగినట్లు!
ఆకసమ్మె నేలపైన- అవతరించెనన్నట్లు!

03/29/2019 - 18:50

ఇంతలో సాగరగర్భంలో ఒక విస్ఫోటనం! ఒళ్లుజలదరించే భయాదక శబ్దం! అందాకా, శ్రీకృష్ణపరమాత్మలా, ప్రశాంతంగా, గంభీరంగా ఉన్న సముద్రంలో ఏదో అలజడి! ఏదో ఉప్పెన! ఉలిక్కిపడి చూశారంతా, ఆ ఉవ్వెత్తున లేచి పడుతోన్న అలల వంక! ఆ హఠాత్పరిణామం వంక!.... ఆ క్రిందు మీదవుతున్న తరంగిణి వంక!

03/28/2019 - 20:04

కన్నులు వెలుగుల గనులై వీనులు శంఖములాయెను
మనసే బృందావనియై పాట ముక్తి బాటాయెను

మానినెవరొ? మ్రానేదొ?
వేణువేదొ? జాణయేదొ?
ఎవరు ఎరుగరైరి!

నాదమ్మో? వేదమ్మో?
ప్రణయమ్మో? ప్రణవమ్మో?
ఎవరు తెలియరైరి!

వారి పెదవులాశ్రయించి వారి ముద్దులందు కొరకు
కృష్ణుండే వేణువగుచు- వారల చేతుల జేరెనొ?

03/28/2019 - 20:00

ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
==================================================================

03/27/2019 - 20:09

ఏమున్నది దీనిలోన ఏమిలేదు గదోరుూ?
ఇది పలుకునె? పలికినచో ఎటుల రాగమొలుకును?

అనుచు నొకతె అని చుబుకమెత్తి యొత్తి అడిగెను
ఆ వంకన ఆ కన్నుల వెలుగులెన్నొ జుర్రెను

నవ్వినాడు శ్రీకృష్ణుడు నవ్వెడు చందురుని రీతి
ఆ నవ్వుల పువ్వులెన్నొ ఆ భామలపై గురిసెను

ఒక గగనం నీరదముల చెవిని మంత్రమూదినట్లు
ఒక గురుండు ఒక మంత్రం శిష్యుని చెవినూదినట్లు

03/27/2019 - 20:07

మనం చేసుకొనే పండుగల్లో దాదాపుగా అన్ని పండుగలు ఏదో వృక్షంతో ముడిపడి ఉంటాయి. ఉగాది నాడు చేదు వృక్షం అనుకొనే వేప పూవును కూడా ఉపయోగిస్తాముకదా. దసరా దశ విధ విజయాలనిచ్చే పండుగ దసరా అని మనం జరుపుకునే దసరా నాడు కూడా జమ్మి చెట్లును పూజిస్తాం. కార్తికంలో ఉసరిచెట్లును పూజించడం తెలిసిందే. బతకమ్మ పండుగలో ప్రతి పూవును, ప్రతిరోజు దేవాలయాల్లో చేసే పుష్పయాగాల్లో పూవుల ప్రత్యేకత తెలసింది.

03/26/2019 - 20:29

వచనం- ‘‘నా వంశి చెబుతుందో, లేదో మీరే చూడండి’’!అని చెప్పి, యమునానది ఒడ్డుననే ఉన్న వెదురుపొదల్లోకి మాయమయ్యాడు శ్రీకృష్ణుడు.

పాముపుట్ట దూరినట్లు దూరె పొదలలోకి
ఎందులకో? దేనికొరకొ? ఎవరెరుంగబోరు!

చేరడేసి కనులతోడ వెదకినారు వారలంత
ఒళ్ళంతయు కనులు చేసి మయూరాలు వెదకెనంత

గాలివెదకె, పూవు వెదకె, పరిమళమ్ము వెదకె!
‘‘కృష్ణా! కృష్ణా!’’ యటంచు కృష్ణానది వెదకె!

Pages