S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/19/2019 - 19:14

శాశ్వతమైన శబ్దం
శతాబ్దపు పొలిమేరల్లో
అర్థం మార్చుకుంటున్న
ఆధునిక నాగరికతకు
లొంగిపోవటాన్ని చూస్తున్నాను..

08/19/2019 - 19:12

మనిషి ఆశానిరాశల మధ్య జీవిస్తూ ఉంటాడు. ప్రతి మనిషి ఆశాజీవే. గొప్ప సంపన్నుడైనా, బీదరికంలో బతుకుతున్నా సరే ఏదో ఒక ఆశ మనిషికి ఉంటుంది. ఆశను సాధించాలన్న లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తారు.

08/18/2019 - 22:18

అట్టివారిని గుర్తుపట్టటం కష్టంగాదా?’’అని మనసులో తర్కించుకొనుచుండగా, అదే సమయంలో ఋతుపర్ణుడు తన భుజంనుండి ‘ఉత్తరీయం’ జారి క్రిందపడినట్లు చూచాడు. వెనువెంటనే ఋతుపర్ణుడు
‘‘బాహుకా! రథం ఇంచుక ఆపుము! వార్‌ష్ణేయుడు దిగి నేలపైబడ్డ నా ఉత్తరీయం తెస్తాడు’’ అని అన్నాడు. అందుకు

08/18/2019 - 22:16

నిశ్శబ్దంగా వచ్చిన చైత్రంలో
నాగరకత
నాజూకులు వికసిస్తోంది
భూగోళం
వస్తు సౌందర్యశాలను వశం చేసుకుంది
బాధల్లో మునిగిపోయి
సంతోషంలోనే ఉదయిస్తున్నాను
నా ఎత్తిన గొంతులో
పల్లవులన్నీ ఇపుడు పరభృతాలు..

08/18/2019 - 22:14

కాలప్రభావం వల్ల భగవంతుని అస్తిత్వాని ఎందరో శంకిస్తున్నారు. ఆయన దివ్యలీలను ఎంతమంది విశ్వసించి ఆరాధిస్తున్నారు. మిడి మిడి జ్ఞానం గలవారు ప్రమాదకారులుగా ఉంటారు. దైవ దర్శనం కావాలంటే అంతరదృష్టిగావాలి. అది లేనివారికి అర్థం కాదు.

08/16/2019 - 19:01

ఉషస్సు ఊరేగింపుగా వచ్చిందని
ఆకాశమార్గంలో అగ్నిగోళమై అరిచాను
కలల నక్షత్రాలను కోల్పోయిన
చీకటి మూసిన ఏకాంతాన్ని
గుంపులు కట్టిన మనుషులందరూ
ఉత్సాహ శబ్దాలతో ఉపమలతో తొక్కుకుంటూ
అగాధాన్ని
అడవుల్ని
పర్వతాల్ని
పయోధుల్ని నింపేశారు..
ఒక చెట్టు పర్వత శిఖరమెక్కి
పూలదుమారం వీస్తే
తోటలకు తోటలే పుప్పొడి విహారం చేసుకుంటున్నాయి

08/15/2019 - 22:22

ఆకాశపు కొసల్ని పట్టుకు వ్రేలాడుతున్న
దిగంతాలకు
ఓరగట్టుగా నా బాహువులెత్తినప్పుడు
కిరణ వ్యాకరణమై నా గుండెలమీద
పరుగెడుతున్న ప్రొద్దుటెండ వ్యాసం
ఒళ్ళంతా వ్యాపించింది...
ఈ పరిణహ పరిణామమంతా
మబ్బు విడుదల చేసిననదినై ప్రవహించటానికే;

08/15/2019 - 22:11

శ్రావణ మాసం రాగానే అంగనలందరూ లక్ష్మీదేవి వర లక్ష్మిదేవీగా భావించి కొలుస్తుం డడం అనాదిగా వస్తోంది. ఐశ్వర్యప్రదాతయైన శక్తినే మహాలక్ష్మిగా సంభా వించడం గౌరవించడం, పూజించడం సనాతన ఆచారమే. ఈ తల్లి విష్ణుదేవుని ఇల్లాలుగాను, సముద్రుని తనయ గాను, భృగు మహర్షి కుమార్తెగా కొనియాడబడుతుంది. ఓం, శ్రీం హ్రీం ఐం అనే బీజాక్షరములతో తల్లిని ధ్యానించాలని మంత్ర శాస్త్రం చెబుతుంది.

08/15/2019 - 22:08

శ్రీకృష్ణ పరమాత్మ పదహారు కళలతో ప్రభవిల్లిన పరిపూర్ణ అవతారము శ్రీకృష్ణావతారము. భగవదవతారములలో శ్రీకృష్ణావతారమునకున్న ప్రత్యేకత, విలక్షణత ప్ర త్యేకమైంది. కర్షయతీతి కృష్ణః సమస్త హృదయములను ఆకర్షించువాడు ఆయనచే ఆకర్షింపబడని ప్రాణి అంటూ లేదు. జీవాత్మను ఆకర్షించు పరతత్త్వము ఆయన. కలియు గంలో మానవుడు ఎలా మెలగాలో, ఏమి చెయ్యాలో భగవద్గీత మూలమున మార్గదర్శనం చేసిన జగదుర్గువు శ్రీకృష్ణుడు.

08/14/2019 - 19:12

శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి, జప, అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము ‘యజ్ఞము’ ‘ఉపవీతము’ అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే ‘యాగము’ ‘ఉపవీతము’ అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము. యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక.

Pages