S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/15/2018 - 20:58

ధార్మిక, పౌరాణిక, ఆచార, ఆధ్యాత్మికపరమైన సందేహాలపై ప్రశ్నలు అడగవచ్చు. వాటికి త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యముగారు సమాధానాలను ధర్మభూమి శీర్షికలో ఇస్తారు. ఈ కింది కూపన్‌లో రాసిన ప్రశ్నలకు మాత్రమే సమాధాన మిస్తారు. కనుక మీరు వెంటనే మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ కూపన్ నింపి మాకు పంపండి.
ధర్మసందేహాలు

02/14/2018 - 23:39

కర్మలు అనేవి బలమైనవి. చాలా బలీయమైనవి. కర్మలనేవి చిత్రంగా వుంటాయి. చాలా విచిత్రంగా మన వెంట పడతాయి. మనల్ని వెంటాడుతుంటాయి.
సంచిత కర్మలు, ఆగామి కర్మలు అని కర్మలు రెండు రకాలు. ఈ కర్మలవలనే జన్మలు. జన్మించేక గత జన్మల వాసనలు. ఫలితంగా ప్రాప్తాలు, అప్రాప్తాలు. అవును! కర్మఫలం నంచి బయటపడే మార్గమే లేదా? పరిశీలన చేద్దాం.

02/14/2018 - 23:37

‘‘గు శబ్దస్తంధకారస్య, రు శబ్ద నిరోధ స్యాత్, అంధనిరోధస్యాత్, గురురిత్యభిధీయతే’’ - అంటే - గురువు అత్యంత శక్తి సమన్వితుడు. గురు అనుగ్రహం పొందినవారి ముందు దేవేంద్రాదులు, త్రిమూర్తులు కూడా తలవంచాల్సిందే. ‘‘గురోస్తు వౌనం వాఖ్యానం, శిష్యాస్తు ఛిన్న సంశయాః’’ గురువు గారి వౌనవ్యాఖ్యానంతోనే శిష్యుని సందేహాలన్నీ పటాపంచలు అవుతాయి.

02/14/2018 - 23:20

ఈ సీత నాసుత- నీ సహధర్మచారిణి2 అని జనకుడు సీతను రామునికప్పగించాడు. దశరథునితో కలసి అందరూ అయోధ్యకు చేరుకొన్నారు. శ్రీరామునికి పట్ట్భాషేకం చేయాలని దశరథుడు నిర్ణయించుకొని చేయవలసిన పనులకాదేశమిచ్చాడు. సీతారాములిద్దరు కంకణధారులై వ్రతదీక్ష చేపట్టమని రాజాజ్ఞ అయంది. వారిద్దరూ వ్రతదీక్ష పట్టారు. కాని అపుడు కైకమ్మ వరాలనుఅడిగింది. దశరథుడు ఖిన్నుడై నాడు.

02/13/2018 - 22:01

ఒకసారి ఓ పల్లెటూరి వానికి ఒక సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరకు వెళ్లాడు. శివా అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అంటారు కదా. నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడీ ప్రశ్నను కైలాసవాసుడే విన్నాడు. యోగి దగ్గరకు సన్యాసిగా వచ్చి ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అన్నాడు. యోగి చిరునవ్వుతో అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామీ అన్నాడు.

02/13/2018 - 21:59

అలా నిలచియున్న ద్రౌపదిని ప్రేమతో తాకిన ధర్మజుడు ‘‘ద్రుపద రాజపుత్రీ! విధి నిర్ణయించిన ప్రకారం నేను నిన్ను పొందగలిగాను. భర్తగా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించగలనని నీకు వాగ్దానం చేస్తున్నాను. ధర్మాన్ని అతిక్రమించక ఎప్పుడూ నీకు సంతోషాన్ని సుఖాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తాను. కష్టసుఖాలలో నీకు చేదోడు వాదోడుగా వుంటాను’’’ అని అన్నాడు.

02/13/2018 - 21:28

ప్రత్యూష సమయాన పరమ శివా!
కైలాసవాసా అర్థనారీశ్వరా
నటనాగ్రేసరా నాట్యకారా
లయకారా నందిభృంగీ సమేతుడా
భవానితో భవుడు భద్రమయ్యా
భావనాతీతా భవ్యచరితా
శివశంభో శివశంభో
హర హర శంభో శంభో
బ్రహ్మవిష్ణువుల అహంకారంబాపి
లింగాకారుని వి వైనావు
మృకండుమనస్వినులకు
మార్కండేయునొసంగి
అపారకృపానిధి వైనావు
ముల్లోకాలను ముట్టడించే

02/13/2018 - 21:26

ప్రదోష తాండవ శివుడు
ఆనంద నిలయుడు
నాట్య నాయకుడు
లాస్య లావణ్యుడు
భవసాగరం దాటించు భవుడు
భావనాతీతుడు భావరమ్య రమణీయుడు
శివ, శివా
హర, హరా
జలపాతాలు పొంగిదూకేను
భూమాత జలగంగ జోరులో
పులకించిపోయేను
డమరుకం మ్రోగగా
మూడు లోకాలు నీకు మ్రొక్కేను
అర్థనారీతత్వ
త్రిపురాంతకుడు తాను
తానే శివం అన్న

02/13/2018 - 21:22

ఏమి శాంభవలీల ఏమానంద రసహేల
అడుగడుగునా సాగే బ్రహ్మానంద రసదోట
రజిత శ్రేణుల లోన కైలాస శిఖరాన
తద్ధిమిత తకధిమిత త్రిపుట తాళములోన
ఆ శివుడు ఆడేటి దివ్యానంద సుమభరిత
శృంగార రసహేల

శరదిందు శరశ్చంద్రికా తుషార లాహిరిలోన
భువనమంతా తపిసి అమృతమే జారగా
శివుని శిరమున నుండి అలలు అలలుగారేగి
ఆ గంగయే దిగి అవినినే చుంబించగా

02/12/2018 - 22:14

శివపూజకు వారువీరను తారతమ్యాలు లేవు హెచ్చుతగ్గులు అసలే లేవు. ఎలాంటి తేడాల్లేవు. రాక్షసులు దేవతలు, మనుష్యులు ఎవరైనా ఆయన్ను సేవించేవారే. రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ శివుని పూజించేవారే. శివప్రేమను చూరగొంటే చాలు, శివతత్వం అర్థం చేసుకొంటేచాలు మనం శివునిగానే మారిపోవచ్చు. శివపూజకుఏ షరతుల్లేవు. అవధులూ లేవు.

Pages