S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/15/2019 - 22:23

కవిత్వప్పూల తోటలో పాటల దారి నెంచుకొని
కాల విరామ చిహ్నాల వంటి ఋతువుల కప్పగించాను
జీవ నిధులైన శబ్దాల సౌష్ఠవం
అమృతత్వాన్ని ఆపోశన పట్టిన ఆత్మకే వినిపిస్తుంది..
పచ్చటి ఆకుల్లో జీవితాన్ని అల్లుకున్న పక్షికి
గొంతు దానం చేసిన ఉదయకిరణ
హృదయ వాఙ్మూలాన్ని
నేనురాస్తుంటే
సూర్యుడు బాలుడై నా వర్ణతూలిక మీద వాలిపోతాడు

09/15/2019 - 22:19

శ్రీ చైతన్యుడు. క్రీ.శ.1485 ఫిబ్రవరి నెలలో పూర్ణిమనాడు బెంగాలు దేశానికి చెందిన నవద్వీపం అనే గ్రామంలో సుప్రసిద్ధ పండిత వంశంలో జన్మించాడు.

09/15/2019 - 22:16

శౌనకాదులారా!

09/13/2019 - 20:06

సింహాచలం, కృతశౌచం, హరంపాపం, అహోబలం. ఈ నాలుగు ఆంధ్రదేశంలో దివ్యనారసింహ క్షేత్రాలు. ఈ దివ్యక్షేత్రాల్లో ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క విధంగా రూపుదిద్దుకుంది. ఒక్కొక్కస్థలానికి ఒక్కో పురాణగాథ .

09/13/2019 - 20:02

నిద్రతో సముద్రాన్నీదుతూ నేనున్నాను
భుజాన ‘ఎడవల’తో...
అలల మీద తేలుతూ కలల చేపలు కవ్విస్తుంటే
నా ఆత్మ
నా శరీరాన్ని
రంగులు విరిసే సమస్త వస్తుజాల ఆంతరిక రహస్యంగా
అవతరింపచేసింది
ఱెప్పలు మూసిన నిశ్శబ్దం వెలిగించిన
ఊపిరి దీపానికి స్వప్నాల దారులు సుస్పష్టమే
మెలకువ కాని మెలకువని
మనసు కతికించిన మంత్రనగరి పొలిమేర

09/12/2019 - 19:37

పురిటికేక కవిత్వంగా
పాదాలకు ప్రయాణదాహం పట్టుకుంది
గొంతు విప్పిన మరుక్షణం ఆమని కోకిలగా
అది ఆంతర శ్రోత్రుపర్వం..
బ్రతుకు పరమార్థం ఆనందమైనప్పుడు
మాటల్లో ఇమిడే క్లుప్తతని భరించలేని
ఏ సౌందర్యంలో అది దొరుకుతుందో
అక్కడికే తొలి అడుగు పడుతుంది
నేను వసంత వన జ్వాలని మోస్తున్న
అనిర్వచనీయపు లోతుని
భూమి కనపడకుండా తిరగటంలో

09/12/2019 - 19:35

వేదకాలం నాటినుండి భాద్రపద కృష్ణ పక్ష ప్రతిపద నుండి అమావాస్య వరకు పితృ పక్షంగా పిలువబడే పక్షం రోజులు పితృ కర్మలు ఆచరించడం తరతరాల వారసత్వంగా వస్తున్నది. దైవ గణాలకు సంబంధించి దక్షిణాయనం రాత్రి కాలం. దైవబలం తక్కువగా ఉన్న సమయాన, పితృగణాలు తిరిగి జన్మను పొందాలన్న కాంక్షతో, తమ శక్తులను ఏకీకృతం గావించి, కర్మాధికారం కలిగిన మానవుల వైపు చూస్తుంటాయి.

09/11/2019 - 18:49

ద్వితీయాశ్వాసము
ప్రకటించిన పాట
పల్లవించిన క్షణం నుంచి చరణాలు కిరణాలతో
కింజిల్కమంతా మధూళి నెత్తిపోసింది
ఉగాది నుంచి ఉగాది వరకు
రోజుల్ని దొర్లించిన భూభృకుటి మీద
ఎవడో
గుడిగంట మోగించాడు
మనిషికోసం మనిషి వెతుకుతున్న కార్యక్రమంగా
స్వప్నాల రేవులు రాత్రిదీపాల నెత్తుతున్నాయి
ఏ కోమలమైన చినుకు స్పర్శకు పులకించిందో

09/11/2019 - 18:47

ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టిన క్షణంనుంచీ అందరికీ ఏదో ఒక బోధ చేస్తునే ఉన్నాడు. తన చేతల ద్వారా మాటల ద్వారా ఎన్నో సంగతులు మనుష్యులకు చెబుతూనే ఉన్నాడు. కొందరు గ్రహించారు. మరికొందరు గ్రహించినా వూరకున్నారు. గ్రహించలేనివారు గ్రహించిన వారు చెప్పితే విని వాటిని ఆచరించి మరీ ఫలాలు పొందినవారు ఉన్నారు. అర్జునుడిని నెపంగా పెట్టుకుని గీతాబోధ కూడా చేశాడు. ఎందరో రాక్షసులను సంహరించాడు.

09/10/2019 - 19:48

భక్తులు ఆచరించాల్సిన వ్రతాలు, నోములు అని పూర్వీకులు ఎన్నింటినో సంప్రదాయంలో చొప్పించారు. వ్రతాలు,నోముల్లాంటివి అయితే అందులో ఆ వ్రతాన్నికానీ , నోమును కానీ ఎవరు ఎందుకు ఏ సమయంలో చేశారో దానివల్ల వారు పొందిన ఫలం ఏమిటో కూడా చెప్తుంటారు.

Pages