S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/08/2019 - 19:56

ఆకసమ్మే వంగి భూమి మెడలోన
కట్టినట్టుల తాళికట్టె రాముడు

ముత్యాలు సీతమ్మ చేత పగడాలు
పగడాలు రామయ్య చేత నీలాలు.

ఒకరి చేతుల నొకరు పోసికొన్నారు
తలయె జలదవ్మౌచు కురిసెనో యనగ.

బాసలను సేసలను కలబోసినారు
తలంబ్రాలుగా వారు పోసికొన్నారు.

రంగురంగుల కలలు రంగైన కలలు
కలలందు కలవోలె కరిగె సీతమ్మ.

08/07/2019 - 19:49

కడలిరాయడె కదలివచ్చెనో యనగ
గగనమ్మె భూమిపై కాలిడెనొ యనగ.

నీలాలె అచ్చోట పొరాడె ననగ
రాముండు విచ్చేసె నీలాలకొండ.

ఉత్తరీయము వ్రేలె మేఘమ్మువోలె
జన్నిదమ్మే కదలె జలధరవోలె.

అతడు కట్టిన పీత వస్తమ్మ్రుకదలె
పసిడి సంద్రమ్మొకటి కదలెనో యనగ.

కంఠాన మెరిసేను ధవళహారమ్ము
రిక్కలనె గుదిగూర్చి కట్టిరో యనగ.

08/07/2019 - 19:47

ప్రకృతినుండి మహత్తత్త్వం అహంకారం, బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు పంచభూతాలు అనే చతుర్వింశతి తత్త్వాలు ఆవిర్భవించాయి. ఉపాధులన్నింటిలో మనుష్యుని ఉపాధి ఉత్తమోత్తమమైనది. మనిషికి వివేక విచక్షణాలు ఉంటాయ. తాను ఎవరు అనే అనే్వషణ ఇత్యాదు లన్నింటినీ జవాబులను కనుకొనగలిగే సామర్థ్యం ఏర్పడి ఉంటుంది. మిగిలిన జంతువులకు మల్లె క్షుత్సిపాలనతో తృప్తి చెందపు.

08/06/2019 - 20:48

ఇంటింట తోరణాలను కట్టినారు
ఊరంత దీపాలు వెలిగించినారు.

ఇనునికీ ధరణికీ పెళ్ళియన్నటుల
ఊరంత వెలుగుల్ల వెల్లువైపోయె.

రాసుల్లతో పూలు రాసుల్లు పండ్లు
కళ్ళు పూలై పూచె పండె బ్రతుకుల్లు.

బానల్లతో పాలు! బానల్లు పెరుగు!
క్షీరదధి సంద్రాలు దొర్లెనో యనగ!

గోరింటవలె నున్న సీత చేతులను
గోరంత గోరింట పంట పండేను.

08/06/2019 - 20:47

శ్రీకృష్ణుని బాల్యచేష్టలను స్మరించుకుని తరించడం కృష్ణ్భక్తులకు దినచర్యగా ఉంటుంది. కృష్ణ నామస్మరణలోనే వాళ్లు పులకించి పోతుంటారు. కృష్ణుని కేవలం బాల్య చేష్టలే కాదు ఏ విషయంలోకృష్ణుని చర్యలను తల్చుకున్నా ఎంతో విజ్ఞానం వస్తుంది. మనసు ఆహ్లాదమవుతుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. మానసిక వికాసం జరుగుతుంది. అట్లాంటి వాటిల్లో మన్ను తినే కృష్ణయ్య ఒకరు.

08/05/2019 - 18:13

‘‘నాతమ్ముడు లక్ష్మణుండు నాకు బహిఃప్రాణము
వాని విడిచి నాకెట్టుల పెండిలియగు?’’ననెను.

‘‘నా రెండవ కూతురైన ఊర్మిళనే నిచ్చెదను
నీ తక్కిన తమ్ముళ్ళకు నా తమ్ముని కూతుళ్ళను’’

అని రాముని తోడ నుడివె జనకుండా వేళను
అపుడు వంగె రాఘవుండు ఆమెకందునటులను.

వంగ వలెను ఆకసమ్ము తనకు తానుగాను
దానివంచుటకు ఎవ్వరి తరవౌ నిలలోను?

08/05/2019 - 17:42

పూర్వకాలంనుంచి గ్రహపూజలు, చెట్లకు మొక్కడాలు, పర్వతాలను పూజించడాలు, గిరి ప్రదక్షిణలు చెయ్యడాలు, నదులకు హారతులివ్వడాలు ఇవన్నీ మనకు ఆచారాలుగా వస్తున్నాయ. ప్రకృతికి పులకించి ఎంతోమంది కవులు వర్ణనలు చేశారు. వసంతగానం చేశారు. విశ్వమానవ కల్యాణం గురించి ప్రార్థించారు. సర్పదోష పరిహార్థమై రాహు కేతు పూజలు చేశారు. కాలపురుషుణ్ణి కొలిచారు. సూర్య నమస్కారాలు చేశారు. అష్టదిక్పాలకుల్ని గౌరవించారు.

08/04/2019 - 22:17

‘ఫిళఫిళ’’మను మ్రోతలాయె- మిన్ను విరిగెనో యనంగ
విరిగె నంతటను ధనువు- అతని రొట్టె విరిగెననగ.

హరివిల్లే విరిగెననగ హరి విల్లును విరిచెను
విరిజల్లులు కురిసెనంత రాజు మురిసెనంత.

విల్లు విరిగినంతలోనే సీత గుండెలదిరినవి
అల్లె త్రాటివోలె నామె నాడులు కంపించినది.

ఆ సభలో ఆనందపు కెరటమ్ములు పొంగినవి
సభికుల కరతాళ ధ్వనులు గగనమ్మును ముట్టినవి.

08/04/2019 - 22:14

గత జన్మలో నేను చేసిన పాపం వల్లనే చేయని నేరానికి ఈ విధమైన కష్టాలను అనుభవిస్తున్నాను. అయినవారి చేతనే నా భర్త రాజ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు భర్తృవియోగాన్ని పొంది నానాబాధలకు లోనయ్యాను. ఇవన్నీ నా పాప ఫలమే!’’అని దమయంతి పరిపరివిధాల తలంచి విలపించింది. అలా విలపిస్తూ కొంత దూరం నడిచింది.

08/04/2019 - 22:07

శ్రావణ శుక్ల పక్ష పంచమికి ‘‘నాగ పంచమి’’తోపాటు ‘‘గరుడ పంచమి’’ అని కూడా పేరు. ఈ దినం నాడు గరుడ పూజ ఆచారంగా ఉంది. గరుత్మంతుడు మహా విష్ణువుకు వాహనంగా ప్రసిద్ధుడు. మహాబలశాలి. విష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా గురుడవాహనుడై వెళ్ళి, ఆపన్నుల రక్షణ గావిస్తారు.

Pages