S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/22/2018 - 22:39

శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే
శేషాద్రి శృంగేఁపి సదా వసంతమ్
తమర్జునం మల్లిక పూర్వమేనం
నమామి సంసార సముద్ర సేతుమ్
భావం: శివా అన్నంతనే పలుకు వాడు అపారమైన కృపావర్షం కురిపించువాడు అయన పరమశివుడు అనేక కథలకు ఆధారమైన శ్రీశైలమునందు, శేషాద్రి శిఖరమునందు నివసించేందుకు వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. సముద్రమును దాటించు వంతన వంటివాడు అగు ఆ శివరూపమైన మల్లికార్జునుని నమస్కరించుచున్నాను.

02/22/2018 - 22:34

అనిరుద్ధ
16.దేవకీ సుతు పౌత్రుడు దివ్యతేజు
డమిత సుందరు డనిరుద్ధు డసుర కన్య
బాణు పుత్రికకై నాగపాశ బద్దు
డైన మనుమని విడిపించి బాణునొంచి
పెండ్లిజేసెను కంసారి ప్రేమికులకు

పురుషోత్తమ
17.చేతనములుందు నీలోన చతనముల
యందు జీవాత్మవై వెల్గుచుందు వీశ
పుణ్యపురుషులు పురుషోత్తమా యటంచు
నన్యమెరుగక ధ్యానింత్రు నినె్న వరద

02/22/2018 - 01:06

సౌరాష్టద్రేశే వసుధావకాశే
జ్యోతిర్మయం చంద్రకశావతంసమ్
భక్తి ప్రదానాయ కృతావతారం
తం సోమనాథం శరణం ప్రపద్యే
భావం: బూమిపై సౌరాష్టద్రేశమునందు జనుల భక్తి పెంపొందించుటకై అవతరించినవాడు. జ్యోతిర్మయుడు, చంద్రకళాధరుడు అగు సోమనాథుని శరణు పొందుచున్నాను.

02/22/2018 - 00:59

పద్మనాభ
11.పాల కడలిలో పన్నగ తల్పమందు
లీల పవళించి జగములు నేలు తండ్రి
పంకజాసన జనక వో పద్మనాభ
భక్తవత్సల సర్వేశ పరమ పురుష

దామోదర
12.యజ్ఞకర్తవు భోక్తవు యజ్ఞమీవు
ఉదరమందున జగముల పదిల పరచు
కున్న దామోదరా మము గన్న తండ్రి
వందనములయ్య జగదీశ విమల చరిత

02/22/2018 - 00:45

సాయిదూత
శ్రీబి.వి.నరసింహస్వామి
రచన: రావినూతల శ్రీరాములు
10/228, వనస్థలిపురికాలనీ,
మల్కాజిగిరి, హైదరాబాదు -47
సెల్: 8885653924

02/20/2018 - 22:22

కొడుకు పుట్టాడని, కూతురు పుట్టిందని ఎందుకింత ఆర్భాటాలు ?
పుట్టుట, గిట్టుట నిరంతరం జరిగేవే కదా.
అందరినీ పీడించి రాపాడి ఎందుకింత పైకం జమ చేయడం?
పోయేనాడు ఏదీ వెంటరాదు కదా.
ఇంతింత పెద్ద పెద్ద భవంతులు కట్టడం ఎందుకు?
ఆరుఅడుగుల గోతి చాలు కదా

02/20/2018 - 22:16

ధర్మవేత్త అయిన యుధిష్ఠిరుడు తిరిగి వచ్చాడు. మనలను కన్నబిడ్డలవలె ధర్మంగా పరిరక్షిస్తాడు అని వేనోళ్ళ పొగిడారు. పాండవులు కూడా వారి యోగక్షేమాలను అడిగారు.
ప్రజల జయ జయ ధ్వనులమధ్య పాండవులు, ద్రౌపది, కుంతి సమేతులై రాజమందిరాన్ని చేరారు.
రాజమందిరం చేరిన పాండవులు మొదట దృతరాష్ట్ర మహారాజుకు పాదాభివందనం చేశారు. తదుపరి పాండవులు భీష్మ పితామహుని వద్దకు చేరి అతడికి పాదాభివందనం చేశారు.

02/20/2018 - 22:14

6.ప్రాణికోటిని సంకట పరచుచున్న
మత్త మధుకైటభుల బరిమార్చినావు
అమర వందిత మధుసూదనాఖ్య నిన్ను
మరువ కృప జూడవే నను మారజనక

త్రివిక్రమ
7.విక్రమంబున నాబలి చక్రవర్తి
నణచినాడవు పాతాళమున కనంత
మూడు లోకము లాశ్చర్యమున మునింగి
జూడగా త్రివిక్రమ నీదు జాడ దెలిసె

02/20/2018 - 22:12

కాశీ అన్నపూర్ణ కాశి విశాలాక్షి
పార్వతి శివనారి సర్వశక్తి
కంచి మధుర సీమ కామాక్షి మీనాక్షి
కనికరించు తల్లి కల్పవల్లి

షిరిడి పురమందు శివతత్వమొందిన
సాయి నాథుడనెడి సద్గురువట
సర్వమతములందు సామరస్యము దెల్పి
భక్తితోడ గొల్వ ముక్తి నొసగు

02/20/2018 - 22:05

లంకాధీశుడు రావణుని మేనమామ మైరావణుడు. ఇతని అగ్రజుడు అహిరావణుడు. మైరావణుడు మాయాజాల వ్యూహరచనలో సిద్ధహస్తుడు. రామలక్ష్మణులను బంధించి తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయస్వామి తన తోకను పెంచి సోదరులు వున్న ప్రాంతాన్ని ఒక దుర్బేద్యమైన కోటగా మార్చి పైన తానే కాపలాగా ఉంటూ ఎవరు ఎలా వస్తారనే ధైర్యంతో కాపలాగా ఉంటాడు.

Pages