S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/03/2019 - 19:17

తే.గీ. కనుల కెదురుగఁ గన్పట్టు కన్నవారు
తలుప దైవంబుల వ్వారి ఁ దలుపఁబోరు
సేవ మాటెత్త ఁ జిర్రెత్తి చిందులేయుఁ
జూడుమో కర్మసాక్షి యో సూర్య దేవ!

06/03/2019 - 19:02

మొలను నూలు లేకున్నను వీధి వీధి తిరిగేవే?
చిన్ననాడె యోగివైతి- నిన్ను మించు వాడెవ్వడు?

బొమ్మరిల్లు కట్టియాడి, కూల్చి గంతులేసేవే?
సృష్టి, స్థితి, లయలందును సంబరపడి పోయేవే?

ఎవరినడిగి ఈ విద్యల నేర్చుకొచ్చినా వోరుూ?
ఎవరికడను శిష్యరికము చేసి వచ్చినా వోరుూ?

ఎవరవీవు? ఎవరవీవు? ఎటునుండిట దిగినావు?
ఎచటికేగ నెంచినావు? ఇచట విడిది చేసినావు?

06/03/2019 - 18:58

ఎవరికి ఎక్కడ ఎంత వరకు విషయాన్ని వివరించాలో తెలిసిన వివేకవంతుడు ఆంజనేయుడు. ఓసారి సీతానే్వషణలో భాగంగా వానరులు స్వయంప్రభను కలుసుకున్నారు. ఆ స్వయంప్రభతో ఆంజనేయుడు మాట్లాడిన తీరుకు ఆమె ముచ్చట పడి వానరవీరులందరికీ ఆతిథ్యమిచ్చింది. దారి వెతుకుంటున్న వానరులకు స్వయంప్రభ సముద్రతీరం చేరడానికి సాయం చేసింది.

06/03/2019 - 18:49

రాముని పదకమలాలను ముద్దెట్టుకున్నాడు సూర్యుడు.
ఇరువురూ అలా కాసేపు ఆడుకున్నారు. ఇంతలోనే పరుగుపరుగున వచ్చిన చెలికత్తెలు బాల రామున్ని లాక్కెళ్ళారు స్నానం చేయించడానికని.
సూరీడు చిన్నబోయాడు.
కానీ ఆతని పాదధూళి సోకి, ఆరోజు రోజంతా మరింతగా మెరిసి పోయాడు సూరీడు.

05/27/2019 - 19:16

ద్వారమె తానైనవాడు- ద్వారమ్ముల దాటనేర్చు.

మాటయె తానైనవాడు- మాటలెన్నొ నేర్వజూచు
నడకెయె తానైనవాడు- నడక తాను నేర్వజూచు.

నాట్యమె తానైనవాడు- నాట్యమాడగా జూచును
పదము తానెయైన వాడు- పదము పొడజూచును.

పక్షివోలె నెగురజూచు- పామువోలె పారును
చేపవోలె నీదజూచు- మనిషివోలె నేడ్చును.

నీరుత్రాగి మేఘమట్లు గర్జనమ్ము సేయును
ఋషివోలెను కళ్ళమూసి, ధ్యానమ్మున మునుగును.

05/27/2019 - 19:07

ప్రతులకు : H.No. 7-8-51, Plot No. . 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
====================================================

05/26/2019 - 19:55

శివాంశ సంభూతుడుగా అంజనీదేవి గర్భాన ఉదయంచిన కేసరి నందనుడు ఆంజనేయుడు. సూర్యుని అభిముఖంగా నిలబడి నడుస్తూ హనుమంతుడు సూర్యుని దగ్గర విద్య నార్జించాడు. తన అన్న యైనా కూడా వాలి చేతభయపడి దేశమంతా గోష్పాదమంత స్థలం కూడా మిగల్చకుండా తిరిగి తిరిగి వేసారిన సుగ్రీవునితోపాటుగా ఆయనకు అండగా అంజనీసుతుడు నిల్చున్నాడు.

05/26/2019 - 19:51

ఉరకలెత్తు సంద్రమ్మే ఊయలలో నూగెనో
తురంగమై తరంగమే భువిని దొరల సాగెనో

కాడచేత పిందెయటుల- పూవుచేత మొగ్గయటుల
కొమ్మచేత రెమ్మ యటుల - రెమ్మచేత చివురట్టుల

పెరిగినాడు శ్రీరాముడు
ముద్దుగ ముగురమ్మలకడ.

నా కొడుకను కౌసల్యయు- నా కొడుకను సుమిత్రయు
నావాడే వీడంచును వీడ బోదు కైకేయి.

కనినది కౌసల్య కాని- పెంచెనతని కైకేయి
క్షణమైనను వీడకుండ పెనవేసుకు పోవును.

05/24/2019 - 19:33

చీమ చూచె, దోమ చూచె, విశ్వమెదిరి చూచె
‘‘ఎపుడు వచ్చు మా రాముడు? ఎపుడు చూతు’’ మంచు
ఆ నలుగురి బాల్యం
పామువోలె ముడుచుకొంచు పడుకొను లక్ష్మణుడు
ఆతని పైనను పొరలెను శ్రీరాముండెప్పుడు.

శంఖము పూరించినటుల ఏడ్చునెపుడు భరతుడు
చక్రంవలె దొరలుచుండు శత్రుఘు్నండెపుడు.

నోటన బొటన వ్రేలును శ్రీరాముడు వేసికొనుచు
లోలోపలి లోకాలకు అమృతధారలందించును.

05/22/2019 - 20:04

నీవెవరు? నేనెవరు?
నీవు అంతులేని కృపాసముద్రము
నే పిల్లకాల్వ పగిది సంకుచితం
నీవు గుణ రహితుడవు, నేను గుణ సహితుడను
నీవు శిల్పి, నేను ‘శిలిపి’- ‘శిలి’
నీది హేల, నాకదే పెద్దగోల
నీవు సంపూర్ణం నేను అసంపూర్ణం
నీవు కర్త నేను కర్మ , క్రియ
నీవు అణుసూక్ష్మం నేను అతిస్థూలం
నీవు యోగి నేను భోగి
నీవు కడలి నేను ఆగని కెరటం

Pages