S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిరించీయం

02/25/2018 - 20:26

‘మధురవాడ నుంచి పాత పోస్ట్ ఆఫీసు వెళ్ళే ఇరవై అయిదో నెంబరు సిటీ బస్సు ఆ సెంటర్‌లో ఆగడంతో దిగింది గౌరమ్మ. బస్సులోంచి ఎవరో అందించిన తన పెండలం దుంపల గంపని మరెవరి సాయంతో తలమీదకెత్తుకుని జగదాంబ సినిమా హాలు ముందున్న బస్‌స్టాపు ఎడం పక్కన తను రోజూ కూర్చుండే చోటుకి వచ్చి చేరింది. గొరుసు జగదీశ్వరరెడ్డి వ్రాసిన కథానిక ‘జగదాంబ జంక్షన్’లో సన్నివేశం ఇది.

02/18/2018 - 21:48

‘కుటుంబాన్ని ఉద్ధరించడం చేతకాదు కాని, దేశాన్ని ఉద్ధరిస్తాడట! .. కన్నబిడ్డకు గ్లాసెడు పాలు తేలేడు కాని, దేశంలో అందరికీ తిండి పెడతాడట!’ - ఈ మాటలు అన్న మనిషి చదువురానివాడు, చదవనేర్వనివాడు కాదు నాలుగు వేదాలు పుక్కిట పట్టిన మహా పండితుడు శ్రీ సుబ్రహ్మణ్యశాస్ర్తీ. అష్టాదశ పురాణాలు సత్సాఖ్యానంగా చెప్పగలవాడు.

02/11/2018 - 20:09

‘పాతిక సంవత్సరాలు కాపురం చేసిన రామ సుబ్బమ్మ భర్తకు తొలిసారిగా ఎదురుతిరిగింది. పతివ్రత, పరమసాధ్వి అయిన రామసుబ్బమ్మ భర్త గీచిన గీటును దాటి ఎరగని రామసుబ్బమ్మ, ఈ లోక దైవానే్న ధిక్కరించింది. సత్యకాలం కాకపోబట్టి సరిపోయింది. లేకపోతే అటు సూర్యుడు యిటు పొడిచి, నక్షత్రాలు ఝుల్లున నేలరాలి, భర్త శాపాగ్నిలో రామసుబ్బమ్మ మల మల మాడి మసై వుండేది.

02/09/2018 - 21:17

సప్తస్వరాల సంగీత సమ్మేళనంలో ఎన్నో వేలాది కృతులను రచించిన త్యాగయ్య, రామదాసు, ముత్తుస్వామి దీక్షితార్, పురందరదాసు, స్వాతి తిరునాళ్ వంటి మహానుభావులను స్మరించుకుంటూ ప్రతినిత్యం ఉభయ సంధ్యా సమయంలో సంగీత సాధన పూర్వజన్మ సుకృతం, భగవంతుని వరం అని సంగీత విద్వాంసురాలు కావూరి హేమలక్ష్మి అన్నారు.

Pages