S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/29/2020 - 22:41

తే.గీ. మంచు కరగిన చందాన మనసు కరగ
వలయుఁ బాషాణమై గట్టి పడగవలదు
మనసు మనుజులఁగలుపునీ మహినఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/28/2020 - 22:48

డైనోసార్లు భూమీద
ఆవిర్భవించక ముందే
పెద్ద రెక్కలతో
తూనీగల ఆనవాళ్లు
కలుషితం కాని నీరు
ఉన్నచోటు
నీటి మొక్కలు విరివిగా
ఉన్నచోటుగాలిలో
అపురూప విన్యాసాలు చేస్తూ
తూనీగలు
విస్మయం కలిగించేవి
ఆ తూనీగల జీవిత చక్రం
ఆద్యంతం ఉత్కంఠ భరితమే
లార్వాలు నెలలు
సంవత్సరాల తరబడి
నీటిలోనే జీవిస్తూ

01/29/2020 - 02:25

తే.గీ. ఎట్టి యవరోధములనైన బట్టుపట్టి
యధిగమింపంగ ఁ దలబోయ నందుకునెద
రద్భుతంబగు ఫలముల నంత కడకుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/27/2020 - 22:55

‘గురుబ్రహ్మ గుర్‌విష్ణుః గురుదేవోమహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః’ అని ఆర్యోక్తి. గురువు, భగవంతుడు ఒకేసారి ప్రత్యక్షమైతే గురువుకే ముందు నమస్కరిస్తాను అని భక్తకబీరుదాసు తెలిపారు. మన దేశంలో ఎందరో ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కష్టపడి తమవద్ద చదువుకొనే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది తమ జీవితాలను ధన్యం చేసుకొన్నారు. అలాంటివారిలో ఒకరు ఎల్.శివరామిరెడ్డిగారు ఒకరు.

01/27/2020 - 22:45

తే.గీ వట్టి మాటలు మాటాడ ఫలితమేమి?
ఫలము గూర్చని మాటల వలననేమి
లాభమున్నది? చేతలే శోభఁగూర్చుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/26/2020 - 23:29

సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి దర్శనమిస్తుంది. ఈ తల్లి విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఈ జ్ఞాన ప్రదాయిని కరుణ తోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఈతల్లిని మాఘశుద్ధ పంచమి రోజు విశేషంగా ఆరాధిస్తారు. మాఘశుద్ధ పంచమిని ‘శ్రీపంచమి’ అంటారు.

01/26/2020 - 23:27

విమర్శ ఎలా ఉండాలి? విమర్శ ఒక రచనని ప్రకాశింపజేయిస్తుంది. ఒక రచనని ప్రకాశింపజేయని విమర్శ అసలు విమర్శనే కాదు. భారతీయలంకారిక సిద్ధాంతాలన్నీ కూడా విమర్శ కావ్యగత సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తుంది. అయితే ఒక రచనని మనం చదివినపుడు అది చాలా బాగుంది అన్నా, రచనలోని కొన్నిటిని చదివినా కూడా మనకు పూర్తిగా తెలిసినట్టు కాదు.

01/26/2020 - 23:22

తే.గీ. లోకమందున మోసాలనేకమాయె
నెట్టి సందర్భమున మోసమెట్టిదైన
మోసపోరాదు పలికితి ముద్దు లొలుకు
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/25/2020 - 22:12

మనిషి పుట్టుకనుండి మరణం వరకు జరిగేది జీవన ప్రయాణం. కర్మను బట్టి జీవికి జన్మ పరంపరలు వస్తూనే ఉంటాయ. ఎవరికైతే పుణ్య పాపాలు నశిస్తాయో వారికి మళ్లీ జన్మంటూ ఉండదు. కానీ చాలా మంది కోరికలతోను, ఆ కోరికలు తీరడానికి పడే కష్టంలో భగవం తుడిని నమ్ముకున్నా నన్ను నేను అనే మాటలను వదలలేక తిరిగి తిరిగి జన్మను పొందుతూనే ఉంటారు. ఈ జనన మరణ చక్రంలో చిక్కుతూనే ఉంటారు. జన్మ పరంపరల్లో మానవ జన్మ దొరకడం గొప్ప అదృష్టం.

01/25/2020 - 22:11

సీ. నీలోన నేతాజీ నీలోన కరుణ యల్లూరి
భగతుసింగము వీణ ప్రతిఫలించె
ఆజాదు నీలోన నాగురుగోవిందు
డలరారె నిన్నంత నావహించె
గాంధి మహాత్ముడు గలడు నీలో ఁజూడ
నెహ్రూజీ న ఈలోన నిలువరించె
భద్రకాళినిఁ బోలు రుద్రమ్మ ఝన్సీల
తేజమ్ము నీలోనఁ దేలువాఱె

Pages