S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/22/2020 - 06:34

ఒక రోజు సాధువులు ఓ పదిమంది దేశ పర్యటన చేస్తూ ఆ ఊరులో దిగారని తెలిసి కబీరుదాసు వారిని ఆహ్వానించాడు. వారికి కూడా సంతోషమైంది. కబీరుదాసు రామభక్తుడని విన్నారు. అతని ఇంట ఆతిథ్యము రామానుగ్రహానికి పాత్రులు కావచ్చని, అలానే వస్తామని వెంట బయలుదేరారు.

01/21/2020 - 22:17

కర్మ అంటే పని. మనం చేసే కర్మలనుబట్టే ముందుజన్మ ఉంటుందని భగవద్గీతలో ఏనాడో శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు. అందుకే అంటారు ఎవరికైనా ఏదైనా మంచి జరిగితే అది అతడి పూర్వజన్మ సుకృతం అని, కీడు జరిగితే అది వాడి కర్మ అని.

01/21/2020 - 22:14

తే.గీ వృద్ధులనఁ బిల్లలను భావమిద్ధరిత్రి
మిగుల జీర్ణించుకున్నచో తగులుకొనును
సకల సంపత్తులెన్నియో సంబరాన
తరతరంబులు సౌఖ్యంబులరయఁ బొందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/19/2020 - 23:45

అమ్మ
తల్చుకుంటేనే చాలు కదా ఆమె ఒక
అపురూపం, అమూల్యం
అద్వితీయం, ఇలా ఎన్నో విశేషణాలు
లెక్కేలేదు...
అమ్మ
భవిష్యత్తు కు పునాది
అసలు ఉనికికే ఆది
అమ్మ గదా!
అలాంటి అమ్మ ఋణం తీరేనా?
ఋణం తీరాలంటే లెక్కతేలాలి కదా
మరి ఎక్కడ నుంచి మొదలు లెక్క

01/19/2020 - 23:44

ఆకాశం అంచున
పరిచిన చీరె
పొగమంచు చాటున
చలి శిల్పాన్ని
చెక్కుతూ ఉంటుంది.
ఉలిపడ్డప్రతిసారీ
సూర్యుడి కిరణాల తాకిడి
కన్నీళ్లు చుక్కలుగా
మారి కంబళి కోసం
వెతుకుతాయి!
వెనె్నల కురుస్తున్న
సంధ్యాకాలం మబ్బుల గాలుల
పుప్పొడి రాలుస్తోంది!
బద్దకంగా ఉదయిస్తున్న
మనసు పొరలు
ఏ రంగుల గాలికి
ఆకర్షణగా మారి

01/19/2020 - 23:39

తే.గీ. అద్భుతమైన పాఠఆలననుభవములు
నేర్పుచుండును వాటని నీవు విస్మ
రింపఁబోకుము దలుపంగ నించురైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అనుభవాలు అద్భుతములైన పాఠాలు నేర్పుతుంటాయి. అనుభవపాఠాలను నిర్లక్ష్యం చేయరాదు. నిర్లక్ష్యం చేసిన పక్షంలో జీవితమందెన్నో సమస్యలు చుట్టి ముట్టేస్తాయన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓసూర్యదేవా!ఈ లోకానికి తెలియజేయుమయ్యా లోకప్రభూ!

01/18/2020 - 22:08

(2020 జనవరి 18న అదృష్టదీపక్ సప్తతి పూర్తి సందర్భంగా)
*

01/18/2020 - 22:01

తే.గీ. ధర్మకార్యాలు సేయంగఁ దరల వలయు
నపుడుపుణ్యాల పంటలు నడచి వచ్చి
తరతరాలకు శుభముఁ గరమొసంగుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అంతా ధర్మకార్యాలు చేయడానికి తరలి వెళ్లాలి. అపుడు పుణ్యాలపంటలు నడిచి వస్తాయి. తరతరాలకు అనేక శుభాలను ఆ పుణ్యాలు అధికంగా ఇస్తాయని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి తెలియజెప్పుమా!ద్యుమణీ మణి.

01/16/2020 - 22:54

పుట్టటం ఎంత సహజమో మరణించడమూ అంత సహజమే. ఈకాలంలో సాంకేతిక పెరిగి పుట్టడాన్ని వాయిదా వేయడం, లేదా పుట్టించకుండా ఉండడం సాధ్యమవౌతుంది. కానీ మరణించడం మాత్రమూ ఆపలేకుండా ఉంటున్నాం. కానీ పూర్వకాలంలో మరణాన్ని కూడా వాయదా వేసుకొనే మహాత్ములు మనకు పురాణాల్లోనే కాదు ఈ కలియుగంలోను కనిపిస్తారు. త్రైలింగస్వామి సుమారు 300 ఏండ్లు జీవించినట్టు చెప్తారు.

01/16/2020 - 22:43

తే.గీ. ధనము జగతికి మూలమ్ము గనగ నిజము
ధనము సర్వ సర్వస్వమవరాదు తప్పు మాట
ధనపు మోహానఁ గష్టాలు దండిన
కావలసినది సుజనాళి కంటిరేని
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages