S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/30/2018 - 22:31

పోయిలో పిల్లి లేవడానికి
ఆడు ఏడాడనో తిరిగిండు

ఉజ్జోగం ఇప్పించని సధువుని
కసి తీరా తిట్టుకుంటూ అడ్డా మీద
నిలువు స్తంభమై పోయిండు

రెక్కలు ముక్కలు సేసుకొని
వెనకేసిన రాళ్లన్నీ
ఊర్లో కామందు అప్పు కిందకె పాయె

ఆడి సోపతి ఎవడో చెవిలో చెప్పిండు
పెద్ద పట్నంలో కొత్త ఉజ్జోగం అంట
శేరిక జేస్తే నాల్గు పైసల్
కళ్లజూడొచ్చు

05/29/2018 - 21:39

కన్నుమూస్తూ కళ్లు తెరచి
చివరి కోరిక కోరాడు
‘నాకింకో డెబ్బై ఏండ్లు బతకాలని ఉందని’
కన్నుమూశాక నీకింక కళ్లతో పనేముంటుంది
ఆ కళ్లను చూపులేని
వాళ్లకెవరికైనా దానంచేసి పో
మరో డెబ్బై ఏళ్లు బతుకుతాయి
నీ కోరికా తీరుతుంది
అతని అంత్యక్రియలు ఘనంగా
జరిగాయి వసంతరుతువులో
అతని కళ్లు ఆ అమ్మాయి
కళ్లలానే ఉంటాయి
అమ్మాయి ముఖంలో ఒదిగిపోయాక

05/24/2018 - 21:36

నేనో నవల చదువుతున్నా...
అందులో ఓ పాత్ర
నా చుట్టూనే తిరుగుతోంది!
నా గుండెకు ఆర్ద్రత పెంచుతోంది!

చదువుతున్నంతసేపూ..
నేను మా ఇంట్లో ఉన్నట్లే వుంది!
నవలలో సంభాషణ కొత్తగా ఏమీ లేదు
కానీ చదివించే పాత్రల చిత్రణ
నన్ను చదివేలా చేసింది!

05/24/2018 - 21:34

అతను-
ఆశలో నావలో-
అలల కలల తీరంలో
అలా - అలా - అనంతంగా
పయనిస్తూ ఉంటాడు.
వేకువ రేకులు
వెలుగు రేఖలతో
కబుర్లు చెప్పేలోపు-
రేపటి రేవుకు -
తీరం చేరని నావలెన్నో?
చీకటి కౌగిట్లో-
చితికిపోయే బతుకులెన్నో?
అతనొక ప్రేక్షకుడు
విధిరాత వీక్షకుడు-
అచేతనం - అతని చూపు
అసంగతం - ఆ ఎదురుచూపు!
ఆశ మాత్రం-

05/23/2018 - 21:54

‘అమ్మ’ అన్నది ఒక తియ్యని పిలుపు
అసమానమైనది, విలువ కట్టలేనిది నీ అనురాగం
నిరంతరం మా సుఖ సంతోషాలను కోరే అనురాగ దీపికవు
బుజిబుజి మాటల నుండి బుద్ధిమంతుణ్ణి చేసే వరకు
బిడ్డకు ప్రథమ గురువు పాత్ర పోషిస్తూ
నాటి ఛత్రపతి, మొన్నటి మహాత్ముడు
నిన్నటి అబ్దుల్ కలాం, నేటి దేశాధ్యక్షుల
జీవితాలను మలచిన ఓ మాతృమూర్తీ!

05/22/2018 - 21:09

చూడడానికి వాళ్లు బడుగులే
పిడికిలి బిగిస్తే పిడుగులే
పని ఒడిలో ఒళ్లు వంచిన శ్రామికుడు
అని భూమిలో విల్లు వంచిన శ్రీరాముడు
కృషిని నమ్ముకున్న ఋషులు వాళ్లు
ఆ కండల కమండలాల్లో ఊరే స్వేదజలం మంత్రజలమే
ఆ స్వేదం కట్టడాల పాలిట వేదం
ఆ శ్రమకు చకితమై ఇటుకలు చిటికెలో
మిన్నందుకుని మేడలవుతాయి
ఆ శ్రమాంబువులు ప్రవాహాలకు లక్ష్మణ రేఖలు గీస్తాయి

05/18/2018 - 21:49

కనురెప్పలు కాపలా
కనుపాప సేదతీరాలని!

చింతలేని నిద్ర
ఆ బాల గోపాలునిది!

అమ్మ అరచేతులుండ
నిదురించడానికెందుకు బెంగ!

పూలపాన్పులేలా..
అమ్మ ఒడి పడకుందిగా!

ఏ చీకూచింతా లేకుండా నిదురపో..
అమ్మ ప్రేమ నీడలో!
కమ్మని కలలే కను
అమ్మ జోలపాటలో!
హాయిగా ఆదమరచి నిదురపో
అమ్మ రక్షణ సన్నిధిలో!
*

05/18/2018 - 21:45

మంచి చెడుల తేడాను
తన బిడ్డలకు తెలిపేందుకు
అమ్మ తటపటాయిస్తోంది

ఓటమి గెలుపులనేవి
సహజ నియమాలని
సర్ది చెప్పటానికి
ఆమె సంశయిస్తోంది

స్నేహానికి, స్వార్థానికి
మధ్య ఉన్న భేదాన్ని
వివరించటానికి ఆమె
వెనుకడుగు వేస్తోంది.

వయసు ఉప్పెన లాంటిదని
నిలువెల్లా ముంచేస్తుందని
చెప్పటానికి ఆమె యోచిస్తోంది.

05/14/2018 - 21:25

చెట్టు ముందా? విత్తు ముందా? అనే అనునిత్య
ప్రశ్నా పరంపరలో ప్రభవించిన కాలకూట విషమిది
మానవీయ విలువలను తన మూలాల శూలాలతో
ఛిద్రం చేస్తున్న అంతర్నేత్రపు దృక్కోణమది...
వౌలిక మృగనీతిని విస్మరించి సాటి మనిషిపై
సాగిస్తున్న దమననీతికి నిదర్శనమ్మది
నిండు మానవ జాతిని అణువణువునా
మాడ్చి మసి చేస్తున్న అగ్నిపర్వతపు లావా అది
అక్రమ సంపాదనా యజ్ఞానికి స్వీయ సుఖ

05/10/2018 - 21:52

‘రేపు’ అనేది
చాలాచాలా అందమైన కల!
ఎవరైనా, ఎంతటివారైనా
కలలలో విహరించడాన్నీ..
ఊహల ఉయ్యాలల్లో
జీవించడాన్నీ..
పరిహసిస్తూ, వ్యతిరేకించే
కరడుగట్టిన వాస్తవిక వాదులు కూడా
‘రేపు’ - ఈ వర్తమానంకన్నా
గతంకన్నా
ఎంతో బాగా ఉంటుందనే
అందమైన కల్పనాత్మకమైన కలకు
ఏ వాదులైనా, ఎంతటి యోధులైనా
తప్పనిసరిగా తలవంచి

Pages