S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/14/2018 - 21:25

చెట్టు ముందా? విత్తు ముందా? అనే అనునిత్య
ప్రశ్నా పరంపరలో ప్రభవించిన కాలకూట విషమిది
మానవీయ విలువలను తన మూలాల శూలాలతో
ఛిద్రం చేస్తున్న అంతర్నేత్రపు దృక్కోణమది...
వౌలిక మృగనీతిని విస్మరించి సాటి మనిషిపై
సాగిస్తున్న దమననీతికి నిదర్శనమ్మది
నిండు మానవ జాతిని అణువణువునా
మాడ్చి మసి చేస్తున్న అగ్నిపర్వతపు లావా అది
అక్రమ సంపాదనా యజ్ఞానికి స్వీయ సుఖ

05/10/2018 - 21:52

‘రేపు’ అనేది
చాలాచాలా అందమైన కల!
ఎవరైనా, ఎంతటివారైనా
కలలలో విహరించడాన్నీ..
ఊహల ఉయ్యాలల్లో
జీవించడాన్నీ..
పరిహసిస్తూ, వ్యతిరేకించే
కరడుగట్టిన వాస్తవిక వాదులు కూడా
‘రేపు’ - ఈ వర్తమానంకన్నా
గతంకన్నా
ఎంతో బాగా ఉంటుందనే
అందమైన కల్పనాత్మకమైన కలకు
ఏ వాదులైనా, ఎంతటి యోధులైనా
తప్పనిసరిగా తలవంచి

05/07/2018 - 21:48

నేటి ఉషోదయంలో
బాలభానుడి ముఖబింబం
నీ నుదుట సింధూరమై
మెరిసిపోతోన్న సమయాన
రవివర్మ కుంచె దిద్దిన
అపురూప చిత్రానివై
నా హృదయ ఫలకంపై
స్థిరంగా నిలిచిపోయావు!
నిన్నటి వరకు నీతో పంచుకున్న
అనుభూతుల జ్ఞాపకాలను
నా హృదయ కుహరంలో
నిక్షిప్తం చేయడానికే
కవితలల్లడం నేర్చుకున్నాను!
పున్నమి జాబిలి వెనె్నల
నీలాకాశ నీలిసంద్రాన్ని

05/06/2018 - 21:40

ఓనమాలు దిద్దలేని ప్రాయానికి..
ఊహల ఉషస్సులో ఉరకలెత్తాలని ఆశ
పరిజ్ఞానాన్ని పెంచలేని పరువానికి..
స్వేచ్ఛగా స్వైరవిహారం చేయాలని ఆశ...
సున్నితంగా వికసించే కుసుమానికి..
సుకుమారిణిగా సౌరభాలు సుమగంధించాలని ఆశ..
క్షణభంగురమైన ఔన్నత్య ఊహను క్షణికావేశం
కట్టడి చేస్తున్న వేళ..
మదిలో మోహరించిన మంచితనంతో దాన్ని
ఓదార్చాలని ఆశ..

05/04/2018 - 21:49

శ్రీనాథుని శృంగార నైషధ కావ్యాన్ని లోతుగా చదివితే కవిసార్వభౌమునికి సేమియా పాయసం రుచి తెలుసనేది మనకు తెలుస్తుంది. ఆధునిక వంటకంలా అనిపించే ‘సేమియా పాయసం’ ఎప్పుడో ఐదారు వందల ఏళ్ల నాటి శ్రీనాథ మహాకవికి తెలుసనే విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

04/12/2018 - 21:51

ఆకాశం నిశ్శబ్దంగా వుంది
అవని నిర్లిప్తంగా వుంది
కాలం నిశే్చష్టంగా వుంది
చరిత్ర ముభావంగా వుంది
భూకబ్జాల్లో గమన నీతి
సెజ్‌ల పేరిట ధూర్త రాజనీతి
ప్రపంచీకరణ పడగ నీడలో ప్రభుత్వం
ముసిరిన అవినీతి పొగమంచులో దృశ్యాదృశ్యంగా వుంది వూరు
ఎండిపోయిన కోనేరు ఇంకిపోయిన కన్నీరు
మూసిన అరాచకపు మంచుపొగలో సత్యాసత్యంగా వుంది వూరు

04/10/2018 - 22:25

విద్యావినయ సంపనే్న బ్రాహ్మణీ గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః (్భగవద్గీత 5-12)

04/09/2018 - 21:53

నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం...

03/29/2018 - 22:11

లోపల ఎవరో తిరుగుతున్నారు
ర్యాలీ తీస్తున్నారు
ముళ్లకంచెల మీదుగా నడుస్తూ
బారికేడ్లను పడదోసుకుంటూ
వీధుల వెంట ఊరేగింపుగా సాగుతున్నారు
ప్రశ్నిస్తున్నారు గర్జిస్తున్నారు నిలదీస్తున్నారు
హక్కుల గురించి అర్థం కాని భాషలో
బాణాలు విసురుతున్నారు
ఆక్రమణల గురించి అర్థం లేకుండా
నిప్పులు కురిపిస్తున్నారు
కుర్చీకాళ్ల పగుళ్ల గురించి కుట్రపూరితంగా

03/28/2018 - 22:04

మారాంచేస్తున్న
పిల్లలతో తాత
కథ చెబుతాననగానే
అల్లరినంతా నిశ్శబ్దం కమ్మేసింది
అదిగదిగో
సృష్టికర్త స్వయంగా
పల్లకిమోస్తూ
దారివ్వండంటూ
చిరునవ్వులు చిందిస్తూ
భూతల స్వర్గంగా అడుగులు
వింటున్నారా చెప్పండి చూద్దాం
మీలో ఎవరైనా
అదీ అదీ ఎవరో కాదు
మానవతామూర్తి సహనశీలి
మమతల కోవెల
విశ్వసనీయతకు
ఆత్మస్థైర్యానికి

Pages