S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/09/2020 - 22:52

తే.గీ. మిత్రునలఁబుస్తకంబులు మేలు గూర్చు
నవియుఁ దోడుండ జీవితమందుఁ గనగఁ
జక్కనౌ దారి గన్పట్టు నిక్కమిదియుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనకు నిజమైన స్నేహితులు పుస్తకాలే. అలాంటి మంచి మంచి పుస్తకాలు మనకు తోడుంటే అవి మేలు చేకూరుస్తాయి. చక్కటి బ్రతుకు మాట మనముందు కనబడుతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు రవిప్రభూ!

01/09/2020 - 23:03

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. నందనందనా! ముకుంద!
మందహాస ముఖవికాస!
నిద్దుర విడి మేలుకొమ్ము
ముద్దుల నీ మోము జూపు

2. నిండు పాల పొదుగులున్న
దండియైన మీ గోవులు
పాలనొదిలి సమృద్ధిగ
పారించును మీ యింటను

01/09/2020 - 02:07

భగవంతుణ్ణి చేరడానికి వున్న అనేకానేక దారులలో భక్తి అత్యంత ప్రధానమైంది. ఇందులో పూజ, నామస్తోత్రం, జపం అనేవి అంతర్గత సాధనాలు. భక్తి మార్గంలో వెళ్లినా భగవంతుడు నా కోరికలు తీర్చడం లేదనే భక్తులు ఉంటారు. అసలు కోరికలతో భగవంతుడిని పూజించడం కాదు. భగవంతుని పై ప్రేమతో తనకు ప్రసాదించినవాటిని కృతజ్ఞత లు చెప్పడానకి పూజ చేయాలం టారు ఫెద్దలు. స్వార్థపూరిత భావాలతో భగవంతుడికి నమస్కారం చేయకూడదంటారు.

01/09/2020 - 02:06

గోష్ఠియందు చేరిన శ్రీనీళాదేవితో కూడా అందరునూ కలసి శ్రీకృష్ణ భగవానుని నిద్రను దూరం చేస్తున్నారు. పొదుగు కింద పెట్టిన కుండలు పై పైకి పొంగి పొరలునట్లు నిండునట్లుగా పాలను ఎడతెగకుండగా స్రవించు ఉదారములగు పెద్ద ఆవులను సమృద్ధిగా కలిగిన ఓ నందగోపు కుమారుడా మేలుకొమ్మ.

01/09/2020 - 02:03

తే.గీ. కలసి మెలసి జీవించిన ఁఋ౎ గలదు సుఖము
దుఃఖసుఖములలో ఁబాలు దోరముగనుఁ
బంచుకొనవలె దిగిపోవు భారమంతఁ
జూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

01/09/2020 - 02:02

జంగమ దేవర శంఖపు రవళులు
శంభో శంకర నా దంతో ఊరంతా
అంబ బలుకు జగదంబ బలుకు
వాక్కుతో బుడబుక్కల ఢమ ఢమలు
భోగి వేకువ జాముకు వేకువ కాగ!

చెరువుకు నీళ్లకి నాన్న కావిడితో
మావూరి చెరువేమో తెలిమంచు కప్పుకొని
సూరీడికేదో కబురివ్వాలని రాయబారి
తుషారపు దొంతర్లతో మంతనాలు
ఎంతకీ ఒగదెగవవి ప్రభాత మంతా

01/08/2020 - 04:35

పాతని వదిలేసి
కొత్తలోకి అడుగు పెట్టబోతున్న
సంవత్సరానికి
స్వాగతం సుస్వాగతం

మనుషుల మధ్య
ద్వేషాలను తుంచి
మమతల ను పెంచి

మనమంతా ఒక్కటే
వసుదైక కుటుంబం అనీ

చేయి కలిపేందుకు వచ్చిన
స్నేహశీలీ స్వాగతం సుస్వాగతం
సాహితీ సౌరభంలో
రెపరెపలాడే అక్షరమై
ఎగరాలని కోరుతూ
పండుగ శుభాకాంక్షలు

01/08/2020 - 04:34

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. ముప్పదిమూడుకోట్ల సుర
మూర్తుల వామనుండవై
గాచిన కృష్ణ! లెమ్మనిరి
కనె్నలంత యేకమ్ముగ

2. స్వర్ణకలశ సదృశమగు
చన్నుదోయి చారువదన;
సన్నని సుకుమార కటితొ,
చెన్నొందెడి నప్పిన్నమ?

01/08/2020 - 04:32

ముప్పది మూడుకోట్ల దేవతలకు ఎపుడైనా ఆపదలు కలిగినట్లయితే ఆ ఆపదలు వారికి కలుగక ముందే వారి దగ్గరికి నీవు వెళ్లి వారికి అండగా, తోడునీడగా ఉండే ఓ స్వామీ నేడేమి ఇలా నిద్రనుంచి మేల్కొనడం లేదు. దయచేసి ఓ ఆర్జవము కలవాడా! పరాక్రమము కలవాడా! శత్రువులకు భయజ్వరమును గలిగింపజాలిన నిర్మల మనస్కుడా నిద్రను వీడుము.

01/08/2020 - 04:29

తే.గీ.. మనములకు రోగమంటక మనగవలయు
నంటినను తొలగించుకోమంటిరేల?
స్వస్థతను ఁ గల్గియుండంగఁ బరమ సుఖము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages