S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/04/2020 - 22:41

శుచిత్వం, ఆచారం, అలంకార ప్రియత్వం, కళా ప్రదర్శనం, ఆరాధనా విధానానికి సంకేతాలు రంగవల్లులు. శుభ్రంగా ఊడ్వబడి, కళ్ళాపు చల్లి, ముంగులతో అలంకృతాలయ్యే తెలుగునాట ముంగిళ్ళు తరతరాల వారసత్వ సంస్కృతులకు ప్రతిబింబాలు. తెలుగు సీమల్లో ప్రతి ఇంటి లోగిళ్లలో ముగ్గులు వేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు. అయితే ధనుర్మాస యుక్త సంక్రాంతి సంబంధిత పర్వదినాలలో వేసే ముగ్గులు పలువిధ ప్రత్యేకాలు.

01/03/2020 - 01:41

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. దివ్యమణులతో పొదిగిన
భవ్యోజ్వల సౌధమందు,
గరుడ చిహ్న కేతనాలు
కళలెసగుచు నెగురుచుండె

2. వ్రేపల్లె గోపికల మిట
వేచినాము ద్వారముకడ
బిగియించిన తలుపు గడియ
బేగి నీవు తొలగింపుము

01/03/2020 - 01:38

నాయకుడై ఉన్న నందగోపుని భవన రక్షకా! జెండాతో ఒప్పుచున్న తోరణ ద్వారపాలకా! మణికవాటపు గడియ తెరువుము. మేము స్నానపానాదులచేత శరీర మాలిన్యాన్ని కృష్ణనామజపంద్వారా మనసు మాలిన్యాన్ని దూరం చేసుకొని మరీ వచ్చాము. మాకు కృష్ణుడు పర అను వాయిద్యాన్ని ఇస్తానని నిన్ననే వాగ్దానం కూడా చేసి ఉన్నాడు.

01/03/2020 - 01:35

రామనామము కల్పవృక్షము. అది ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది, నాల్గు వేదములు, పురాణములు, పండితులు, చివరకు శంకరుడు సైతము రామనామానే్న పరమార్థ సారముగా నిరంతరం రామానామానే్న జపిస్తుంటాడు.ఒక్క రామనామం ఉంటేచాలు అదే కల్పవృక్షము దారుణమైన దుఃఖాన్ని , దారిద్య్రాన్ని నాశనం చేస్తుంది. సర్వకాల సర్వావవస్థలందు రామనామమే రక్షిస్తుంది.

01/03/2020 - 01:30

తే.గీ. తాల్మియుంగల్గి మసలరే ధరణి జనులు
మిగుల ధనదాహముంగల్గి మసలనేల?
వాంఛితమ్ములు వాంఛిప భరము చోద్య
మకట! పరిఁ గావివేవియుమహిన ఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/07/2020 - 00:10

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. పదవవ్రేత మేడేరి
పడతులామె నిదురలేప
సంభాషణ బయటినుండె
సలిపినారలివ్విధమున

2. లేచిలుకా! నీవింకా
లేవకున్నావటే లెమ్ము
చీకాకుగా పిలువకండి
చేరుదు మిము నేవెంటనె

01/02/2020 - 01:27

గోపికలను నిద్ర నుంచి మేల్కొనుడు అని చెబుతూ వస్తున్న ఆండాళ్ తల్లికి ఆమె చెలులకు ఓ చోట పరమాద్భుతమైన విషయం తెలిసింది. ఓ ఇంటికి వచ్చేసరికి ఇంటిలోని గోపిక మేల్కొనియే ఉన్నది కాకపోతే బయటకు రాకుండా లోపల నుండే నిద్ర లేపుదామని వచ్చిన వారికి సమాధానాలు ఇస్తోంది. మీరు ఊరికే గోల చేస్తూ మాట్లాడకండి. నేనేమీ నిద్రపోవడం లేదు. నాకు అంతా తెలుసు అంటూ చిలుకపలుకులు పలికిందా వనిత.

01/02/2020 - 01:24

తే.గీ. గుణము లేనట్టి కులమేల?కోట్ల వేల
సకల సద్గుణ సంపత్తి సాటి ధనము
వెదకి జూచిన లేదిల వేల్పు గుణమె
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!

01/03/2020 - 01:30

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. మీదు పెరటి తోటనగల
మిన్న దిగుడు బావిలోన
కెందామరలెల్ల విరిసె,
కందెనందు కలువపూలు.

2. తెలతెల్లని పలువరుసలు
గలిగినట్టి తాపసులును,
కావివస్తధ్రారణతో-
కోవెల మార్గము బట్టిరి

01/01/2020 - 00:39

ఆండాళ్ తల్లి తన తోడివారిని నిద్ర మేలుకొనుడు అని చెప్పడానికి ఈరోజు ఇలా చెబుతున్నది. సూర్యోదయం కాబోతున్నదని తెలుసుకొని తమను వీడి తమ వెనె్నలరేడు దూరమవుతున్నాడని అనుకొంటూ నల్లకలువలన్నీ ముడుచుకుపోయాయి. వాటికన్నా ముందే ఎర్ర తామరలన్నీ భానుడి వెచ్చని కౌగిలి కోసం ఆరాటపడుతూ ఒకదానికన్నా మరొకటి ముందుగా విచ్చుకుంటున్నాయి.

Pages