S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/01/2020 - 00:38

విచక్షణను కలిగి ఉండటం కూడా గొప్ప జ్ఞానంగానే అనుకోవచ్చు. మంచి చెడుల విశే్లషణలో ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవడమే జ్ఞానం విచక్షణ అని అనుకుందాం. మంచిచెడు తెలుసుకోకుండా ప్రవర్తించినవారు తప్పక అనుకోని పరిస్థితులు ఎదుర్కొని వాటి వల్ల నష్టపోవాల్సి వస్తుంది.

01/01/2020 - 00:35

తే.గీ. చదువుకున్నను సంస్కార సహృదయముల
నేలుకొన వచ్చు మనముల నిలుపుకొనగ
వచ్చు సద్భావ సంపత్తి మెచ్చునటుల
జూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/31/2019 - 04:09

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. బకాసురుని తాలువులను
తగజీల్చెను శ్రీకృష్ణుడు;
దశకంఠుని పదితలలను
దాశరథియై ఖండించెను

2. వారిరువురి శుభనామము
కూరిమితో నుతియింతము;
సుధాకరుడు అస్తమించె
సూరీడిపుడదయించెను.

12/31/2019 - 04:08

ఆండాళ్ తల్లి ఇలా చెబుతోంది. 3ఓ అమాయకురాలా! ఇకనైనా నిద్రమేల్కొనుము. నీ తోడి వారంతా గబగబా లేచి కాలకృత్యాలు తీర్చుని కోవలెకు పోతూ నాడు చిన్నతనానే బకాసురుని నోటిని చీల్చివేసిన శ్రీకృష్ణుని వీరోచిత కార్యాన్ని, ఉలూఖ బంధన ఘట్టాన్ని మధురంగా ఆలపిస్తున్నారు. సమస్త దిక్కులల్లో పక్షుల ఆహార్వానేషణకు పూనుకొంటూ కిలకిలారావాలు చేస్తున్నాయి. హరిణమువలె చంచలనేత్రాలు కలిగినా ఓ చంచలాక్షి!

12/31/2019 - 04:07

ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగను వివిధ దినాలలో జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం సంవత్సర పరిగణనం వేరువేరు మాసాలలో జరగడమే. ప్రపంచంలో అత్యధికులు ఆచరించేది ప్రస్తుత గ్రెగేరియన్ క్యాలెండర్ క్రీ.శ.1582లో రూపొందించినది. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర తొలి రోజును పండగలా జరుపుకోవడం సాపేక్షంగా కొత్త దృగ్విషయం.

12/31/2019 - 04:04

తే.గీ. బ్రతుకు దెరువుకు నేవియో పనులఁ జేసి
కొనగ వచ్చును కానివి కూడనట్టి
పనులు గాకున్న ఁ జాలు నాపనులు సరియుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: బ్రతుకు దెరువుకోసం కాని పనులు, కూడని పనులు కాకుండా ఏ పనులనైనా చేసుకోవచ్చు. ఏ పనులు చేసుకొన్నా అవన్నీ సరైనవే. ఈ విషయంలో ఎలాంటి ఆక్షేపణ లేదను సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియుజేయుమయ్యా ప్రభూ!

12/30/2019 - 05:25

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. కృష్ణమూర్తి సేవయందె
తృష్ణతోడ గోపాలురు;
పాకలోని పనులు మరచి
పాలు కూడ పితుకరైరి

2. అతి బిగుతుగ పొదుగులున్న
ఆవులు గేదెలు యరచుచు;
పాలను తమ లేగలకయి
వదిలెను నేలంత తడిసె

12/30/2019 - 05:23

ఆండాళ్ తల్లి తనతోడివారిని పిలుస్తూ ఆ గోపవిభుని కొలవడానికి ఉరకలువేస్తున్నది. అలా అందరినీ పిలుస్తూ ఒకరింటికి వెళ్లింది. ఆ ఇల్లాలు ఆదిమరిచి పోతున్నది. వారి వాకిట ఆవులు, గేదలు వాటి పొదుగులభారాన్ని భరించలేక తమ లేగలను తొందరగా రమ్మని పిలుస్తూ పొదుగులనుంచి ధారగా పాలను స్రవించుతున్నాయి. దాన్ని చూసిన ఓ ఆండాల్ తల్లి 3గొప్పగా పాడి అనేసంపద కలిగిన ఓ ఇల్లాలా! ఇంకనూ నీవు నిద్రపోతున్నావా.

12/30/2019 - 05:21

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారం చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణములలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పూర్ణిమ రోజున పుష్యమి నక్షత్రములో సంచరించే మాసం పుష్యమాసం.

12/30/2019 - 21:50

తే.గీ. కలివిడిగఁ బదిమందిలోఁ గలియఁ దిరిగి
నపుడు గష్టసుఖాలలోనంతఁ బాలు
పంచుకొని యెదరెల్లరు బహువిధాల
మేలు నేకూరు సందేహమేమిలేదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages