S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/29/2019 - 22:16

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. లేగలు గల ఆవుపాలు
సేకరించగల దానవు;
శత్రుమదము నణచివేయు
సత్తువున్న సాధ్వి నీవు

2. వల్మీకము నందునున్న
పామువంటి కటి శోభతో,
వనమునందు నృత్యమాడు
వనె్నలుగల నెమలి నీవు.

12/29/2019 - 22:13

మహాభారతంలో పరీక్షిత్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంతో స్థిర చిత్తంతో నిల్చుని శుకమహర్షి చేత భాగవతం వారంరోజుల పాటు చెప్పించుకుని విని తరించిపోయాడు. బాగుంది.

12/29/2019 - 22:04

తే.గీ. విలువలెఱుగుచు వర్తింప నిలుచు విలువ
లవియు గుర్తించఁ బోకున్న విలువ లేదు
విలువలవి లేక నిలచిన విలువలేదు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

12/28/2019 - 22:10

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. కృష్ణస్వామి యనుభూతితో
తృష్ణమీర సౌఖ్యమొందు
భాగ్యమొచ్చె నంచుమిగుల
పరవశాన యుంటివీవు

2. శ్రీతులీస శుభమాలతొ
శోభిల్లెడి శ్రీకృష్ణుని
‘పర’నాబడు దివ్యమైన
వాద్యమ్మును యర్థింతము

12/28/2019 - 22:07

బద్ధ్దకంతో పడుకుని ఉన్న గోపికను ఆండాళ్ తల్లి ఇలా పిలుస్తోంది. అ మ్మా సర్వానికి చెందిన ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకొనెడి సౌభాగ్యమునకు, అదృష్టమునకు నో చుకుని ఉండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొందు చూచుచుంటివా. ఎంత స్వార్థమమ్మా నీకు. తలుపైనా తీయరాదా? పరిమళాలతో నిండి యున్న తులసీ మాలలను ధరించి ఉన్న స్వామిని నోరు విప్పి కీర్తించినట్లయితే మన కోరిక తీరును..

12/28/2019 - 22:00

తే.గీ. పిల్లలన్నను వేల్పులు విశ్వమందు
స్వేచ్ఛ గల్గియు విహరింత్రు చిర్నగవులు
విసురుదురు శుభ చిహ్నాల వెల్గుల రయఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చిన్న పిల్లలంటే నిజంగా దేవుళ్లే. ఈ విశ్వంలో స్వేచ్ఛగా విహరిస్తారు పిల్లలు. విరిసే చిరునవ్వులను విసురుతారు. పిల్లలంటే శుభచిహ్నాల వెలుగులన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియుజేయమయ్యా స్వామీ.

12/25/2019 - 23:41

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. రత్న ఖచిత కుడ్యాలతో
రహిగాంచెడి మేడయందు;
దీపకాంతు లలరుచుండ
ధూపపు గంధాలు నిండె.

2. హంసతూలికా శయ్యన
హాయిగా పవళించునట్టి;
మేనమామ ప్రియనందని
మేలుకొనుము తెలవారెను.

12/26/2019 - 04:21

ఈ పాశురంలో అద్దాలమేడలో పరిశుద్ధములగు నవవిధ మణులతో వెలిగే దీపముల మధ్య పడుకున్నగోపికను వీరు నిద్రలేపి వ్రతాన్ని చేయడానికి తీసుకుని పోదామనుకొన్నారు. దానికోసం ఒక అమ్మాయి ముందుకు వెళ్లి ఆ పడుకోని ఉన్న అమ్మాయి కన్నా ముందు కనిపించిన ఆ అమ్మాయ యొక్క అమ్మను చూసి

12/25/2019 - 23:39

సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం.

12/26/2019 - 04:23

తే.గీ. మనుట ముఖ్యమా? మనిషిగ మనగవలయు
నటుల ఁ గాకున్న నేలకొ యట్టి జీవ
నంబు సారవిహీన వౌ నంత జంతు
జీవనం బేగ నెఱుగుమీ జీవితానఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages