S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/22/2019 - 02:29

ఓ కృష్ణ భక్తులారా! మనం భగవంతుని పూజించడానికి ప్రారంభించినపుడు మనమొమనర్చిన పాపకృత్యాలు మనలను ఆటంకపరుస్తాయోమోనని భయము నొందవలదు. అందులకు కారణమేమన మన వ్రతనాయకుడు కృష్ణుడే కనుక ఆయనకున్న ఆశ్చర్యకరములైన గుణవిశేషములు, క్రియలను కల్గినవాడతడు.

12/22/2019 - 02:28

మాసాలన్నింటిలో మార్గశీర్షం తన స్వరూపమే నని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ గీత లో ప్రకటించాడు. పనె్నండు మాసాలకూ ఈ మాసం బ్రాహ్మీమూర్తం లాంటిది. ఈ నెలలో చేసే విష్ణుసహస్రనామాపారాయణం అనంతకోటి పుణ్య ఫలితాలను అందచేస్తుంది. చాంద్రమానాన్ని అనుసరించి మార్గశిరమాసం. సౌరమానం ప్రకారం ధనుర్మాసం వ్యవహారంలోకి వచ్చాయి.

12/22/2019 - 02:26

రామానుజన్ జయంతి సందర్భంగా
*

12/22/2019 - 02:18

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. మగువలార! మన కృష్ణుడు
మధురాపురి నాయకుండు,
మనమనసులు దోచినట్టి
మహిమాన్విత మర్మజ్ఞుడు

2. యదువంశమునందు బుట్టి
యశోదమ్మ నందనుడిగ;
యమునతటి క్రీడించెను
అందాలను చిందించుచు

12/22/2019 - 02:16

తే.గీ. ఇనకులోత్తముడా రాముడిలను మెలగి
నట్టి తీరును బాలలు పట్టుకున్న
సవ్యమార్గాన భావిలో ఁ జనుదురరయఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/19/2019 - 22:43

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. నిండు జలధులందునున్న
నీరమ్ముల నెల్లద్రావి,
నీరదములు నింగికెగయ
వరుణదేవ! యాన తిడుము

2. శౌరి చేతి శంఖము వలె
ఉరుముల ధ్వని మించవలెను,
పద్మనాభు చక్రకాంతి
పరిఢవిల్లవలె మెరుపుగ

12/19/2019 - 22:43

తిరుప్పావై పాశురాలను పాడుటకు బయలుదేరిన వారికి ఆండాళ్ తల్లి ఇలా చెబుతోంది. ప్రకృతే పరమాత్మ. ప్రకృతిని రక్షిస్తూ ఎల్లపుడూ సస్యశ్యామలంగా ఉండడానికి సకాలంలో వర్షాలు కురుసేట్టు చేసే వరుణదేవుణ్ణి ఆండాల్ తల్లి ప్రార్థిద్దాం రమ్మని అందరినీ పిలిచి వారితో కలసి ఇలా ప్రార్థిస్తోంది. గంభీరమైన స్వభావం కల్గి వర్షాధిదేవతవైన ఓ పర్జన్యుడా! నీవు వెనుకంజవేయబోయకుము.

12/19/2019 - 22:35

తే.గీ. సేవయే పరమావధి జీవితాల
కనుచు మనుగడ సాగింపఁ గలరు పుట్టు
వునకునర్థమ్ము సేకూరు కనగ జగతిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/18/2019 - 22:33

మధురవౌ భక్తి మన్మార్గ శీర్షంబైన
ఆముక్త మాల్యద కంజలింతు
శ్రీ వ్రతాచరణ భాసిత కీర్తి మూర్తిని
ఆముక్తమాల్యద నభినుతింతు
అక్షర పాశురాలను ధనుస్సుకు నారి
నాముక్తమాల్యద నభినతింతు
గోద- స్వచ్ఛ ప్రేమ వేద - విష్ణుని చిత్త
కాముక్త మాల్యద కంజలింతు
దేశభాషల తెలుగు లెస్స 3శివమ్2ను
సాహితీ సమరాంగణ సార్వభౌమ
సుందర విశిష్ట కవితకు మందిరయగు

12/18/2019 - 22:34

ఆండాళ్ తల్లి తన చెలులతో కలసి నందగోపుని పూజించడానికి తయారైంది. అదిగో ఆ చెలులందరికీ ఆ యశోదమ్మ బాలసింహం ఎంతగొప్పవాడో చెబుతోంది. చూశారా! గోపవనితలారా! నాడుపురుషోత్తముడు వటువై వచ్చి పెరిగి లోకాలను గెలిచినట్లుగానే ఈనాడు మనం ఆచరించే వ్రతాన్ని చూసి సంతసం పొంది ఈతి బాధలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు కురిసేట్టు చేస్తాడు.

Pages