S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/18/2019 - 22:27

తే.గీ. ఎల్లరకు రక్షకుడు దేవుడెల్లవేళ
లందు దేవుని స్మరియింప రమ్యమైన
జీవనంబులు దొరకును జీవులకునుఁ
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం:- ఆ దేవుడే అందరినీ రక్షించేవాడు. సర్వవేళల సర్వావస్థలలోను భగవన్నామ స్మరణ చేసినట్లయితే మానవాళికి మనోహరమైన బ్రతుకులు లభిస్తాయనే సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియుజేయుమయ్యా!

12/18/2019 - 22:34

తిరుప్పావై మూలానికి తెలుగు
*
1. వడుగై వచ్చిన శ్రీహరి
పొడుగై బలిదర్పమణచె
త్రివిక్రముండై సురలకు
త్రిలోకములప్పగించె

2. పరమాత్ముని కీర్తించిన
పడువానలు నెలకుమూడు
పంటలు మెండుగ పండును
పండుగయే ప్రజలకెల్ల

3. సెలయేరులు పొంగిపొరలు
కలహంసలు కూడియాడు;
కలువలు మరి భ్రమరకాలు
కులుకు తటిని మీన తితితొ

12/17/2019 - 23:24

శ్రీకృష్ణ్భక్తులకు ఇహమూ పరమూ కృష్ణమయమే. ఏది చూసినా, ఏది విన్నా కృష్ణలీలగానే గోచరిస్తుంది.వారు తమకోసం ఏది చేయరు. వారు చేసేదంతా శ్రీకృష్ణుని మనస్సును గెలవటం కోసమే చేస్తుంటారు. అట్లాంటి గోపభామలను ఆండాళ్ తల్లి తాను వ్రతం చేసి ఆ నందగోపుని అనుగ్రహాన్ని పొందాలనుకొంది. తను ఒక్కతే కాక ఇతర గోప బాలికామణులను కూడా ఆ వేణుగోపాలుని మురళీరవం వినడానికి రమ్మని పిలుస్తోంది.

12/17/2019 - 23:23

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. పాలకడలి, శయనించిన
భగవానుడు తుష్టినొందు;
నియమగతిని మనము వ్రతము
నెమ్మి నమ్మి యొనరించిన

2. శేషతల్పశాయి హరిని
శ్రేష్టముగా స్మరియించుచు;
వ్రతమొనర్చు నియమములను
వ్రేతలకెరిగించె గోద

12/17/2019 - 23:24

తే.గీ. వయసు మళ్లిన వృద్ధుల వ్వారి సేవ
భాగ్యమనియెంచి మసలిన వారుకూడా
గట్టు పుణ్యమ్ము దలుపంగఁ గలమ? చూవె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/16/2019 - 22:39

మార్గశిరమాసం వచ్చేసింది. చలిరాత్రులు, వెనె్నల రాత్రులు వచ్చేశాయి. భగవంతుని సేవలో తరించాలనుకొన్న తల్లి తన చెలులందరినీ , భగవంతునిపైన నమ్మకమున్న అందరినీ పిలవడానికి బయలుదేరింది. నేను ఒక్కతే కాక అందరితో కలసి సామూహికంగా భగవంతుని కైంకర్యం చేసినట్లయితే భగవంతుడు సంతోషిస్తాడని అనుకొంది. ఉన్నది ఒక్కటే దైవం. అందులో తన మన భేదాలు లేవు. నీవు నేను అనే వ్యత్యాసాలు అంతకుముందే లేవు. ఎక్కడ చూసినా భగవంతుని అంశమే.

12/16/2019 - 22:38

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. శ్రీకృష్ణుని కృపను బడయు
శ్రీకరవౌ సమయమ్మిది;
వినుడి నిండు వెనె్నలున్న
ధనుర్మాస వ్రతకాలము

2. బృందావన సుఖ విహారి
మందహాస వదనముగల
నందగోప బాలకుడగు
మాధవునే సేవింతము

12/16/2019 - 22:28

తే.గీ. మాటి మాటికి గొడవలు మాని గీము
లందు నా నంద ముప్పొంగ రమ్యమైన
జీవితాలను గడుపంగఁ జేరుసుఖము
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

12/16/2019 - 02:38

శుభప్రదమైన మార్గశీర్షమాసం శుక్లపక్షం వెన్నల నిండిన రాత్రులు కలది. స్నానము చేయు తలంపుకల వారందరూ రండి అని ఆండాళ్ తల్లి పిలుస్తున్నది. చక్కని ఆభరణములు ధరించి, సకల సంపదలు నిండిన గోపకులములోనున్న గోపికలారా! వేలాయుధమును ధరించిన నందుని కుమారుడు, విశాల నేత్రాలు కల యశోదబాలసింహం నీలమేఘశ్యాముడు, అరుణ నేత్రుడు, సూర్యచంద్ర సన్నిభముఖుడుగు శ్రీమన్నారాయణుడే మన వ్రతసాధనమును అనుగ్రహించును.

12/15/2019 - 22:44

తే.గీ. మన నడవడిక పదిమంది కనుచువారి
నడత మార్చుకొను విధముగ నలరవలయు
నపుడు వేల్పుల వౌదు మీ యవనిపైన ఁ
జూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: మన ప్రవర్తనను చూసి పదిమంది తమ ప్రవర్తనను మార్చుకునే విధంగా మనల్ని తీర్చిదిద్దుకుంటూ ప్రకాశించాలి. అపుడు ఈ భూమీద మనమే దేవతలం కాగలమన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవు ఈలోకానికి ప్రబోధించుదినకరా!

Pages