S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/14/2019 - 22:08

మనస్సు చాలా చంచల స్వభావమైనది. అనేకానేక ఆలోచనలు వస్తూనే ఉంటాయ. ఏదో ఒక ఆలోచన లేకుండా మనిషి అనేవాడు నిముషమైనా ఉండలేడు. కానీ ఏకాగ్రతతో మనసును నిశ్చలంగా ఏ ఆలోచనలు లేకుండా నిలిపినట్లయతే భగవంతుడు కూడా మనసుపై విజయం సాధించిన వారికి కనిపిస్తాడు. వారికి ఆధీనుడై ఉంటాడని పెద్దలు చెబుతారు.

12/14/2019 - 22:05

తే.గీ. శైశవంబున సంస్కార సారముగ్గు
పాలతో రంగరించియు నొంటఁబట్టు
నటుల తల్లులు ద్రావింపనరయ భావి
జీవితంబున ఘోరాలు సేయఁ బోరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/13/2019 - 02:39

మహాభారతంలో యుద్ధఘట్టంలో అనగా కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథానికి సారథిగా ఉండాలి.కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు. ఆ విషయం తెలుసుకొన్న శ్రీకృష్ణుడు ఆ వైష్ణవాస్త్రాన్ని తన హృదయం తాకేలా చేసుకొంటాడు. శ్రీకృష్ణుని హృదయాన్ని తాకినటువంటి వైష్ణవాస్త్రం ఎర్రటి తామరపువ్వులాగా మెరుపులు మెరుస్తుంది.

12/13/2019 - 02:38

తే.గీ. వ్యర్థమైనట్టి వారలెవ్వరును భువిన
లేదు కారణజన్ములే రీతిఁ గాంచఁ
బనికి రారని భావింపఁబనికి రాదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈ భూమీద వ్యర్థమైనటువంటి ఎవరూలేరు. ఏవిదంగా చూసినాఅందరూ కారణజన్ములే. ఎవ్వరినీ పనికిరాని వారని భావించడం ఎంతమాతం పనికిరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనాఈలోకానికి తెలిపుము.

12/12/2019 - 04:37

ఎందెందు వెదకి చూచిన అందేముంది
భవబంధముల కుప్పలు తప్ప
ఎంత ఎత్తు పైపైకి చూచిన నీలాకాశంలోని
నల్లనల్లని మబ్బుల గుంపులు తప్ప
ఎన్ని పరుగులిడినా ఆశల విఫల
ఆయాస ప్రయాస తిప్పలు తప్ప
వెండి కొండలపైన వెలుగుచున్న
చంద్రవౌళి చల్లని చూపులే
నా అంతరంగకాంతుల ఒప్పులు

12/12/2019 - 04:33

తే.గీ. శాంతి సహజీవనంబులు చక్కనెఱపి
ధర్మ బద్ధముగను జీవితాలు గడపి
ప్రేమ పారిజాతాలను విరివిగాను
నెల్లకాము విరజిమ్ము విలువవలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: శాంతి సహజీవనాలు విస్తృతపరిచి ధర్మబద్ధంగా జీవితాలు గడపి ప్రేమ అనే పారిజాతాలు ఎల్లకాలం విరివిగా విరజిమ్ముతూ బ్రతకాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ఈలోకానికి ప్రబోధించవయ్య స్వామి.

12/11/2019 - 22:08

వేదకాలంలో ఇంద్రాది దేవతల ప్రాముఖ్యం అధికం. పురాణకాలమందు మూర్తిత్రయం ఏర్పడినది. బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురు మూర్తులు భిన్నులు కారని, ఒక్కరేయని, దేవుడు ఒక్కడే అనే వేద ప్రమాణమును అన్వయించేందుకే దత్తాత్రేయ ఉద్భవ సందర్భం కలిగింది. అలాగే పాతివ్రత్య మహాత్మ్యం చేత సాక్షాత్ దేవదేవులనైనా, తారుమారు చేయవచ్చునని బోధించడం కూడా త్రైమూర్త్య స్వరూప ఆవిర్భావ ఉద్దేశితం.

12/11/2019 - 22:08

తే.గీ. చేయిఁ జాచిన వారికి ఁ జేతనైన
సాయముం జేయ నిలచిన ఁ జాలువారి
పుణ్య మెన్నంగఁ జాలమీ పుణ్యభూమిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దేహీ! అని చేయి చాచి అడుక్కునేవారికి చేతనైన సాయం చేయడానికి పూనుకుంటే చాలు వారి పుణ్యభూమిలో అటువంటి వారి పుణ్యఫలాన్ని లెక్కించడం సాధ్యం కాదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! ఈలోకానికి ప్రబోధించవయ్యా స్వామి.

12/04/2019 - 22:42

జయం కలిగితే పొంగిపోవడం, అపజయం కలిగితే బాధతో కుంగిపోవడం సాధారణ మానవులకు సహజం. గెలుపు ఓటములు జాతకాలను అనుసరించి ఉంటాయని గుడ్డిగా నమ్మడం మూర్ఖత్వం. అసలు ఓటమి ముఖ్యకారణం మీరు సరియైన ప్రయత్నం చేయకపోవడమేనని పెద్దల జీవిత చరిత్రలు మనకు బోధిస్తున్నాయి. మనం సరైన పనులు చేసినా, మనకు చెందవలసినవి చెందకుండా ఉంటే అవి మనకు దక్కకపోయనా వాటివలన ఇతరులకు మేలు జరిగితే మనం సంతోషించే నేర్పును అలవర్చుకోవాలి.

12/04/2019 - 22:38

అతిదానత్ హతః కర్ణః తు అతి లోభాత్ సుయోధనః
అతి కామాత్ దశగ్రీవః తు అతి సర్వత్ర వర్జయేత్
భావం: అతిగా దానం చేసే కర్ణుడు, అతిలోభత్వంతో సుయోధనుడు, అ కామంతో పదితలలవాడు నాశనం అయ్యారు. అందుకని అతిని ఎల్లపుడూ నివారించండి.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాత్ తాడయేత్
ప్రాప్తేతు షోడసే వర్షే పుఅతే మిత్రావద్ ఆచరేత్

Pages