S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/04/2019 - 22:47

తే.గీ. దేవుడిచ్చిన దేహమ్ము దేశసేవ
లోనఁదరియించవలెఁ గదా జ్ఞాన వంతు
లము మనుజులము మరువంగ రాదు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

,
12/03/2019 - 23:11

నేడు ఘంటసాల జయంతి
*

12/03/2019 - 23:07

విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం
విద్యా భోగకరి యశః సుఖకరి విద్యా గురూణాం గురుః
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరదేవత
విద్యా రాజసు పూజిత న తు ధనం విద్యావిహీనః పశుః

12/03/2019 - 23:06

తే.గీ. శిక్షలమలులో జాప్యము చేయరాదు
తప్పుఁజేసిన వెంటనే తగిన శిక్ష
వేయవలయునద్దానితో భీతిఁజెంది
చెడుకు సాహసింపరు గదా చిన్నపాటి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

12/02/2019 - 22:34

మనసుండాలే కానీ మార్గాలు కోకొల్లలు.చేసే పనిమీద మనసును లగ్నం చేస్తే అన్ని సఫలం అవుతాయి. ‘చిత్తం శివునిమీద, భక్తి చెప్పులమీద’ అన్నట్లుగా ఉంటే ఫలితం ఉండదు. మనం చేసే ఏ పనిమీదనైనా సూక్ష్మదృష్టి పెట్టి చేస్తే అది ఫలవంతమవుతుంది. ‘సంకల్ప బలం’ ఉండి ఏకాగ్రతతో ఏ పని చేసినా చివరికి దాని ఫలితం లభిస్తుంది.కశ్యప మహామునికి దితి, అదితి అని ఇద్దరు భార్యలు ఉన్నారు. దితి సంతానం రాక్షసులు, అదితి సంతానం దేవతలు.

12/02/2019 - 22:33

యంబ్రహ్మ వరుణేంద్రరుద్రమరుతః స్తువంతి దివ్యైః స్తవై
వెదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః
ధ్యానావస్థిత తంగతేన మనసా పశ్యన్తి యం సామగాః
యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః

12/02/2019 - 22:28

తే.గీ. చెల్లెలిగఁ దల్లిగనుఁ బరస్ర్తినిఁదలుపఁ
బోకఁ గామాంధకారానఁ గన్ను మిన్నుఁ
గానకుండగ వర్తింప ఁ గడకువంశ
నాశనంబది తథ్యమా నరమృగాలఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

11/30/2019 - 22:00

కుచైలినమ్ దంతమలోపధారిణం
బాహ్యశినమ్ నిష్ణురభాషినమ్‌చ
సూర్యోదయే చప్తామితే శయానం
విముంచ్యతి శీర్యాది చక్రపాణిః

11/30/2019 - 22:00

యజుర్వేదంలో ‘ఇయం తే యజ్ఞియా తనూః’ - ఈ నీ శరీరం యజ్ఞం చేయదగినది అంటే దేహమే లేకపోతే ఏ పనులు చేయగలం? అన్ని పనులకు దేహమే ఆధారం. అందులోను మానవజన్మనెత్తిన వారు వారి జన్మను సార్థకం చేసుకోవాలంటే వారి శరీరమే ముఖ్యమైన వాహిక. ఆరోగ్యకరమైన సుఖకరమైన శరీరం ఉంటేనే ధర్మకార్యాలు చకచకా చేయగలం. ఇంద్రియాలు అన్నీ సక్రమంగా పనిచేస్తే నే ఇతరులకు హితాన్ని ఒనరించగలము.

11/28/2019 - 23:05

మార్గశిరం తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ మాసాలలో మార్గశిరమును నేను అని అన్నాడు. మార్గశీర్షం పరమ పవిత్రం. నక్షత్ర మండలంలో మూడు నక్షత్రాలు శీర్షాకృతిని పోలి ఉన్నందున మృగశీర్ష అని పేరువచ్చింది. రాశి అధిపతి గురుడు, సూర్యచంద్రుల సమాగమమును సంతరించుకున్న ఈ మాసం విష్ణు ఆరాధనతో మోక్షదాయిని అయింది.

Pages