S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/28/2019 - 23:05

సబిందు సింధు సుస్కలత్తరంగ భంగరంజితం
ద్విషత్సు పాపజాతాజాత కారివారి సంయుతం
కృతాంత దూత కాలభూత భీతి హారి వర్మదే
త్వదీయ పాదపంకజమ్ నమామి దేవి నర్మదే!

11/28/2019 - 23:04

హైహయ రాజ వంశానికి చెందిన కృతవీర్యుని కుమారుడే మహాబలశాలియైన కార్తవీర్యార్జునుడు. దివ్యాస్త్ర బలసంపన్నుడైన కార్తవీర్యార్జునుడు ధర్మమార్గావలంబియై సప్త ద్వీపాలతో గూడిన భూమండలమును ఏకచ్ఛాత్రాధిపత్యంగా పాలించాడు. నారాయణాంశ కలిగిన కలిగినవాడు దత్తాత్రేయుని ఆరాధించి ఓజస్సు, ఇంద్రియమహత్వము శత్రువిజయము, కీర్తి, తేజస్సు, అష్టసిద్ధులు, వేయి చేతులు కలుగునట్లు వరముపొందాడు.

11/28/2019 - 22:59

తే.గీ. ఆత్మవిశ్వాసముం గల్గియడుగులవియు
వేగవంతానఁ గదుపంగ విజయపథము
గోచరించును మనకు సంకోచమేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/27/2019 - 22:32

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని తన కావ్య అవతారికలలలో తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పిన రాయలవారి జీవిత సమగ్ర విశే్లషణకు ‘మూరురాయగండడు శ్రీకృష్ణదేవరాయలు’ అనే గ్రంథాన్ని పరిశోధనాత్మకంగా ఎస్.డి.వి.అజీజ్ వ్రాయడం ఎంతో అభిలషణీయం.

11/27/2019 - 22:21

హిందువులందరికీ భగవద్గీత పరమ ప్రాణికమైన గ్రంథం. గీతను చదివితే చాలు, ఆ గీతను అర్థం చేసుకొంటే చాలు జీవితం ఏవిధంగా సార్థకం చేసుకోవచ్చో తెలిసిపోతుంది. కఠినమైన విషయాలను కూడా సున్నితంగా పరిష్కరించుకోగల నైపుణ్యం ఏర్పడుతుంది. ప్రారబ్ధకర్మలను అనుభవించేవారు సైతం గీతను రోజు పారాయణ చేసినట్లయతే వారు ఆ కర్మలనుంచి విముక్తులు కావచ్చు.

11/27/2019 - 22:20

కర్పూరధూళికలితాలవాలే కస్తూరీ కల్పితదోహాలశ్రీః
సిమామ్బుకాభైరభిశిచ్యమానః ప్రాంచం గుణః ముంచతి నో పలాన్దుః

11/27/2019 - 22:19

తే.గీ. పెద్దవారల మాటలు చల్దిమూట
లవియు విస్మరించిన వారి కవిరళమగు
కష్టనష్టాలు చుట్టీయుఁ గాన వినగ
వలయునెల్లరు సుఖములఁ బడయ వలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/27/2019 - 01:48

శృతి జ్ఞానహీనః పశుభిస్సమానః అంటే జ్ఞానంలేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్థం. ఇక్కడ జ్ఞానం అంటే చతుర్వేదములనుండి గ్రహించబడిన నాలుగు మహా వాక్యములు అంటే- నాలుగు వేదాలసారం. 1.అహం బ్రహ్మర్షి= నేనే పరబ్రహ్మను, 2.అయమాత్మా బ్రహ్మ = నా ఆత్మయే బ్రహ్మ 3.ప్రజ్ఞానం బ్రహ్మ = విశేషణమైన జ్ఞానమేది కలదో అదియే బ్రహ్మ. 4.తత్వమసి=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు?

11/27/2019 - 01:48

ఆశానామ నది మనోరథ జల తృష్ణ తరంకులా
రాగ గ్రాహవతి వితర్క విహాగా ధైర్య దృమధ్వంసిని
మోహవర్తసుదుస్తరాస్తిగహనా ప్రోత్తుంగ చింతాతటి
తస్యాః పారగతా విశుద్ధమనసో నందతి యోగీశ్వరాః

11/27/2019 - 01:38

తే.గీ. లేమితో బాధపడువారికేమి యిడిన
నదియు పదింతలై వచ్చు నడచుకొనుచుఁ
జేయఁదగు సహాయముఁ జేయఁ బతికి పోరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages