S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/26/2019 - 21:59

భారతదేశంలో శివతత్వాన్ని ప్రబోధించే జ్యోతిర్లింగాలలో పరళీవైద్యనాథ్ దేవాలయం ఒకటి. ఇది మహారాష్టలోని బీడ్ జిల్లాలోగల అంబేజోగాయి నుంచి కేవలం 26కిలోమీటర్ల దూరంలో ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఐదు మహారాష్టల్రోనే ఉన్నాయి. కొన్ని జ్యోతిర్లింగాలు సాగర తీరంలో మరికొన్ని నదీతీరాల్లో ఇంకొన్ని పర్వత శిఖరాలపై ఇంకొన్ని మైదానపు ప్రాంతాలల్లో వివిధ రూపాల్లో కనిపిస్తాయి.

11/26/2019 - 21:52

ఆదిశంకరాచార్య విరచితం జగన్నాధాష్టకం
కదాచిత్కాళింది తటవిపిన సంగీత కపరో
ముదాగోపీ నారి వదన కలమాస్వాదమధుప
రామాశంభుబ్రహ్మ మరపతి గనే షార్చితపదో
జగన్నాథః స్వామి నయన పథగాలి భవతుమే
నవైప్రార్థ్యమ్ రాజ్యం న చ కనకితామ్ భోగ విభవం
నయాచే హం రమ్యాం నిఖిల జనకామ్యామ్ వరవధూమ్
సదా కాలేకాలే ప్రథమ పతినా చిత చరితో
జగన్నాథః స్వామి నయన పథగామి భవతు మే

11/26/2019 - 21:51

తే.గీ. బుద్ధిజీవులమై యుండి బురదపాలు
చేయఁ గూడదు మనబుద్ధిఁజేయఁదగిన
కార్యములు సేయఁ బూనిన ఖ్యాతిఁ గాంచి
ధన్యజీవుల వౌదుమీ ధరణియందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: బుద్ధి జీవులమైన మనం మన బుద్ధి బురదపాలు చేయరాదని, చేయదగిన పనులు చేసినట్లయితే అకర్మలకు పూనుకోకుండా సకర్మలకు పాటుపడాలనుకొను కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్య స్వామీ!

11/24/2019 - 22:23

సమూహం లేదా సమాజాన్ని ఐకమత్యంగా నిలిపేది ఉత్సవము. ఆ ఉత్సవము ఏదైనా కావచ్చు. అలానే ఆ దేశ లేదా ఆ ప్రాంత విశిష్టతను, సంస్కతీసంప్రదాయాలను ఈ శుభకార్యం ద్వారా బయట లోకానికి తెలుస్తుంది. ఇటువంటి ఉత్సవాలు మన దేశంలో చాలనే ఉన్నాయి. ఈ కార్యాలే నేడు మన దేశాన్ని కలిసికట్టుగా ఉంచుతున్నాయనడంలో సందేహం లేదు. అటువంటి ఉత్సవాల్లో కో జాగరీ ఉత్సవం ఒకటి.
కో జాగరీ భవత్యేషా, అమృతత్వ ఫలప్రదా!

11/24/2019 - 22:21

త్రికాలమ్ యః పటే నిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మి ర్భవేనిత్యం ప్రసన్న వరదా శుభ
భావం: ఎవరైతే ఈ స్తోత్రాన్ని 3 కాలముల యందు ఎవరు పఠిస్తారో మహాలక్ష్మి ఆనందించి వారి శుభప్రదమైన కోరికలు తీర్చి శత్రువులు లేకుండా చేస్తుంది.

11/24/2019 - 22:20

‘‘భద్రం కర్ణ్భిః - మా చెవులు ఎప్పుడూ శుభప్రదమైన వార్తలనే వినవలెను. మా కన్నులు ఎప్పుడూ మంగళకరమైన సన్నివేశాలనే చూడవలెను.సర్వవేళలా మానవాళికి ఎప్పుడూ సన్మంగళము కలుగుగాక - అని వేదంచెబుతుంది. ఈ మంత్రాలే మానవాళికి మహాభ్యుదయాన్ని కలిగిస్తుంటాయ. అందుకే మన పెద్దలు శుభానే్న పలుకాలి అంటారు. ఎపుడైన అనుకోని కారణాలతో అనుకోనివి జరిగితే అమంగళం అమంగళం దూరం కావాలి అని వెంటనే అనేవారు.

11/24/2019 - 22:14

తే.గీ. వృద్ధులనుఁ జేరి మాటాడి విసుగుఁ గొనకఁ
గాస్తసమయము వారితో గడపినంత
వారియాయువుఁ బెంచిన వారలౌదు
రట్టివారల యాసీస్సులద్భుతాలు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/21/2019 - 22:33

స్వయంగా దీపారాధన చేసినా, వెలిగించిన దీపం గాలికి కొండెక్కి ఇంకా ఆ ప్రమిదలో నూనె ఉండిపోతే ఆ వత్తి వెలిగించినా, కాసిని మారేడు దళాలను నమశ్శివాయ అంటూ శివలింగంపైన ఒక్కసారి వేసినా, చిన్న చెంబుతో నీళ్లు నమశ్శివాయ అంటూ శివలింగంపై పోసినా, అలా పోసేవాళ్లతో పాటు నిలబడి నమశ్శివాయ అంటూ నమస్కరించినా కార్తీకంలో శివభగవానుడు ఎనలేని సంపదను ఇస్తాడు. శివ అంటేనే మంగళం.

11/21/2019 - 22:29

దయ అంటే కరుణ. ఈ కరుణ మృదుస్వభావులకే ఉంటుంది. మానవుల మనస్సులు మృదువుగా ఉండాలి. తమ జీవన విధానంలో తమ స్వభావాన్నీ, తమ నిత్య నైమిత్తక కర్మలను చక్కగా చూసేవారికి కష్టం కలుగకుండా ప్రవర్తిస్తూ తమ మనస్సులను జాగ్రత్తగా ఉండునట్లు చూసుకోవాలి. పరోపకారంలో దయ, కరుణ రెండూ నిండి ఉంటాయి. ఎదుటివారి కష్టాలలో సాయం చేయడంలో నిస్వార్థులై మెలగాలి.

11/21/2019 - 22:27

సిద్ధిబుద్ధి ప్రదేదేవి, భుక్తి ముక్తి ప్రదేదేవి
మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే
ఎవరైతే విజయాన్ని , జ్ఞానాన్ని, భోగాన్ని, విముక్తిని ప్రసాదిస్తారో ఎవరైతే మంత్ర స్వరూపిణియో ఆ మహాలక్ష్మికి ప్రణమిల్లుతున్నాను.

Pages