S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/17/2019 - 22:22

అమ్భుభృత్ = అంభు+ భృత్నీరు + కలిగి ఉండేది మేఘం,; ఘనః= బరువైన నీటి బిందువులు ఉన్న మేఘం, జీమూత = మేఘం ; ముదిర = మేఘం; జలముక్ =చెదురుమొదురుగా పడుతున్న వాన, ధూమయోని= పొగ మంచు, కాదంబిని= క్రమములో ఉన్న మేఘములు;
మేఘమాలా= మేఘ +మాలా = మేఘ+ దండ = మేఘముల యొక్క దండ, మెగాద్భవే= మేఘములలో ఉన్న నీరు , అభ్రియమ్= మేఘమునకు సంబంధించినది.
87 88 శ్లోకములు

11/17/2019 - 22:21

దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వ తమోప
హమ్‌దీపేన సాధ్యతే సర్వం సంధ్య దీపం నమోస్తుతే

భావం: దీపమే పరబ్రహ్మం. ఆ దీప పరబ్రహ్మమే అజ్ఞానమనే చీకటిని తరిమివేస్తుంది. ఆ దీపకాంతులే అన్నింటినీ సాధిస్తాయి. అటువంటి సంధ్యాదీపానికి నేను ప్రణమిల్లుతున్నాను.

11/16/2019 - 21:50

దక్షిణ పశ్చిమం వైపు రాహువు, భానుర్భానుజో = భాను+ భాను + భానుజ= సూర్యుడు+ సూర్యుని పుత్రుడైన శని, పశ్చిమ దిక్కు వైపు శని. విధుః = చంద్రుడు, ఉత్తర పశ్చిమం వైపు చంద్రుడు, ఉత్తరం వైపు బుధుడు, ఉత్తరం - తూర్పు వైపు బృహస్పతి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
82 శ్లోకం
ఐరావతః పుండరీకో వామనః కుమూదోన్జనః
పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః

11/15/2019 - 04:57

79 శ్లోకం
దిశస్తు కకుభః కాష్టా ఆశాశ్చ హరిశ్చ తాః
ప్రాచ్యవాచీ ప్రతిశ్చత్యాః పూర్వ దక్షిణ పశ్చిమాః
ఉత్తరాదిగుదీచీ శ్యాదిశ్యమ్ తు త్రిషు దిగ్భవే॥
దిశః= దిక్కు, 4వ భాగం , కకూభః= దిక్కు, కాష్టా= 4వ భాగము, ఆశాః-4వ భాగము, హరితః= దిక్కు ఈ 5 దిక్కుల యొక్క వివిధమైన పేర్లు.

11/15/2019 - 04:56

ఆదిదేవమ్ నమస్త్భ్యుం ప్రసీద మమ భాస్కర
దివాకర నస్త్భ్యూమ్ ప్రభాకర నమోస్తుతే
భావం:
నన్ను దయతో చూసే ఆదిదేవుడైన ఓ భాస్కరా (ప్రకాశించు) నీకు ప్రణమిల్లుతున్నాను. ఓ దివాకర (రోజంతా నడిపించి ఓ ప్రభాకర (వెలుగును ఇచ్చే) మీకు నేను ప్రణమిల్లుతున్నాను.

11/15/2019 - 04:55

సీ. ఆనత గైర్వాణి అంబుజాసనురాణి
కింకిణీక్వాణంబు క్రీడ గాదె!
అజ్ఞాన మయతామసాబ్ధివిహారికి
వేడుకౌ దివ్వెల ఓడ గాదె!
మెదడుకు మేతౌచు ఎదకుజ్ఞానఫలంబు
నిడి సేద దీర్చెడి నీడగాదె!
పయనించు మనుజుని బ్రతుకు టెడారిల
తోడౌ ఒయాసిస్సు జూడగాదె!
బహుళ పక్ష సంస్కృతికి ఆస్పదముగాని
మేలిముదమిడు వెనె్నల మేడ గాదె!
భవ్యభారత కీర్తిగా పరిఢవిల్లు

11/15/2019 - 04:53

తే.గీ. ఉరకలను వేసెడుత్సాహమున్న చాలు
వేగవంతాన దూసుకుపోగవచ్చు
నిత్య చైతన్యముంజూప నిన్ను మించు
వాడు జగతినఁ గనరాడు ఱేడు వీవె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/14/2019 - 22:38

కైలాసః= కైలాస పర్వతం దగ్గర ఉన్న గంధమాదన పర్వత (ప్రస్తుతం గదర్హ్వాల్ హిమాలయములు) ప్రాంతములలో నివసిస్తారు. ; అలకపూరి= కుబేరుని పట్టణము, విమానం తు పుష్పకం= కుబేరుని విమానం పుష్పకం;కినె్నర ;కింపురుష; తురంగవదన= తురంగ+వదన =అశ్వము +ముఖము= అశ్వముఖము కలిగిన వారు, మయు=జింక ముఖము కలిగినవారు, ఉ 4 జాతుల వారు దేవత గణములకు సంబందించినవారు. కుబేరుని సహాయకులు.

11/14/2019 - 22:37

గురుర్ బ్రహ్మమ గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
భావం: గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువు సాక్షాత్ పరబ్రహ్మ, ఐన ఆ గురువుకి నమస్కరిస్తున్నాను.

11/14/2019 - 22:36

తే.గీ. కాలుసేతులాడక యున్న ఁ గాని దేది
లేదు జగతిన యోచింప నేది యేరి
కైన సాధ్యమే తలుపంగఁ గార్యదీక్షఁ
బూని యడుగులు గదిపినఁ బోదు ఫలము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages