S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/05/2019 - 19:46

‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అంటూ కార్తికంలో ఏ పని చేసినా అది వేయరెట్ల అధిక ఫలాన్నిస్తుంది. హరి, హరునకు ఇద్దరికీ ప్రీతి పాత్రమైనదీ కార్తీకం. పరమశివునకు ప్రీతి కలిగించ డానికి ఈ మాసంలో వనభోజనాలు చేస్తారు. దీపతోరణాలు ప్రముఖంగా తీర్చి దిద్దుతారు. దీపా దానాల్లో ఉసిరిక ఫలం పైన ఆవునేతిదీపం వెలిగించి పెట్టి దానం చేస్తే ఎంతో పుణ్యదాయకం. ‘‘సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం’’ ...

11/04/2019 - 19:42

శివుని సేవింతు నిరతంబు చిత్తమలర
నతడు ధ్యానించు చుండు నన్నరవరతము
ఆదిశక్తి పరాత్పరుండా సదాశివుండు
అస్యమంత మదీయ శక్త్యం శకంబు

పరమ విజ్ఞాన భాండంబు బ్రహ్మమాయె
విశ్వమంత వ్యాపించి విష్ణువాయె
నిహపరానంత శక్తి సమేతుడు మహేశుడాయె
త్రిగుణ త్రిపురాసుర సంహారమే ఏకం
అద్వితీయమైన అద్వైత పరమాత్మ

11/03/2019 - 22:38

బ్రాహ్మణి(సర్వసతి) మహేశ్వరి (రౌద్రిని) కౌమారి(కార్తికేయని) వైష్ణవి (లక్ష్మి) వరాహి, ఇంద్రాణి, చాముండి అనే ఏడు శక్తుల సహాయంతో యోగేశ్వరి అంధకాసురుని వధించింది. ఈ విధముగా సప్త మాతృకలు జన్మించారు.
37 శ్లోకం
విభూతిర్భుతిరైశ్వర్య మణిమాదికామస్త్ధ

11/03/2019 - 22:35

నమోస్త్వనంతాయ సహస్ర మూర్తయే
సహస్ర పాదాక్షి విరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటీ యుగధారిణే నమః

11/03/2019 - 22:35

ప్రతి మనిషికి కోరికలు బాధ్యతలు ఉంటూ ఉంటాయ. కోరికలు తీర్చుకోవడంలో ఉన్న ఆతురత బాధ్యతలను నెరవేర్చడంలో చాలామందికి ఉండదు. కొందరు ముందు బాధ్యతలు తీర్చుకుని తర్వాత కోరికల గురించి ఆలోచిస్తారు. మరికొందరు కేవలం కోరికలనే ఎట్లా ఫలవంతం చేసుకోవాలో మాత్రమే చూస్తుంటారు. అలాంట పుడే ఇతరులకు సమస్యలు వారి వల్ల కలుగుతుం టాయ. కర్తవ్యనిర్వహణ చేస్తే చాలు బాధ్యతలు వాటికవే నిర్వహించబడుతాయ.

11/01/2019 - 19:43

ప్రాణికోటికంతటికీ ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. ప్రభాకఠుడే సూర్య భగవానుడు. ఆదిత్య- సూర్య- ఖగ- పూషా- గభస్తిమాన్- సప్త సప్తి- మార్తాండ- భాస్కర- రవి- వ్యోమనాథ- దివాకర- సవిత. ఇలా సూర్యభగవానునికి 50కిపై పేర్లు ఉన్నాయని అమరకోశం చెప్తుంది. అరుణోదయ కిరణకాంతులతో చతుర్దశభువనాల్ని పాలించే భాస్కరుని దేవతలు.

10/31/2019 - 19:09

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=================================================
శ్లో: హం, క్షం, వర్ణోపాత్త, పత్ర ద్వయాఢ్యం
శంభుస్థానం దోం మయం బుద్ధి తత్త్వం
భ్రూమధ్యస్థం హాకినీవాస మారా
దాజ్ఞాచక్రం భద్రమంతర్థరామి
ఆజ్ఞా చక్రాబ్జ నిలయాశుక్ల వర్ణా షడానన

10/30/2019 - 19:11

ఒకరి వద్ద అధికముగా ఉన్న దానిని అవసరమున్నవారికి ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడమే దానం అనవచ్చు. దానాల్లోకి ఉత్తమమైన దానం ఏదని ఆలోచిస్తే అది జ్ఞానదానమే గొప్ప అని విజ్ఞులు అంటున్నారు. అన్నదానం పుణ్యదానమే. గొప్పదానమే అయినప్పటికీ అన్నమో రామచంద్రా అనే వారికి, ఆకలికి తట్టుకోలేక పోతున్నవారికి అన్నం పెట్టడం అంత గొప్ప కార్యం మరేదీ ఉండదు. కాకపోతే ఈ దానం క్షుద్బాధనుమాత్రమే తీరుస్తుంది.

10/28/2019 - 19:43

జన్మజన్మాంతర పాపాలను దహించేవేసే మాసమే కార్తికం. స్నానానికి, దీపానికి, దానానికీ ఈ మాసం విశేషమైంది. శరదృతువులో పుష్టిమంతుడైన చంద్రుడు తన శీతల కిరణాలతో సమస్త జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. శివకేశవులిద్దరికీ ఈ నెల ఎంతో ప్రీతిపాత్రమైంది.

10/25/2019 - 20:04

ఓ చీకటీ నీవెక్కడ?

Pages