S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/13/2019 - 20:02

జీవనది సార్థత్రికోటికి కొలువది!
తరాల సంస్కృతుల్ని జీవన నాగరికతలు
ప్రవాహార్థ్రతలుగా కాలం వెంబడి
సార్థక్యం దాలుస్తుంది

ఆపావనాదారాలు
సకలకల్మషహరణాలు
నిత్యవిలసితంగా
సత్యమహిమాన్వితమై
లోక హితం కోరే పుణ్యవారాశినది..
సాచిన వేల వందల జలహస్తాలోంచి
దృశ్యమానమయ్యేలా
పధగమనం తెలియజెప్తోంది

08/12/2019 - 19:02

భగవంతుడు అన్నింటికీ అతీతుడు. సర్వసృష్టి కర్త భర్త ఆయనే. ఆయనే లయకారుడు. కానీ ఈ సృష్టిలో ఏ ప్రాణి కర్మసారం ఏఫలం అందివ్వాలో దానినే అందిస్తాడు. ఆ అందించడంలో మన తన అనేభేదాలు ఉండవు. ప్రాణులు పాపభీతి లేకుండా పనిచేస్తే అటువంటి ఫలితానే్న భగవంతుడు ఇస్తాడు.

08/11/2019 - 20:07

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. రణరంగంలో ఇంకా ఎక్కడి శవాలక్కడే పడి వున్నాయి. పాండవులు శ్రీకృష్ణుని వెంటబెట్టుకుని గాంధారి, ధృతరాష్ట్రుల వద్దకు వెళ్ళారు. పెదతండ్రి పాదాలమీద పడ్డారు. ధర్మరాజు చేతులు జోడించి ‘పెదనాన్నా! వంశ నాశనానికి పాల్పడిన పాపిని నన్ను నిందించు.. శపించు’ అంటూంటే, భీమసేనుడు ‘‘పెద్దమ్మా! నీ కొడుకులందరినీ సంహరించిన పాపిని, నన్ను శపించు’’ అన్నాడు దుఃఖిస్తూ.

08/09/2019 - 19:38

వేదవేదాంగాలు, అన్ని ధర్మశాస్త్రాలు చదివి జ్ఞాన సంపద సమకూర్చుకోవటం అందరికీ సాధ్యంకాదు. అభిలాష వున్నా అభినివేశంతో వాటిని అధ్యయనం చేసి ఒంటపట్టించుకోవటం చాలామందికి కుదరకపోవచ్చు. అధ్యయన, స్వాధ్యాయ, నిదిధ్యాసల వంటి యోగ ప్రక్రియలకు వీలులేని సామాన్యులకోసం శ్రీవ్యాస భగవానుడు భాగవత పురాణం ప్రవచించాడు.

08/08/2019 - 20:08

‘‘నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సుర పూజితే; శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మీ నమోస్తుతే’’. శంఖ చక్ర గద ధారణియైన మహాలక్ష్మీ దేవి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లాంటి అష్టైశ్వర్య ప్రదాయిని. అష్టసంపదలు ఒసంగే జగన్మంగళ దాయిని. అష్టైశ్వర్యాలు కలుగజేసే రూపం వరలక్ష్మిగా ఆరాధనీయం. కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలనిచ్చే జగజ్జనని వరలక్ష్మి.

08/07/2019 - 20:02

ఒకానొక కాలంలో వ్యాస మహర్షికి మనసు వ్యాకులం చెందింది. హృదయావేదన కలిగింది. అపుడు నారదమహర్షి అక్కడికి వచ్చాడు. విషయం గ్రహించాడు. సర్వ ధర్మాలను వివరించే మహాభారతం రచించి నప్పటికీ ఈ మనోవ్యాకులత వ్యాసునికి ఎందుకు కలిగి ఉంటుందని ఆలోచించాడు.

08/06/2019 - 20:42

దేవదానవులకు జరిగిన యుద్ధంలో, దేవతల్లో చాలామంది మరణించుట వలన , రాక్షసుల బలం పెరుగుట దానివలన వీరికి ఇబ్బందులు ఎదురవడం వల్ల ఇంద్రాదులు బ్రహ్మవెంట శ్రీహరిని శరణువేడిరి. నారాయణుడు ప్రత్యక్షమై పాలసముద్రము మధించిన అమృతము లభించుననియు దానిని సేవించిన మరణము కలుగదని వారికి అభయం ఇచ్చాడు. దేవదానవులు మంధర పర్వతమును కవ్వంగా వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకొని, క్షీరసాగరాన్ని మధించారు.

08/05/2019 - 18:23

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే
అని శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని అత్యంత ఆసక్తితో అతివలు చేస్తుంటారు.

08/04/2019 - 22:23

తే.గీ. బాల్యమును హరియించుచుఁ బనియు ఁ గట్టు
కునియు బాలలఁ గానె్వంట్ల గోడలందు
నకట! బందీ ఁ జేతురీనాడు గాంచ ఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

07/23/2019 - 19:39

ధ్యానము అంటే ఒక వస్తువు మీద లేక ఒక నామం మీద మనస్సును ఏకాగ్రముగా నిలుపుట. ‘్ధ్యస’ సహజంగా దేనిమీద పోతే మనస్సు కూడా దానిమీదే లగ్నమవుతుంది. ఒక వస్తువు గూర్చి తదేక నిష్టతో ధ్యానించునపుడు మనస్సులో ఒక ఆనంద అనుభూతి కలుగుతుంది. మానవ శరీరం, ప్రాణము, మనస్సుకు సంబంధించినది. శరీరము, ప్రాణము, మనస్సు- ఈ మూడింటిని ఏకం చేసి ఒకే విషయంపై మీదే కేంద్రీకరించడమే ధ్యానం.

Pages