S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/10/2019 - 18:56

ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః
ఋణక్షయే క్షయం యాంతి కాత్రపరివేదనా’’
పశువులు, భార్య, పుత్రులు, ఇల్లు, ఆస్తులు- ఇవన్నీ కూడా మనిషి గత జన్మలో చేసుకున్నటువంటి సుకృతాలను (పాపపుణ్యాలను) బట్టి కలుగుతాయి. ఋణం తీరిపోగానే ఇవేవీ ఉండవు.

07/08/2019 - 18:44

‘‘సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు
సంతోషికెప్పుడు జరుగు సుఖము
సంతోషిగాకుంట సంసారహేతువు
సంతసంబున ముక్తిసతియు దొరకు
పూట పూటకు జగంబున యదృచ్ఛాలాభ
తుష్టిని తేజంబుతోన పెరుగు
పరితోషహీనత ప్రభచెడిపోవును
జగలధార ననలంబు సమయునట్లు
నీవు రాజవనుచు నిఖలంబునడుగుట
తగవు గాదు; నాకు తగిన కొలది
యేను వేడికొనిన రుూ పదత్రయమును

07/07/2019 - 23:13

మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. ఇలా ఏమిటా అంటారా.. వినండి.. ఇందులోనే మంచి విజ్ఞానముంది. కూపస్థమండూకాల్లా మానవ జన్మ లభించినా ఉన్న విజ్ఞానంతోనో లేక చుట్టు పక్కల జరిగేవే ప్రాముఖ్యమైనవి అని వాటిని మాత్రమే చూస్తూ ఉంటే జ్ఞానం వృద్ధి అవదు. విజ్ఞానం పెరగదు. మానవుడు తనకున్న విచక్షణా వివేచనలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకొనాలి. ధర్మమేమిటో వివేచించుకోవాలి. అధర్మమేమిటో తెలుసుకోవాలి.

07/07/2019 - 23:07

సురుచిర విశాల ప్రాకార సుందరమగు
ద్వారకాపురీ నిర్మాణ తరుణమందు
శౌరి వినతిని మన్నించి సాగరుండు
వెనదిరిగినట్టి వైనమ్ము వింతగొలుపు

07/02/2019 - 19:31

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారము చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణిమలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పౌర్ణిమ రోజున ‘‘పూర్వాషాఢ’’ నక్షత్రములో సంచరించే మాసం ‘‘ఆషాఢ మాసం’’.

06/30/2019 - 22:36

పరమాత్మను పొందాలనుకొనేవారు, పురుష ప్రయత్నము సాగించువారు రెండువిధాలు. శాస్తమ్రును అనుసరించువారు, శాస్తమ్రును అతిక్రమించువారు, శాస్తమ్రు శాస్ర్తీతముగా ఉంటే పరమార్థమును ముందుంచును. ‘వాసనలు’ ‘శుద్ధ’ మనియు ‘అశుద్ధ’మనియు రెండు విధములు. శుద్ధ వాసనలు, శుద్ధతత్వమునకు దారితీసి భగవంతుని తత్వాన్ని గ్రహించుతాడు. అశుద్ధవాసనలు తామస, రాజసిక తత్వములను ప్రకోపింప చేసి నరకానికి గొనిపోతాయి.

06/27/2019 - 22:18

తే.గీ. మూర్తి త్రయమందు నొకడివై మోకరిల్లు
వారికండగ నిలుచుండి వరములమిత
ముగ నొసంగెడి లయకారి! మునిహృదయుడ!
పాహిమాం పరమేశ్వరా!! పార్వతీశ!

06/26/2019 - 22:17

శివుడు- మాధవుడు

తే.గీ. వల్లవాంగనల్ విరులను జల్లువేళ
కలువ పుప్పొడి మేనిపై యలముకొనగ
భస్మకలితాంగుడైనట్టి భవుని వోలె
ధవళ కాంతులన్ కృష్ణుండు తనరు చుండె
భావం: శ్రీకృష్ణుని పై గోపికలు పూలజల్లులు కురిపిస్తూ ఉన్నారు. కలువ పూవుల పుప్పొడి నీలమేఘశ్యాముని మేనిపై అలముకొనగా, విభూతిని ధరించిన పరమశివునివలె తెల్లగా మెరిసిపోతున్నాడు.

06/25/2019 - 22:23

అరణ్యవాసంలో శ్రీరాముడు, సీతా లక్ష్మణ సమేతుడై చిత్రకూట పర్వతంపై పర్ణశాల లో నివసిస్తున్నారు. ఓరోజు నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి రోజూ లాగే ఆ రోజు కూడా తినడానికి అవసరమైన కందమూ లాలు, అడవిలో దొరికే పండ్లు ఫలాలు కోసం బయలుదేరారు. వారికి అలవాటు ప్రకారమే సీతమ్మ రామభద్రునికి, లక్ష్మణునికీ వారి ధనుర్బాణాలు అందించింది.

06/25/2019 - 22:19

శరదిందు చంద్రికలు
తే.గీ. సాంద్ర శరదిందు చంద్రికా సమయమందు
అలనిశాసతి వదనాబ్జ తిలకమనగ
చంద్రుడాయనంగుని చేతి చక్రమట్లు
చల్లచల్లని వెనె్నలల్ జల్లుచుండ
వ్రజయువతులెల్ల వ్రేపల్లె వాడలోన
యదుకిశోరుని తలపులు హృదిని నిండ
మునిగి తేలిరి వారెల్ల మోహవార్థి

Pages