S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/02/2018 - 20:58

సగటు మనిషి జీవితం
ఆశకు నిరాశలకు మధ్య సాగే ఊగిస లాంటి పయనం
నిరాశల తిమిరాలపై సమరాన్ని సలుపుతూ
ఆశల తీరాలని చేరలేక
ఎడారిలోని ఎండమావుల్లా.. అక్కడక్కడా కనిపించే
ఆశల పల్లకీలో విహరిస్తూ
మనుగడ సాగిస్తుంటే...
సగటు మనిషిని నైరాశ్యంలోకి నెట్టేస్తాయి ఎదురయ్యే ఓటమిలు!
సగటు మనిషికి జీవితమంటే.. నాడు జీవించడం..
నేడు జీవన్మరణాల పోరాటం

06/29/2018 - 21:39

ఆ గ్రహంలో
తానొక్కడే ఉంటాడు
పక్కనే పొంచి ఉన్న ఉమ్మ సాగరం
వాడిని తన కళ్లలోకి
జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది...

ఒక పెద్ద తీగ
మరో ప్రపంచపు ఉదయాన్ని, రాత్రిని
ఊపిరిలో బంధించి
మెల్లగా వాడి గుండె గదుల్లోకి
జారవిడవగానే
అమ్మ చేతి తొలి శ్వాస ముద్దను
రుచి చూశాడు...

06/26/2018 - 21:31

ఉ॥ నమ్మని నాస్తికాళికిని, నమ్మిక పుట్టక దైవమందునన్
కమ్మని భావజాలముల, గమ్మున మానస వీధులందునన్
గ్రమ్మగ జేయగా దలచి, రంజిలు జ్ఞాన విశేష బుద్ధిచే
‘అమ్మ’ను సృష్టిచేసె, పరమాత్ముడు ధారుణి చక్రమందునన్

కం॥ ‘మమీ’యను మృత శబ్దము
అమ్మను పిలువంగ నెట్లు, అనువుగ నుండున్
‘అమ్మా!’యను పిలుపువినగ
అమ్మమ్మల మనము సైత మానందించున్

06/26/2018 - 21:29

దేశమంటే మన ఇల్లు
మనకి నీడనిచ్చే వాకిలి
మనమంతా ఒక్కటనే భావనను చిదిమేసే
దుర్మార్గులని శిక్షించక వదిలేస్తే
దేశానే్న మింగేస్తారు
సొంత లాభం కోసం కన్నతల్లి
గుండెల మీద గుద్దులు గుద్ది హింసించే
నరరూప రాక్షసులను తరిమికొట్టాలి
మంచిని వక్రించే మహా చమత్కారుల
చేతలను మొగ్గలోనే తుంచెయ్యాలి
పట్టి పీడించే చీడపురుగుల్లా వాళ్లను

06/18/2018 - 23:43

తెలుగు భాష మనది వెలుగు బావుటా మనది
తెలుగు పలుకే పలుకు తీయ తేనియలు చిలుకు
నుడికారపు సొంపు వీనులకు ఇంపు

కోటి వీణల స్వరము తెలుగు కోయిల గానము
తొలి తెలుగు పదము నాగబు నవ్య పద సంపద మనది
ఖండాంతర ఖ్యాతి అఖండ కావ్య సంపత్తి

06/15/2018 - 21:56

పడమటి కొండల్లో
అలసిన ఎర్రటి సూరీడు
వాలిపోతుంటే
మళ్లీ వీలుకాదేమోనని
గువ్వలు చివరి ఊసు ఏదో
సూరీడి చెవులో ఊదడానికి
గగనతలాన వరుసకట్టిన
తరుణంలో.. కొలను గట్టున
పున్నాగపూలచెట్టు నీడలో
మేనిలో వాసంత సమీరాల
చిరుస్పర్శలు
మదిలో నీ ఊహల గిలిగింతలు
కొలనులో కలువల కమ్మని కబుర్లు
కనులలో కనుపాపల కలవరింతలు

06/14/2018 - 01:06

ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికి మొబైల్ ఫోన్‌లతో
అందరినీ కలిపే పలకరింపులతో,
అవే అసంతృప్త కడుపులతో!

ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికి చేరిన టీవీలతో
అందమైన ప్రపంచం వీక్షిస్తూ,
అవే ఎడారి చూపులతో!

ఔను
నా పల్లె ఎంతో మారింది!
ఇంటింటికీ సరిపడే కరెంటుతో
వెలుగులు నింపే బల్బులతో,
అవే చీకటి బతుకులతో!

06/07/2018 - 21:34

పంచభూతాల కదలికలను
ప్రాణులలో పరావర్తనం చెందించి,
పంచ ప్రాణాలను ఏకంచేసి,
గుట్టుగా బందీ చేసిన
కాలప్రవాహానికి
ఆద్యంతాలు శూన్య సమాసం

06/06/2018 - 22:09

ఒకప్పుడు
మృదు తరంగ మృదుపద మంజీర నాదాలతో
వాక్ భూషణ పండితులతో.. సాహితీ సభలతో
నిరంతరాయంగా.. అద్వితీయంగా వెలిగింది
మహా విద్వాంసులతో సంగీత ఝరులు
వీనుల విందుగా వినిపించేవి

ఆ దారి వెంట వెళ్లేవారెవరైనా సరే
అక్కడ జరిగే సభలోకి
ఒక్కసారి తొంగి చూశారంటే...
కాళ్లు రానని మొరాయిస్తాయి

06/05/2018 - 21:51

- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా -
*
పుడమి పేగుల రక్కి బుసకొట్టు ప్లాస్టిక్కు
వేయి కోరలు సాచి విషముగ్రక్కు
ఓజోను పొర చిట్లి తేజోవిహీనమై
చెడు రశ్మి కురిపించు సెగల ముంచు
గాలి కాలుష్యమ్ము కాలకూట విషమ్ము
ఆమ్ల వర్షమ్మయి హాని గొల్పు
ఫ్యాక్టరీ వ్యర్థాల పరగు ననర్థాలు
కల్మశమ్ములు పూయ కదులు నదులు
విశ్వకల్యాణ దీప్తులు వెలుగ జేయు

Pages